
పీపీపీ ప్రాజెక్టును ప్రారంభించిన డీజీపీ జితేందర్, జైళ్లశాఖ డైరక్టర్ జనరల్ సౌమ్యమిశ్రా..
డీజీపీ జితేందర్ ప్రశంసలు
చర్లపల్లి ఖైదీల వ్యవసాయక్షేత్రంలో ప్రాజెక్టు ప్రారంభం
కుషాయిగూడ (హైదరాబాద్): సామాజిక స్పృహ, సమాజ భాగస్వామ్యంతో తెలంగాణ జైళ్లశాఖ శ్రీకారం చుట్టిన పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) కార్యక్రమం ఓ విశిష్టమైన రూపకల్పనని డీజీపీ డాక్టర్ జితేందర్ అభిప్రాయపడ్డారు. చర్లపల్లి ఖైదీల వ్యవసాయక్షేత్రంలో ఏర్పాటు చేసిన పీపీపీ ప్రాజెక్టును శనివారం జైళ్లశాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సౌమ్యామిశ్రాతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాజెక్టులో భాగంగా ఏర్పాటు చేసిన యోగా కేంద్రం, అడ్వెంచర్ పార్కు, మినీ గోల్ఫ్ కోర్టు, ఫామ్ టూ ప్లేట్ ప్రాజెక్టులు అద్భుతమైన రూపకల్పన అన్నారు. పిల్లలకు వ్యవసాయ సాగు పద్ధతులపై అవగాహన కల్పించడంతో పాటుగా వ్యవసాయ ప్రాముఖ్యతను తెలియజేయాలనే లక్ష్యం గొప్పదని ప్రశంసించారు.కార్యక్రమంలో రాచకొండ కమిషనర్ జి.సుదీర్‌బాబు, తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ ఎం.రమేశ్, ఇంటెలిజెన్స్ ఐజీపీ కార్తికేయ, తఫ్సిర్ ఇక్బాల్, మల్కాజిగిరి డీసీపీ పద్మజ, రిటైర్డ్ ఐజీ నరసింహ, జైళ్లశాఖ ఐజీ మురళీబాబు తదితరులు పాల్గొన్నారు.