Traffic Free Tank Bund On Sundays: ‘ట్యాంక్‌బండ్‌పై విహారం’ రేపటి నుంచే

Traffic Free Tank Bund On Sundays: Full Details Here - Sakshi

ట్రాఫిక్‌ మళ్లింపులపై కొత్వాల్‌ నోటిఫికేషన్‌

ప్రతి ఆదివారం సాయంత్రం వేళల్లో అమలు

సాక్షి, హైదరాబాద్‌: ట్యాంక్‌బండ్‌ ఈ ఆదివారం సాయంత్రం నుంచే పెడ్రస్టియన్‌ జోన్‌గా మారుస్తున్నారు. ఆ రోజుల్లో సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు దీనిపైకి కేవలం సందర్శకుల్ని మాత్రమే అనుమతిస్తారు. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులను నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ శుక్రవారం జారీ చేశారు. ఆ సమయంలో ట్యాంక్‌బండ్‌ మీదుగా ప్రయాణించాల్సిన వాహనాలకు మళ్లింపులు విధించారు. గతంలో పేర్కొన్న వాటికి అదనంగా మరికొన్ని పార్కింగ్‌ స్థలాలను కేటాయించారు. సాధారణ వాహన చోదకులు ఆ సమయంలో ట్యాంక్‌బండ్‌ మార్గంలో రావద్దని పోలీసులు సూచిస్తున్నారు.  
చదవండి: హుస్సేన్‌సాగర్‌ని డంపింగ్‌ సాగర్‌గా మార్చారు..

► లిబర్టీ వైపు నుంచి అప్పర్‌ ట్యాంక్‌బండ్‌ వైపు వెళ్లే వాహనాలను అంబేడ్కర్‌ విగ్రహం వైపు నుంచి తెలుగుతల్లి, ఇక్బాల్‌ మినార్‌ మీదుగా మళ్లిస్తారు. 
►తెలుగుతల్లి వైపు నుంచి అప్పర్‌ ట్యాంక్‌బండ్‌ వైపు వచ్చే వాహనాలను అంబేడ్కర్‌ విగ్రహం నుంచి లిబర్టీ, హిమాయత్‌నగర్‌ మీదుగా పంపిస్తారు. 
► కర్బాలా మైదాన్‌ నుంచి అప్పర్‌ ట్యాంక్‌బండ్‌ వైపు ప్రయాణించే వాహనాలు సెయిలింగ్‌ క్లబ్‌ నుంచి కవాడిగూడ, డీబీఆర్‌ మిల్స్, లోయర్‌ ట్యాంక్‌బండ్, కట్టమైసమ్మ, తెలుగుతల్లి ఫ్లైఓవర్‌ మీదుగా వెళ్లాలి. 
► ఇక్బాల్‌ మినార్‌ వైపు నుంచి సికింద్రాబాద్‌ వైపు వెళ్లే వాహనాలు పాత సెక్రటేరియేట్‌ నుంచి తెలుగుతల్లి ఫ్లైఓవర్‌ మీదుగా మళ్లిస్తారు. 
►అంబేడ్కర్‌ విగ్రహం వైపు నుంచి వచ్చే సందర్శకుల కోసం ట్యాంక్‌బండ్‌పై అంబేడ్కర్‌ విగ్రహం నుంచి లేపాక్షి వరకు, డాక్టర్‌ కార్స్‌ వద్ద, న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో, ఆంధ్రా సెక్రటేరియేట్‌ వద్ద పార్కింగ్‌ ఏర్పాటు చేశారు. 
► కర్బాలా మైదాన్‌ వైపు నుంచి వచ్చే వారికి ట్యాంక్‌బండ్‌పై సెయిలింగ్‌ క్లబ్‌ నుంచి చిల్డ్రన్‌ పార్క్‌ వరకు, బుద్ధభవన్‌ వెనుక ఉన్న నెక్లెస్‌ రోడ్‌లో, ఎనీ్టఆర్‌ గ్రౌండ్స్‌లో పార్కింగ్‌ కల్పించారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top