ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన బైక్‌.. ముగ్గురి మృతి | Three Died In Vikarabad Road Accident After Bus Hits Bike | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన బైక్‌.. ముగ్గురి మృతి

Oct 17 2024 3:57 PM | Updated on Oct 17 2024 4:17 PM

Three Died In Vikarabad Road Accident After Bus Hits Bike

సాక్షి, వికారాబాద్: వికారాబాద్ జిల్లాలో ఘోర ప్ర‌మాదం చోటుచేసుకుంది. హైదరాబాద్‌-బీజాపూర్‌ రహదారిపై పూడూరు గేట్ వ‌ద్ద ఆర్టీసీ బ‌స్సు – బైక్ ఢీకొన్నాయి. ఈ ప్ర‌మాదంలో ముగ్గురు వ్య‌క్తులు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు. మృతులను పూడూరు మండలం మేడికొండకు చెందిన వారిగా గుర్తించారు. 

ఓ ఇద్ద‌రు యువ‌కులు, ఓ బాలుడు క‌లిసి బైక్‌పై పూడూరు నుంచి మేడికొండ వైపు వెళ్తున్నారు. హైద‌రాబాద్ నుంచి క‌ర్ణాట‌క వైపు వెళ్తున్న ర్టీసీ బ‌స్సు.. బైక్‌ను ఢీకొట్టింది. దీంతో బైక్‌పై వెళ్తున్న ముగ్గురు మృతి చెందారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. 

మృత‌దేహాల‌ను ప‌రిగి ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఆర్టీసీ బ‌స్సును పోలీసు స్టేష‌న్‌కు త‌ర‌లించారు. డ్రైవ‌ర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతుల్లో ఇద్ద‌రు మేడికొండ, ఒక‌రు గొంగుప‌ల్లి గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మృతుల నివాసాల్లో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement