పోడు భూములకు పట్టాల పంపిణీపై స్టేకి హైకోర్టు నో

TS High Court Orders Govt File Counter Lowlands Regulation PIL - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పోడుభూముల క్రమబద్ధీకరణపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టులో నేడు(సోమవారం) విచారణ జరిగింది. ఈ సందర్భంగా.. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

పోడు భూములకు పట్టాలి ఇవ్వడం చట్ట విరుద్ధమనిటీ ‘ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్’ పద్మనాభరెడ్డి హైకోర్టులో పిల్‌ వేశారు.  అటవీ హక్కుల చట్టం,  నిబంధనలు, సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా.. ప్రభుత్వ మెమో ఉందని పిటిషనర్ వాదనలు వినిపించారు. అయితే.. పొడుకు పట్టాలు ఇవ్వాలంటూ న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ ఇంప్లీడ్ పిటిషన్‌ దాఖలు చేశారు. 

ఇక.. పోడు భూములకు పట్టాల పంపిణీపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. పోడు భూముల క్రమబద్ధీకరణలో చట్టం, నిబంధనలు పాటించాలని ఆదేశిస్తూ.. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు జూన్ 22కు తదుపరి విచారణ వాయిదా వేసింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top