ఫార్మా, ఎయిర్‌కార్గోలో తెలంగాణ సూపర్‌! | Telangana Super in Pharma and Aircargo | Sakshi
Sakshi News home page

ఫార్మా, ఎయిర్‌కార్గోలో తెలంగాణ సూపర్‌!

Jul 23 2024 4:25 AM | Updated on Jul 23 2024 4:25 AM

Telangana Super in Pharma and Aircargo

2023–24 ఆర్థిక సర్వేలో కేంద్ర ప్రభుత్వం వెల్లడి 

రాష్ట్ర ఆర్థిక స్థితి మెరుగుపర్చుకునే దిశగా చర్యలు 

ఇక్కడి పురుషులు, మహిళల్లో పెరుగుతున్న ఊబకాయం సమస్య 

ఈ–నామ్‌తో 89% మంది తెలంగాణ రైతులకు ప్రయోజనం 

సాక్షి, న్యూఢిల్లీ:  దేశంలో ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చేందుకు చర్యలు చేపట్టిన రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని కేంద్ర ఆర్థిక సర్వే వెల్లడించింది. తెలంగాణ, ఏపీతోపాటు పలు ఇతర రాష్ట్రాల్లో స్థూల ద్రవ్యలోటు, ఆర్థిక లోటు తగ్గాయని పేర్కొంది. ముఖ్యంగా మూలధన పెట్టుబడులపై ఈ రాష్ట్రాలు దృష్టి సారించడంతో.. మెరుగ్గా ఖర్చు చేసే పరిస్థితి ఏర్పడిందని తెలిపింది. సోమవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2023–24 ఆర్థిక సర్వే నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 

» దేశ ఫార్మా ఉత్పత్తుల్లో తెలంగాణ వాటా 30 శాతానికిపైగా ఉందని, వెయ్యికిపైగా లైఫ్‌ సైన్సెస్‌ కంపెనీలకు వేదికగా మారిందని కేంద్రం తెలిపింది. »దేశవ్యాప్తంగా విమానాల ద్వారా సరుకుల రవాణా (ఎయిర్‌ కార్గో)లో హైదరాబాద్‌ 44 శాతంతో టాప్‌లో నిలిచిందని వెల్లడించింది. 
»2019–21 మధ్య దేశ వయోజన జనాభాలో ఊబకాయం ఆందోళనకర స్థాయికి పెరిగిందని... తెలంగాణలో పురుషుల్లో ఊబకాయం 24.2% నుంచి 32.3 శాతానికి.. మహిళల్లో 28.6% నుంచి 30.1శాతానికి పెరిగిందని తెలిపింది.
» వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాల కోసం తెచి్చన ఈ–నామ్‌తో తెలంగాణలోని 89 శాతం మంది రైతులు మెరుగైన ధర పొందారని పేర్కొంది. 
»దేశంలో సిమెంట్‌ పరిశ్రమల వార్షిక స్థాపిత ఉత్పత్తి సామర్థ్యం 622 మిలియన్‌ టన్నులకు చేరిందని.. అందులో 85శాతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక తదితర రాష్ట్రాల్లోనే ఉందని తెలిపింది. 
»ఇక ప్లాస్టిక్‌ నియంత్రణ లో భాగంగా సిద్దిపేటలో అమలు చేస్తున్న ‘స్టీ ల్‌ బ్యాంక్‌’విధానాన్ని కేంద్రం ప్రశంసించింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement