లా కోర్సుల్లో 5,747 మందికి ప్రవేశం  | TS LAWCET First Round Counselling 2022 Conducted | Sakshi
Sakshi News home page

లా కోర్సుల్లో 5,747 మందికి ప్రవేశం 

Nov 27 2022 1:02 AM | Updated on Nov 27 2022 3:01 PM

TS LAWCET First Round Counselling 2022 Conducted - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: లా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన తొలివిడత కౌన్సెలింగ్‌ ముగిసింది. ఎల్‌ఎల్‌బీ మూడేళ్ల కోర్సు, ఎల్‌ఎల్‌బీ ఐదేళ్ల కోర్సు, ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో కన్వీనర్‌ కోటాలో 6,724 సీట్లు ఉన్నాయి.  ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ నిర్వహించగా తొలివిడతలో 5,747 సీట్లు భర్తీ అయినట్లు టీఎస్‌సెట్‌ అడ్మిషన్స్‌–2022 కన్వీనర్‌ పి.రమేశ్‌బాబు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

కౌన్సెలింగ్‌లో 12,301 మంది అభ్యర్థులు వెబ్‌ ఆప్షన్లు ఇవ్వగా.. అందులో 5,747 సీట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. సీట్లు పొందిన అభ్యర్థులు ఈనెల 28 నుంచి డిసెంబర్‌ 3వ తేదీలోపు నిర్దేశించిన కాలేజీల్లో రిపోర్టు చేయాలన్నారు. ఈ నెల 30 నుంచే సంబంధిత కోర్సులకు తరగతులు ప్రారంభం కానున్నట్లు వివరించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement