ట్యాబ్లెట్ షీట్‌ను పోలిన శుభలేఖ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: సాదాసీదా శుభలేఖలు బోర్ కొట్టాయనుకున్నాడో ఏమో.. ఆ వరుడు తన పెళ్లి పత్రికను ఒక మెడికల్ షాపులోని ట్యాబ్లెట్ స్ట్రిప్ లా మార్చేశాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కాకర్లకు చెందిన కిన్నెర నవీన్‌కు ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కందుకూరుకు చెందిన శిరీషతో వివాహం నిశ్చయమైంది.
వధువు శిరీష ఎం.ఫార్మసీ చదివి, ప్రస్తుతం విజయవాడలోని ఓ ఆస్పత్రిలో ఫార్మసిస్టుగా పనిచేస్తోంది. ఆమె వృత్తిని గౌరవిస్తూ, నవీన్ తన వివాహ పత్రికను ఒక ట్యాబ్లెట్ స్ట్రిప్ (మాత్రల షీట్) ఆకారంలో డిజైన్ చేయించారు. సాధారణంగా మందుల షీట్లపై ఉండే హెచ్చరికల తరహాలోనే, ‘డియర్ ఫ్రెండ్స్ ప్లీజ్ డోంట్ మిస్ మై వెడ్డింగ్’అంటూ రాసుకొచ్చారు.


