నన్ను కొట్టాడు సార్‌... !.. నేరుగా పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లిన బాలుడు

Ten Years Boy Complaint At The Police Station In Bhadradri Kothagudem District - Sakshi

పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన పదేళ్ల బాలుడు 

జూలూరుపాడు: ‘ఆడుకుంటుం టే నన్ను అనవసరంగా కొట్టా డు సార్‌’అంటూ ఓపదేళ్ల బాలు డు ధైర్యంగా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు లోని న్యూకాలనీకి చెందిన కాశిమళ్ల రవిబాబు ఐదో తరగతి చదువుతున్నాడు. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఆడుకుంటుండగా అదే కాలనీకి చెందిన 14ఏళ్ల కుర్రాడు అతని తలపై కొట్టాడు. దీంతో రవిబాబు ఏడుస్తూ నేరుగా స్థానిక పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు. తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లడంతో తానే నేరుగా పోలీసుస్టేషన్‌కు వచ్చానని బాలుడు తెలిపాడు. అనంతరం హోంగార్డును పంపించి బాలుడిని కొట్టిన కుర్రాడికి సర్దిచెప్పారు. 
(చదవండి: చేపలు, గొర్రెలతో ఉపాధి కల్పిస్తే ఉద్యోగం కాదా? )

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top