Telangana Minister KTR With Nephew in the US - Sakshi
Sakshi News home page

అమెరికాలో మేనల్లుడితో కేటీఆర్‌ 

Mar 31 2022 1:23 AM | Updated on Mar 31 2022 8:48 AM

Telangana Minister KTR With Nephew In The US - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణకు పెట్టుబడుల సాధన కోసం అమెరికాలో పర్యటించిన మంత్రి కేటీ రామారావు తన బిజీ షెడ్యూల్లోనూ తన మేనల్లుడు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తనయుడు ఆదిత్యను కలిసి ముచ్చటించారు. తన కుమారుడు ఆదిత్యతో మంత్రి కేటీఆర్‌ ఉన్న ఫొటోను ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్లో పంచుకున్నారు. కేటీఆర్‌ ఎంతో బిజీగా ఉన్నా కూడా ఆయన మేనల్లుడు ఆదిత్యను మరిచిపోకుండా కాలేజీకి వెళ్లి కలుసుకున్నారని, అమెరికాలో కేటీఆర్‌ ఉన్నప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారని  కవిత పేర్కొన్నారు.

కేటీఆర్‌ను కలసిన ఆదిత్య మిట్టల్‌ 
వ్యాపార పనుల నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చిన ఆర్సెలార్‌ మిట్టల్‌ స్టీల్‌ గ్రూప్‌ సీఈఓ ఆదిత్య మిట్టల్‌ ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్‌తో భేటీ అయ్యారు. హైదరాబాద్‌ అల్లుడు కూడా అయిన ఆదిత్య తెలంగాణలో పెట్టుబడులకున్న అవకాశాల గురించి కేటీఆర్‌తో చర్చించారు. ఉక్కు పరిశ్రమ గురించి పలు విషయాలు చర్చకు వచ్చినట్లు కేటీఆర్‌ ట్విట్టర్లో పేర్కొన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement