TS: కానిస్టేబుల్ మెడికల్ టెస్టులు నిలిపివేయాలి.. హైకోర్టు ఆదేశాలు | TS High Court Orders TSLPRB To Stop Constable Medical Tests | Sakshi
Sakshi News home page

TS: కానిస్టేబుల్ మెడికల్ టెస్టులు నిలిపివేయాలి.. హైకోర్టు ఆదేశాలు

Oct 19 2023 9:30 PM | Updated on Oct 20 2023 10:20 AM

Tslprb Order To Stop Constable Medical Tests - Sakshi

తెలంగాణలో కానిస్టేబుల్ నియామక ప్రక్రియకు బ్రేక్ పడింది. రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ టెస్టులు నిలిపివేయాలని ఎస్పీలు, కమిషనర్లకు టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ కీలక ఆదేశాలు జారీ చేసింది.

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కానిస్టేబుల్ నియామక ప్రక్రియకు బ్రేక్ పడింది. రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ టెస్టులు నిలిపివేయాలని ఎస్పీలు, కమిషనర్లకు టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ కీలక ఆదేశాలు జారీ చేసింది.

పలు ప్రశ్నలు తప్పుగా రావడంతో నాలుగు మార్కులు కలపాలని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కొన్ని రోజుల క్రితం ఆదేశించినా.. నియామక ప్రక్రియ కొనసాగుతోందని పిటిషనర్లు మరోసారి హైకోర్టుకు వెళ్లారు. దీంతో మెడికల్ టెస్టులు వెంటనే నిలిపివేయాలని కోర్టు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఎలాంటి మెడికల్ టెస్టులు నిర్వహించొద్దని టీఎస్‌ఎల్‌పీఆర్‌బీకి ఆదేశాలు ఇచ్చింది. ఈ క్రమంలో బోర్డు మళ్లీ ఆదేశాలు ఇచ్చే వరకు మెడికల్ టెస్టులు నిర్వహించొద్దని నియామక బోర్డు తెలిపింది.
చదవండి: అబ్రహంకు బీఫామ్‌ ఇవ్వని కేసీఆర్‌.. కలవకుండా కారెక్కి వెళ్లిపోయిన కేటీఆర్‌

Advertisement
 
Advertisement
Advertisement