కోకాపేట, ఖానామెట్‌ భూముల వేలం ఆపేందుకు హైకోర్టు నిరాకరణ | TS HC Refuses To Stop Kokapet And Khanamet Lands Auction | Sakshi
Sakshi News home page

కోకాపేట, ఖానామెట్‌ భూముల వేలం ఆపేందుకు హైకోర్టు నిరాకరణ

Jul 14 2021 6:29 PM | Updated on Jul 14 2021 7:28 PM

TS HC Refuses To Stop Kokapet And Khanamet Lands Auction - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కోకాపేట, ఖానామెట్‌ భూముల వేలం ఆపేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. రేపు(గురువారం) కోకాపేటలో 44.94 ఎకరాలు, ఖానామెట్‌లో 14.92 ఎకరాల వేలానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే ఈ భూముల వేలంపై విజయశాంతి దాఖలు చేసిన పిల్‌పై హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. భూముల విక్రయానికి సంబంధించిన జీవో 13ను కొట్టేయాలని విజయశాంతి హైకోర్టును కోరారు. ఈ విచారణలో భాగంగా భూముల వేలం ఆపేందుకు నిరాకరిస్తున్నట్లు హైకోర్టు పేర్కొంది.

నిధుల సమీకరణతోపాటు భూములు కబ్జాకు గురయ్యే ప్రమాదం ఉన్నందున ఈ భూములను వేలం వేస్తున్నామని అడ్వొకేట్‌ జనరల్‌ హైకోర్టుకు తెలియజేశారు. ఈ క్ర​మంలో భూములను ప్రభుత్వమే కాపాడుకోలేక, అమ్ముకోవడమేంటని హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. జిల్లాల్లో వెయ్యి ఎకరాల భూబ్యాంక్‌ ఏర్పాటుపై పూర్తిస్థాయిలో వాదనలు వింటామని హైకోర్టు పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement