టీఆర్‌ఎస్‌ కట్టు బానిసను..

TRS Balka Suman Strong Counter to Revanth Reddy - Sakshi

సాక్షి, ఇల్లందకుంట(కరీంనగర్‌): ‘నన్ను బానిస సుమన్‌ అంటుండ్రు. అవును.. నేను ప్రజలకు బానిసను. ఆదరించి అన్నంపెట్టిన టీఆర్‌ఎస్‌ పార్టీకి కట్టు బానిసనని గర్వంగా చెప్పుకుంటా..’ అని ప్రభుత్వ విప్‌ బాల్కసుమన్‌ అన్నారు. కరీంనగర్‌ జిల్లా ఇల్లందకుంట మండల కేంద్రంలో శనివారం నిర్వహించిన సోషల్‌మీడియా వారియర్స్‌ సమ్మేళనంలో ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్‌ మాట్లాడారు. కొత్త బిచ్చగాడు పొద్దుఎరుగడు అన్నట్లు.. చదువు రాని సన్నాసి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరిన 12మంది ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టండని మాట్లాడడం సిగ్గుచేటని అన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి తరఫున కాకుండా అవతలి వైపున్న అభ్యర్థి ఈటల రాజేందర్‌ అండగా నిలిచారని అన్నారు. ఆర్టీసీ కార్మికులతో సమ్మె చేయించడంతో పాటు పార్టీకి వ్యతిరేకంగా పూణె, బెంగళూర్‌లో మీటింగ్‌లు పెట్టారని ఆరోపించారు. సోషల్‌ మీడియాలో అబద్దాలు ప్రచారం చేయడంలో బీజేపీ దిట్ట అని పేర్కొన్నారు. చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, జెడ్పీ చైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ, జీవీ.రామకృష్ణారావు పాల్గొన్నారు. 

చదవండి: సూది గుచ్చడంలో తేడాతో రక్తంలో గడ్డలు!

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top