హైదరాబాద్‌లో టర్కీ ఫుడ్‌ ఫెస్టివల్‌

Turkey Food Festival In Banjarahills At Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బంజారాహిల్స్‌లోని హయత్‌ ప్లేస్‌ వేదికగా నేటి నుంచి జులై 3వ తేదీ వరకు ఫ్లేవర్స్‌ ఆఫ్‌ టర్కీ పేరుతో టర్కీష్‌ ఫుడ్‌ ఫెస్టివల్‌ను నిర్వహించనున్నారు. ఈ ఫుడ్‌ ఫెస్టివల్‌ ప్రారంభ కార్యక్రమాన్ని బుధవారం హయత్‌ ప్లేస్‌లో ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా టర్కీ కాన్సులేట్‌ జనరల్‌ ఒర్హాన్‌ ఎల్మాన్‌ ఒకన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్‌ నగరవాసుల కు తమ ఆహారం, సంస్కృతిని మరింత దగ్గర చేయాలనే ఉద్దేశ్యంతో ఈ సమ్మేళనాన్ని ఏర్పాటు చేశామ ని అన్నారు.

ప్రపంచ వ్యాప్తంగా టాప్‌ టెన్‌లో టర్కిష్‌ ఫుడ్‌ వెరైటీస్‌ ఉంటాయని తెలిపారు. హైదరాబాదీ ఫుడ్‌కు, టర్కీ ఫుడ్‌కు సారూప్యత ఉంటుందన్నారు.  ఈ ఫుడ్‌ ఫెస్టివల్‌లో పాల్గొనే వారు లక్కీ డ్రాలో భాగంగా టర్కీలో ఉచితంగా బస చేసే బహుమతిని పొందవచ్చని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేశ్‌రంజన్‌ తదితరులు పాల్గొన్నారు. 

(చదవండి: మంచు ఖండాన.. గ్రీన్‌ చాలెంజ్‌ జెండా)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top