
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ ఎండీగా వీసీ సజ్జనార్(VC Sajjanar) తన చివరి రోజున విధుల్లో భాగంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో ఆర్టీసీ, ప్రజా రవాణాపై తన అనుబంధాన్ని వ్యక్తం చేశారు. సామాన్యుడిలా ఆర్టీసీ(TGSRTC) బస్సులో ప్రయాణించారు. బస్సులో అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ప్రయాణం చేశారు. ఈ క్రమంలో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించే విధంగా యూపీఐ పేమెంట్ చేసి టికెట్ తీసుకున్నారు.
ఆర్టీసీ ఎండీగా వీసీ సజ్జనార్ సోమవారం ఉదయం సాధారణ ప్రయాణికుడిలా లక్డీకాపుల్‌లోని టెలిఫోన్ భవన్ బస్టాండ్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని బస్ భవన్ వరకు 113 I/M రూట్ సిటీ బస్సులో ప్రయాణించారు. ఈ సందర్భంగా యూపీఐ పేమెంట్ చేసి కండక్టర్ వద్ద టికెట్ తీసుకున్నారు. అనంతరం ప్రయాణికులతో ముచ్చటించారు. ఆర్టీసీలో రవాణా సదుపాయాలపై ఆరా తీశారు. ప్రయాణికులతో ముచ్చటించి.. సౌకర్యాలపై ఆరా తీశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాను టీజీఎస్‌ఆర్టీసీ ట్విట్టర్ వేదికగా షేర్ చేసింది.
ఇక, ఇటీవల తెలంగాణ ప్రభుత్వం పలువురు ఐపీఎస్, ఐఏఎస్ అధికారులకు స్థానచలనం కల్పించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సజ్జనార్ హైదరాబాద్ సీపీగా బదిలీ అయ్యారు. అక్టోబర్ ఒకటో తేదీన హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా వీసీ సజ్జనార్ బాధ్యతలు చేపట్టబోతున్నట్లు సమాచారం.
టీజీఎస్‌ఆర్టీసీ ఎండీగా తన చివరి రోజున వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు ప్రజా రవాణాపై అనుబంధాన్ని వ్యక్తం చేస్తూ.. ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు.
సాధారణ ప్రయాణికుడిలా లక్డీకాపుల్-టెలిఫోన్ భవన్ బస్టాండ్ నుంచి బస్ భవన్ వరకు 113 I/M రూట్ బస్సులో ప్రయాణించారు.
యూపీఐ పేమెంట్ చేసి కండక్టర్… pic.twitter.com/qiBzq9odSI— TGSRTC (@TGSRTCHQ) September 29, 2025