జన్వాడలో ఉద్రిక్తత: 144 సెక్షన్‌.. 21 మంది అరెస్ట్‌

TS Police Imposed Section 144 At Ranga Reddy Janwada - Sakshi

సాక్షి, రంగారెడ్డి: జిల్లాలోని జన్వాడ చర్చ్‌పై దాడి కేసులో 21 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. దీనికి సంబంధించి ఇప్పటి వరకు నాలుగు కేసులు నమోదు చేసినట్టు మొకిలా పోలీసులు తెలిపారు. 

కాగా, వివరాల ప్రకారం.. జన్వాడలో రోడ్‌ వైడ్నింగ్‌ చేయాలని ఒక వర్గం పట్టుబట్టింది. ఈ క్రమంలో పంచాయతీరాజ్‌ అధికారులు దీనికి ఒప్పుకోకపోవడంతో అక్కడున్న చర్చ్‌పై వారంతా దాడికి పాల్పడ్డారు. కాగా, చర్చ్‌ కూల్చివేతను మరో వర్గం అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడిలో దాదాపు 200 మంది పాల్గొన్నట్టు పోలీసులు గుర్తించారు.

ఇక, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేప్టటారు. ఈ కేసులో భాగంగా ఇప్పటి వరకు 21 మందిని అరెస్ట్‌ చేసినట్టు సైబరాబాద్‌ సీపీ తెలిపారు. అలాగే, జాన్వాడలో 144 సెక్షన్‌ కొనసాగుతోందన్నారు. ఈనెల 21వ తేదీ వరకు జన్వాడలో ఆంక్షలు అమలులో ఉంటాయని హెచ్చరించారు. 

whatsapp channel

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top