
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలోని బొల్లారం రైల్వే స్టేషన్ సమీపంలో దారుణం జరిగింది. రైలు ఢీకొని ఇద్దరు మృతిచెందారు. రైలు పట్టాలపై నడుచుకుంటూ వెళ్తున్న ముగ్గురు యువకులను వేగంగా దూసుకొచ్చిన ఓ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డాడు.
ఆ యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వారిని ఆసుపత్రికి తరలించారు. ఇవాళ (శనివారం) మధ్యాహ్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతులు కార్తీక్(19) కార్ఖానా, మల్లికార్జున్(20) వెస్ట్ మారేడు పల్లి వాసి వాసులుగా గుర్తించారు. మృతులు ఇద్దరూ కూలీలుగా పని చేస్తున్నట్లు రైల్వే పోలీసులు వెల్లడించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వ్యక్తి బొల్లారానికి చెందిన ఫిషర్ మెన్ శివానంద్(35)గా గుర్తించారు. బొల్లారానికి చెందిన ఫిషర్ మెన్‌గా గుర్తించారు.