హైదరాబాద్‌లో విషాదం.. ఖైరతాబాద్‌ గణపతిని చూసేందుకు వెళ్తూ.. | Two Youths Died In Road Accident While Going To Visit Khairatabad Ganesh - Sakshi
Sakshi News home page

Hyderabad Road Accident: హైదరాబాద్‌లో విషాదం.. ఖైరతాబాద్‌ గణపతిని చూసేందుకు వెళ్తూ..

Published Thu, Sep 21 2023 2:51 PM | Last Updated on Thu, Sep 21 2023 3:13 PM

Two Youths died In Road Accident While Going To Visit khairatabad ganesh - Sakshi

సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంల ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. ఖైరతాబాద్‌ మహాగణపతిని దర్శించుకునేందుకు వెళ్తుండగా గురువారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది.  వివరాలు.. బోడుప్పల్‌కు చెందిన యశ్వంత్ (22) . ఇదే ప్రాంతానికి చెందిన సాయిరామ్‌ (31)  స్నేహితులు.

అర్ధరాత్రి దాటిన తర్వాత ఇద్దరు ఖైరతాబాద్ గణపతిని దర్శించుకునేందుకు బయల్దేరారు.  యశ్వంత్, సాయిరామ్‌ స్పోర్ట్స్ బైక్‌పై బోడుప్పల్ నుంచి వెళ్తుండగా అడిక్‌మెట్ బ్రిడ్జి మీద వేగంగా బైక్ నడుపుతూ డివైడర్‌ను ఢీ కొట్టారు.  ఈ ఘటనలో బైక్‌ నడిపిన యశ్వంత్ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్ర గాయాలైన సాయిరామ్‌ను ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఉస్మానియా వర్సిటీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement