టిఫిన్‌లో కప్ప! | Telangana University Girls Hostel Frog in Tiffin | Sakshi
Sakshi News home page

టిఫిన్‌లో కప్ప!

Apr 7 2022 3:56 AM | Updated on Apr 7 2022 3:56 AM

Telangana University Girls Hostel Frog in Tiffin - Sakshi

తెయూ (డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ  బాలికల హాస్టల్‌లో బుధవారం ఉదయం అల్పాహారంలో భాగంగా అందించిన వెజ్‌ రైస్‌లో కప్ప రావడంతో విద్యార్థినులు ఆందో ళనకు గురయ్యారు. అప్పటికే పలువురు విద్యార్థినులు అల్పాహారం తిని తరగతులకు వెళ్లారు. ఈ విషయాన్ని హాస్టల్‌ చీఫ్‌ వార్డెన్‌ అబ్దుల్‌ ఖవీ, బాలికల హాస్టల్‌ వార్డెన్‌ జవేరి యా ఉజ్మా, కేర్‌టేకర్‌ పీరూబాయిల దృష్టికి తీసుకెళ్లారు. వెజ్‌రైస్‌లో కప్ప వచ్చిన మాట నిజమేనని.. మరోసారి తప్పు జరగకుండా జాగ్రత్త పడతామని కుక్‌ తెలిపారు.  

Advertisement
 
Advertisement
Advertisement