టికెట్‌ ధరా ‘వేగం’గా తగ్గింది! | Train Ticket Fares May Drop: Telangana | Sakshi
Sakshi News home page

టికెట్‌ ధరా ‘వేగం’గా తగ్గింది!

Nov 7 2026 5:09 AM | Updated on Nov 7 2026 5:09 AM

Train Ticket Fares May Drop: Telangana

సూపర్‌ఫాస్ట్‌ హోదా నుంచి సాధారణ ఎక్స్‌ప్రెస్‌గా పలు రైళ్లు 

దక్షిణ మధ్య రైల్వే పరిధిలోనూ రెండు రైళ్లకు ఎఫెక్ట్‌  

సాక్షి, హైదరాబాద్‌: పేరేమో సూపర్‌ఫాస్ట్‌.. కానీ, ప్యాసింజర్‌ రైలు తరహాలో నెమ్మది ప్రయాణం.. ప్రయాణ సమయం ఎక్కువగా ఉన్నా, సూపర్‌ఫాస్ట్‌ హోదాతో అదనపు చార్జీలు వసూలు చేయడంపై చాలాకాలంగా విమర్శలు, ఫిర్యాదులు... వెరసి రైల్వేశాఖ వాటి స్థాయి తగ్గించాల్సి వచ్చింది. దీంతో అవి సాధారణ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లుగా మారి, టికెట్‌ ధరలను తగ్గించుకొని ప్రయాణించనున్నాయి. 2027 జనవరి 1 నుంచి దేశవ్యాప్తంగా 40కి పైగా రైళ్ల హోదా మారనుండగా, దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రెండు రైళ్లపై ఆ ప్రభావం ఉంటోంది.  

55 కిలోమీటర్ల వేగం.. సూపర్‌ఫాస్ట్‌కు ప్రామాణికం 
ఒక రైలు సూపర్‌ఫాస్ట్‌ హోదా పొందాలంటే నిర్దేశిత ప్రమాణాల ప్రకారం గంటకు కనీసం 55 కిలోమీటర్ల సగటు వేగాన్ని అందుకోవాలి. అది ప్రయాణించే మొత్తం దూరం, మొత్తం ప్రయాణ సమయాన్ని పరిగణనలోకి తీసుకొని సగటు వేగాన్ని లెక్కిస్తారు. మార్గమధ్యలో ఆగే స్టేషన్ల వద్ద వెచ్చించే సమయం కూడా ప్రయాణ కాలంలో భాగమే. ఈ ప్రమాణాలను అందుకోని రైళ్లను సాధారణ ఎక్స్‌ప్రెస్‌ కేటగిరీలోకి మార్చే ప్రక్రియ కొనసాగుతోంది. 

⇒ దక్షిణ మధ్య రైల్వే పరిధిలో హైదరాబాద్‌–ముంబై మార్గంలోని 22721 నంబరు రైలు, కాచిగూడ–కుమ్తా మార్గంలోని 12790 నంబరు రైలు సాధారణ ఎక్స్‌ప్రెస్‌ కేటగిరీలోకి మారనున్నాయి. ముంబై రైలు నంబరు జనవరి ఒకటి నుంచి 17081/17082గా, కుమ్త నెం. 1768999/ 17690గా మారనున్నాయి. ఈ మార్పుతో సూపర్‌ఫాస్ట్‌ సర్‌చార్జీ తొలగిపోనుంది. అయితే ప్రయాణికులు జనవరి నుంచి టికెట్‌ బుక్‌ చేసుకునే ముందు సవరించిన రైలు నంబర్లు, చార్జీలు, అమల్లోకి వచ్చే తేదీని అధికారిక రైల్వే విచారణ వ్యవస్థలో సరిచూసుకోవాల్సి ఉంటుంది.  

తరగతుల వారీగా ఎంత ఆదా? 
రైలు సాధారణ ఎక్స్‌ప్రెస్‌గా మారితే ఈ అదనపు చార్జీ తొలగుతుంది. టికెట్‌ తరగతిని బట్టి ప్రయాణికులకు సుమారు రూ.15 నుంచి రూ.75 వరకు ఆదా అవ్వొచ్చు. రెండో తరగతికి రూ.15, స్లీపర్‌కు రూ.30, ఏసీ చైర్‌కార్, ఏసీ 3–టైర్, ఏసీ 2–టైర్‌ తరగతులకు రూ.45, ఏసీ ఫస్ట్‌ క్లాస్‌కు రూ.75 వరకు సర్‌చార్జీ వర్తించే విధానముంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement