TG: గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. | Students Fall Sick After Eating Chicken Curry At Residential School Kothagudem, Details Inside | Sakshi
Sakshi News home page

TG: గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. 25 మంది విద్యార్థులకు అస్వస్థత

Mar 13 2026 12:02 AM | Updated on Mar 13 2026 2:40 PM

Students Fall Sick After Eating Chicken Curry at Residential School Kottagudem

కొత్తగూడెం: తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం  గండుగులపల్లి తెలంగాణ ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. పాఠశాలలో వడ్డించిన చికెన్ కర్రీ తిన్న సుమారు 25 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు సమాచారం.

విద్యార్థులు ఒక్కసారిగా వాంతులు, కడుపునొప్పి వంటి లక్షణాలతో బాధపడడంతో పాఠశాల సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement