టెన్త్‌ విద్యార్థులకు ‘పరీక్షే’!

Tenth class exams from 23rd May In Telangana - Sakshi

కరోనాతో రెండేళ్లుగా ప్రత్యక్ష బోధనకు ఇబ్బంది

ఈ ఏడాదీ ఆలస్యంగానే మొదలైన బోధన

పరీక్షలెలా ఉంటాయోననే ఆందోళన

విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు ఉపాధ్యాయుల కృషి

23 నుంచి పదో తరగతి పరీక్షలు 

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: పదో తరగతి పరీక్షలు రాయబోతున్న లక్షలాది మందిలో ఇలాంటి ఆందోళనే కనిపిస్తోందని ఉపాధ్యాయులు చెప్తున్నా రు. గత రెండేళ్లలో ప్రత్యక్ష తరగతులు లేక, ఆన్‌లైన్‌ తరగతులు అర్థంకాక, నెట్‌వర్క్‌ సమస్యలతో అసలు పాఠాలే వినలేని పరిస్థితులతో ఇప్పుడు విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయబోతు న్నారు. రాష్ట్రవ్యాప్తంగా 5,08,110 మంది విద్యార్థులు, 1,165 మంది ప్రైవేట్‌ విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. అయితే పరీక్షలు ఎలా రాస్తామో.. మంచి గ్రేడ్‌ వస్తుందో? రాదోనని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. 

ప్రత్యేక ప్రణాళికతో సన్నద్ధం..
విద్యాశాఖ 70% సిలబస్‌తో, 50% చాయిస్‌ ఉం డేలా పరీక్షలను నిర్వహిస్తోంది. సబ్జెక్టుకు ఒకే పేప రును పెట్టింది. జిల్లాల్లో ప్రత్యేక తరగతులు నిర్వ హిస్తోంది. టీచర్లంతా పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేసే పనిలో పడ్డారు. విద్యార్థులు ఆందోళన చెందకుండా అవగాహన కల్పిస్తున్నారు. మోడల్‌ పేపర్లతో సిద్ధం చేస్తున్నారు. అయినా 20 మార్కులు ఇంటర్నల్‌ అసెస్‌మెంట్‌కు ఉన్న నేప థ్యంలో పాస్‌ అవడంపై నమ్మకంగా ఉన్నా మంచి గ్రేడ్‌పైనే భరోసా కుదరడం లేదని అంటున్నారు.

ఒక్కో జిల్లాలో ఒక్కో రకంగా..
► ఆదిలాబాద్‌ జిల్లాలో ప్రతి సబ్జెక్టుకు ఒక టీచర్‌ను తీసుకొని కమిటీ వేసి 25 మార్కులతో పరీక్ష పేపర్‌ తయారు చేయించారు. రోజూ ఒక పరీక్ష నిర్వహిస్తున్నారు. వెనకబడిన విద్యా ర్థులపై శ్రద్ధ తీసుకుంటున్నారు.
► కరీంనగర్‌ జిల్లాలో మార్చి వరకు సిలబస్‌ను పూర్తి చేశారు. అప్పటి నుంచి సాయంత్రం ప్రత్యేకంగా విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేయి స్తున్నారు. జగిత్యాల జిల్లాలో జూమ్‌ మీటింగ్‌ ద్వారా కూడా తరగతులను నిర్వ హిస్తున్నారు.
► ఖమ్మం జిల్లాలో ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. రోజుకు ఒక సబ్జెక్టు చొప్పున ఈనెల 21 వరకు బోధన నిర్వ హించేలా ఏర్పాట్లు చేశారు. భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో పరీక్షల పట్ల భయం పోయేలా విద్యార్థులకు ఎక్కువ సంఖ్యలో పరీక్షలను నిర్వహించారు.
► నిజామాబాద్‌ జిల్లాలో సబ్జెక్టులను పార్ట్‌–ఏ, బీ కింద విభజించారు. నెలరోజులు పాఠ్యాంశా లను పునశ్చరణ చేయించారు. విద్యార్థులను గ్రూపులుగా విభజించి పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నారు.
► వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల్లో ప్రభుత్వ, జిల్లా పరిషత్‌ హైస్కూళ్లలో రోజుకో సబ్జెక్టు టీచర్‌ ప్రత్యేకంగా బోధిస్తున్నారు. విద్యా ర్థుల సందేహాలను తీర్చడంతోపాటు రివిజన్‌ చేయిస్తున్నారు.
► ఉమ్మడి నల్లగొండ జిల్లాల్లో వెనుకబడిన విద్యార్థులకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నారు. పరీక్షలంటే భయం పోయేలా మానసికంగా సిద్ధం చేస్తున్నారు. కనీసం పాస్‌ అయ్యేలా మోడల్‌ ప్రశ్నలు ఇచ్చి సాధన చేయిస్తున్నారు.
► ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ఉపాధ్యాయులే విద్యార్థుల ఇళ్లకు ఫోన్‌ చేసి విద్యార్థులు ఎలా చదువుతున్నారు.. సందేహాలుంటే నివృత్తి చేసేలా చర్యలు చేపడుతున్నారు. 
► మహబూబ్‌నగర్‌ జిల్లాలో ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు సందేహాలు ఉంటే నివృత్తి చేసేలా చర్యలు చేపట్టారు.

జూమ్‌ మీటింగ్‌ ద్వారా తరగతులు 
తల్లిదండ్రులకు మొబైల్‌ఫోన్‌ ద్వారా కౌన్సెలింగ్‌ నిర్వ హిస్తూ విద్యార్థులకు సూచ నలు చేస్తున్నాం. జూమ్‌ మీటింగ్‌ ద్వారా కూడా తరగతులను నిర్వహిస్తున్నాం. వాట్సాప్‌ గ్రూపు ఏర్పాటు చేసి ప్రిపేర్‌ చేయిస్తున్నాం.
– పల్లె శ్రీనివాస్‌రెడ్డి, స్కూల్‌ అసిస్టెంట్, సారంగాపూర్, జగిత్యాల

భయం పోగొట్టేలా ప్రయత్నం 
విద్యార్థుల్లో పరీక్షలంటే సహజంగా భయం ఉం టుంది. దానిని పోగొట్టేం దుకు చర్యలు చేపడుతున్నాం. పరీక్షలు బాగా రాసేలా సిద్ధం చేస్తున్నాం. స్కూల్లో నిర్వహించే అన్ని టెస్టులకు హాజరయ్యేలా చూస్తున్నాం.
– కనకదుర్గ, విద్యార్థి తల్లి, కొత్తగూడెం

మంచి జీపీఏ వస్తుందో రాదో
పరీక్షల్లో కనీసం 9 జీపీఏ రావాలి. కానీ వస్తుందో రాదో.. కరోనాతో స్కూల్‌కు సరిగ్గా వెళ్ల లేదు. టీవీ పాఠాలు అర్థ మయ్యేవి కావు. చదువు పైనా శ్రద్ధ తగ్గింది. అందుకే వెనకబడ్డాం.
– వన్నె సైదురాజు, టెన్త్‌ విద్యార్థి, జెడ్పీ హైస్కూల్, కోటగిరి, నిజామాబాద్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top