
హైదరాబాద్: అవిభక్త కవలలైన వీణావాణీ సోమవారం 20వ జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. వెంగళరావునగర్ డివిజన్ పరిధిలోని మధురానగర్‌కాలనీలోని మహిళా శిశుసంక్షేమ శాఖ బాలసదన్‌లో వీరు ఆశ్రమం పొందుతున్నారు. మురళీ–నాగలక్ష్మి దంపతులకు జని్మంచిన ఈ కవలల తలలు అతుక్కుని జని్మంచిన వీరిని ఎన్ని ఆసుపత్రులకు చూపించినా వారిని విడదీయడం సాధ్యం కాలేదు. దాంతో వారిని చిన్నతనం నుంచే తల్లిదండ్రులు స్టేట్‌హోంలోని శిశువిహార్‌లో ఉంచారు.
నాటి నుంచి నేటి వరకు కూడా వారు అక్కడే ఆశ్రయం పొందుతూ విద్యనభ్యసిస్తున్నారు. పది, ఇంటర్‌లోనూ ఇరువురు మంచి మార్కులు సాధించారు. భవిష్యత్‌లో సీఏ కావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నారు. ప్రస్తుతం ఆంధ్రా మహిళా సభ కళాశాలలో బీ.కాం ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. సోమవారం వీరి జన్మదిన వేడుకలు బాలసదన్‌లో తల్లిదండ్రులు, అధికారుల సమక్షంలో నిర్వహించారు.