గోవాలో తెలంగాణ నార్కోటిక్ బ్యూరో కోవర్ట్ ఆపరేషన్.. డ్రగ్స్‌ ముఠా అరెస్టు | TGANB Arrest Key Suspects in Goa Operation | Sakshi
Sakshi News home page

గోవాలో తెలంగాణ నార్కోటిక్ బ్యూరో కోవర్ట్ ఆపరేషన్.. డ్రగ్స్‌ ముఠా అరెస్టు

Jun 7 2025 7:40 PM | Updated on Jun 7 2025 8:43 PM

TGANB Arrest Key Suspects in Goa Operation

సాక్షి,హైదరాబాద్: గోవాలో తెలంగాణ నార్కోటిక్ బ్యూరో కోవర్ట్ ఆపరేషన్ నిర్వహించింది. ఈ ఆపరేషన్‌లో నాలుగు డ్రగ్‌ ముఠాలను తెలంగాణ నార్కోటిక్ బ్యూరో అదుపులోకి తీసుకుంది. గోవాలో డ్రగ్స్ తయారీ, హైదరాబాద్‌ పబ్‌లలో విక్రయిస్తున్న డీజేలు వనిష్ టక్కర్, స్వదీప్ అరెస్ట్ చేసింది.  

ఈ సందర్భంగా తెలంగాణ యాంటీ నార్కోటిక్స్‌ బ్యూరో డైరెక్టర్‌ సందీప్‌ శాండిల్య మాట్లాడుతూ.. గోవాలో సూర్యప్రభ ఫార్మా కంపెనీలో ఆల్ఫాజోలం తయారు చేసి తెలంగాణకు సప్లై చేస్తున్న మరో ముఠా గుట్టురట్టు చేశాం. ఇటీవల కాలంలో కల్తీ కళ్ళు తాగి  70 మంది తీవ్ర అస్వస్థతకు గురికావడంతో గోవా ఆపరేషన్ చేపట్టాం.

ఈ ఆపరేషన్‌లో నగరానికి డ్రగ్స్ సప్లై చేస్తున్న ఇద్దరు నైజీరియన్ల అరెస్ట్ చేశాం. వారి వద్ద నుంచి 50 లక్షల రూపాయల విలువచేసే డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నాం. హైదరాబాద్‌కు డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాలపై నిగా పెట్టాం. దేశంలో ఎక్కడున్నా సరే డ్రగ్ పెడ్లర్స్‌ను వెతికి వెంటాడి పట్టుకుంటాం. హైదరాబాద్‌కు డ్రగ్స్ ఎవరెవరు సప్లై చేస్తున్నారో సమాచారం ఉంది. కొన్ని పబ్బులలో పనిచేస్తున్న డీజే లే కీలక సూత్రధారులుగా ఉన్నారని తెలిపారు.   

Advertisement
 
Advertisement
Advertisement