మేమూ వచ్చేస్తున్నాం..  | Two Students From Ukraine Arrive In India | Sakshi
Sakshi News home page

మేమూ వచ్చేస్తున్నాం.. 

Mar 1 2022 4:45 AM | Updated on Mar 1 2022 4:45 AM

Two Students From Ukraine Arrive In India - Sakshi

ట్రైన్‌లో విద్యార్థులు

యాదగిరిగుట్ట: ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన ఇద్దరు విద్యార్థులు.. రైలులో సరిహద్దు ప్రాంతానికి చేరుకున్నట్టు తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణానికి చెందిన గంజి భానుప్రసాద్, ముడుంబై శేషఫణిచంద్ర ఉక్రెయిన్‌లోని జప్రోజియా స్టేట్‌ మెడికల్‌ వర్సిటీలో వైద్యవిద్యనభ్యసిస్తున్నారు.

యుద్ధం నేపథ్యంలో అక్కడ చిక్కుకుపోయిన వీరిద్దరు.. తాము 1,200 కిలోమీటర్ల దూరంలోని సరిహద్దుకు రైలులో బయల్దేరామని, అక్కడ చేరుకోవడానికి 18 గంటలకుపైగా సమయం పడుతుందని, తమతో పాటు పలువురు అదే రైలులో ప్రయాణిస్తున్నట్టు సోమవారం తల్లిదండ్రులకు ఫోన్‌చేసి చెప్పారు. సరిహద్దుకు చేరుకోగానే సమీపంలోని విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి భారత్‌కు చేరుకుంటామని వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement