బాసర ట్రిపుల్‌ ఐటీ అధికారులపై మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం

Telangana Minister KTR is angry with Basara Triple IT officials - Sakshi

సాక్షి, నిర్మల్‌:  బాసర ట్రిపుల్‌ ఐటీ అధికారులపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో విద్యార్థులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ఆయన వాళ్లను నిలదీశారు. 

శనివారం ట్రిపుల్ ఐటీ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు వెళ్లిన కేటీఆర్‌ అక్కడి పరిస్థితులు దృష్టికి రావడంతో మండిపడ్డారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్‌ సీరియస్‌గా ఉన్నారంటూ కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. నాణ్యమైన ఆహారం పెట్టడంలో అధికారులు విఫలం అయ్యారు. తరచుగా ఫుడ్‌ పాయిజన్‌ జరగుతున్నా.. మెస్‌ కాంట్రాక్టర్‌ను మార్చకపోవడంపై ఆయన వీసీ వెంకటరమణపై అసహనం వ్యక్తం చేశారు.  మెస్‌ కాంట్రాక్టర్‌ను ఇంకా ఎందుకు మార్చలేదని.. ఎవరైనా ఓవరాక్షన్‌ చేస్తే పోలీసుల సాయం తీసుకోండని ట్రిపుల్‌ ఐటీ అధికారులకు సూచించారాయన.

బాసర ట్రిపుల్ స్నాతకోత్సవంలో భాగంగా మంత్రులు సబితా, ఇంద్రకరణ్‌రెడ్డిలతో పాటు బాల్కా సుమన్‌ ట్రిపుల్‌ ఐటీలో  పర్యటిస్తున్నారు. ఈ సందర్బంగా విద్యార్థులకు ల్యాప్ ట్యాప్, బూట్లు, డెస్క్ ట్యాప్‌లులు పంపిణి చేశారు. విద్యార్థులకు అవసరమైన  వసతులు కల్పించడానికి సర్కారు సిద్దంగా ఉందని ఈ సందర్భంగా విద్యార్థులకు మంత్రి కేటీఆర్ భరోసానిచ్చారు.

ఇదిలా ఉంటే.. బాసర ట్రిపుల్‌ ఐటీలో తరచూ విద్యార్థులు ఫుడ్‌ పాయిజన్‌కు గురవుతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఈ తరుణంలో కాంట్రాక్టర్‌ను మార్చేసి.. విద్యార్థులకు మంచి ఆహారం అందించాలంటూ విద్యాశాఖ గతంలో అధికారులను ఆదేశించింది.

మరిన్ని వార్తలు :

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top