
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో కరోనా పరీక్షలు తక్కువగా చేస్తున్నారని గవర్నర్ తమిళ సై చేసిన ట్వీట్‌పై టీఆర్‌ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక జాతీయ చానల్ ఇంటర్వ్యూలో కూడా గవర్నర్ ఇదే అంశాన్ని ప్రస్తావించారు.
గవర్నర్ తమిళ సై వ్యాఖ్యలపై టీఆర్ఎస్ హుజూర్ నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి తీవ్రంగా స్పందించారు. బీజేపీ అధ్యక్షురాలిలా గవర్నర్ మాట్లాడుతున్నారంటూ సైదిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.