ఎమ్మెల్యేల కొనుగోలు కేసు: నిందితుల జాబితాలో ‘ఆ నలుగురు’

In TRS MLAs Poaching Case: FSL Report Handover To SIT - Sakshi

హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఇప్పటివరకూ ఆరోపణలు ఎదుర్కొంటున్న కీలక సూత్రధారుల్ని నిందితుల జాబితాలో చేర్చింది సిట్‌. ఏ-4గా బీఎల్‌ సంతోష్‌, ఏ-5గా తుషార్‌, ఏ-6గా జగ్గుస్వామి, ఏ-7గా న్యాయవాది శ్రీనివాస్‌లను నిందితుల జాబితాలో చేర్చింది. అదే సమయంలో సిట్‌ స్వర నమూల నివేదిక సిట్‌ చేతికి అందింది.

మరొకవైపు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులను కస్టడీకి ఇవ్వాలన్న పిటిషన్‌ను ఏసీబీ కోర్టు కొట్టేసింది. వారం రోజుల కస్టడీ కోరుతూ పోలీసుల వేసిన పిటిషన్‌ను ఏసీబీ కోర్టు తిరస్కరించింది. ఈ కేసులో సిట్‌ నోటీసులు సవాల్‌ చేస్తూ నందు భార్య చిత్రలేఖ, న్యాయవాది ప్రతాప్‌ పిటిషన్లు దాఖలు చేశారు.  దీనిలో భాగంగా చిత్రలేఖ, ప్రతాప్‌లను అరెస్ట్‌ చేయవద్దన్న హైకోర్టు.. రేపు విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. 

చదవండి: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రఘురామకృష్ణంరాజుకు సిట్‌ నోటీసులు

మరిన్ని వార్తలు :

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top