
సాక్షి, హైదరాబాద్ : వినియోగదారుల హక్కుల సంస్థ ఆధ్వర్యంలో బండమైసమ్మ కమ్యూనిటీ హాల్ లో కిరాణా షాప్ ఓనర్లకు "వినియోగదారుల హక్కుల రక్షణ చట్టం 2019", "ఆహార భద్రత చట్టం 2006", "తూనికలు కొలతల చట్టం 2011", ప్రకారం కొనుగోలు విషయంలో వినియోగదారులకు ఉన్న హక్కులను, షాపు నిర్వాహకులు వాటిని ఉల్లంఘిస్తే విధించే శిక్షలు మరియు జరిమానాలు గురించి కవాడిగూడ, గాంధీనగర్, దోమలగూడ బస్తీలలో, కాలనీలలోనీ కిరాణా షాప్ యజమానులకు ప్రభుత్వ అధికారులు ఏరియా ఫుడ్ సేఫ్టీ అధికారి GHMC నుంచి సాహితీ గారు, తూనికలు కొలతల శాఖ నుంచి శ్రీనివాస్ రెడ్డి గారు, FSSAI నుంచి డిప్యూటీ ఫుడ్ కంట్రోలర Rtd T.విజయ్ కుమార్ గార్ల సమక్షంలో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
చిన్న పిల్లలు తినే తిను పదార్థాలు నుంచి వంట సరుకుల వరకు నాసిరకం ఉత్పత్తి మరియు వాటి అమ్మకాలు ఎక్కువైనందున కిరాణా షాప్ యజమానులకు షాప్ లో అమ్ముతున్నటువంటి సరుకుల అమ్మకాల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటించాల్సిన బాధ్యతలు తెలియజేయడం జరిగింది, ఈ సందర్భంగా సంస్థ రాష్ట్ర అధ్యక్షులు రామగిరి హరిబాబు గారు మాట్లాడుతూ చుట్టుపక్కల వ్యాపారం చేస్తున్నటువంటి వ్యాపారస్తులు వినియోగదారుల ఆరోగ్యం కోసం ఆలోచించాలని కోరారు.
పిల్లలు క్రమం తప్పకుండా నాసిరకం లేదా తక్కువ నాణ్యత గల ఆహారాన్ని తీసుకుంటే, తగినంత పోషకాహారం లేకపోవడం మరియు హానికరమైన పదార్థాల కారణంగా వారు అనేక రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు ఆది వారి శారీరక మరియు మానసిక అభివృద్ధి పై ప్రభావం చూపుతూ తక్షణ సమస్యల నుండి దీర్ఘకాలిక వ్యాధులు గా మారతాయి అని తెలిపారు, గత నెల నుంచి మేము నిర్వహించిన సర్వేలో నాసిరకం అమ్మకాలు ప్రతి షాప్ లో జరుగుతున్నాయని తేలింది, ముఖ్యంగా యజమానులకు అవగాహన లేకపోవడం కారణంగా భావించి ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించమని తెలిపారు.
ఈ కార్యక్రమం అనంతరం ఏ షాప్ లో అయినా సరే ఫుడ్ సేఫ్టీ (FSSAI) లైసెన్స్ లేని తిను పదార్థాలు, వంట సర్కులు, లేబుల్(Declaration) లేని ప్యాక్ చేసిన తిను పదార్థాలు, వంట సర్కులు, తయారీదారుని పూర్తి వివరాలు లేని తిను పదార్థాలు, వంట సర్కులు అమ్మడం కనిపిస్తే సంస్థ తరపున మేమే కంప్లైంట్ చేసి శిక్ష పడేలా చేస్తామని అనరు, అలాగే వయింగ్ మిషన్లో హెచ్చుతగ్గులు ఉండడం కొన్న వస్తువులకు వినియోగదారుడు బిల్లు అడిగితే ఇవ్వకపోవడం లాంటివి చేయదని కోరారు, ఈ కార్యక్రమానికి సంస్థ సభ్యుడు ముషీరాబాద్ నియోజకవర్గం అధ్యక్షుడు మహమ్మద్ రఫీ యుద్దీన్ నాయకత్వం వహించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సంస్థ సబ్యులు, గ్రేటర్ హైదరాబాద్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.