
సాక్షి, హైదరాబాద్: సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు కొందరు పిచ్చి వేషాలు వేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఘటనలు చాలానే చూశాం. తాజాగా ఇలాంటి వీడియోను టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ షేర్ చేస్తూ సోషల్ మీడియాలో వ్యూస్, లైక్స్ కోసం విలువైన ప్రాణాలను పణంగా పెట్టాలా!? అని ప్రశ్నించారు.
సజ్జనార్ ట్విట్టర్ వేదికగా.. ‘ఫేమస్ కోసం ఇలా ప్రాణాలతో చెలగాటం ఆడటం పిచ్చితనం!. సోషల్ మీడియాలో వ్యూస్, లైక్స్ కోసం విలువైన ప్రాణాలను పణంగా పెట్టాలా!?. ఏదో ఘనకార్యం వెలగబెట్టినట్లు ఆ పట్టరాని సంతోషం ఎందుకు.. ఇలాంటివి మీకు సరదాగా అనిపించొచ్చు.. కానీ జరగరాని ప్రమాదం జరిగితే ఏమవుతుందో ఆలోచించండి’ అంటూ వ్యాఖ్యలు చేశారు.
ఇక, ఈ వీడియోలో ఒక యువకుడు రైలు పట్టాలపై పడుకుని ఓవరాక్షన్ చేశాడు. రైలు వస్తున్న సమయంలో పట్టాలపై పడుకుని.. రైలు వెళ్లేంత వరకు అలాగే ఉన్నాడు. అనంతరం, పైకి లేచి ఏదో సాధించిన వ్యక్తిలాగా కేకలు వేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఫేమస్ కోసం ఇలా ప్రాణాలతో చెలగాటం ఆడటం పిచ్చితనం!
సోషల్ మీడియాలో వ్యూస్, లైక్స్ కోసం విలువైన ప్రాణాలను పణంగా పెట్టాలా!?
ఏదో ఘనకార్యం వెలగబెట్టినట్లు ఆ పట్టరాని సంతోషం ఎందుకు.. ఇలాంటివి మీకు సరదాగా అనిపించొచ్చు.. కానీ జరగరాని ప్రమాదం జరిగితే ఏమవుతుందో ఆలోచించండి. pic.twitter.com/GF8PDKdqAf— V.C. Sajjanar, IPS (@SajjanarVC) May 11, 2025