ekalavya school
-
ఆహారం వికటించి...11 మంది విద్యార్థులకు అస్వస్థత
పెదబయలు (అల్లూరి సీతారామరాజు జిల్లా): ప్రభుత్వ విద్యార్థులకు పౌష్టికాహారం అందిస్తున్నామని పాలకులు గొప్పలు చెబుతున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. పెదబయలులోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో సోమవారం రాత్రి వడ్డించిన ఆహారం వికటించి 11 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఒకేసారి విద్యార్థులు వాంతులు, విరేచనాల బారిన పడడంతో పాఠశాలలో ఆందోళన నెలకొంది. ఈ పాఠశాలలో మొత్తం 280 మంది విద్యార్థులు చదువుతున్నారు. సోమవారం రాత్రి విద్యార్థులకు క్యాబేజీ, పప్పు కూరతో భోజనం వడ్డించారు. అది తిన్న విద్యార్థులకు అర్ధరాత్రి నుంచే వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. మంగళవారం ఉదయానికి పరిస్థితి విషమించడంతో విద్యార్థులు పాఠశాల ఏఎన్ఎంకు ఫిర్యాదు చేశారు. పాఠశాల సిబ్బంది వెంటనే పాఠశాల వాహనంలో విద్యార్థులను పెదబయలు పీహెచ్సీకి తరలించింది. ఏడో తరగతి విద్యార్థి పి.పుష్కల, 8వ తరగతి విద్యార్థులు డి.కనకమహాలక్ష్మి, కె.భార్గవి, బి.ఇవాంతి, 9వ తరగతి విద్యార్థులు పి.రాహుల్, ఎన్.మధుప్రియ, పి.జషీక, కె.వరహాలమ్మ, పి.మేఘన, బి.విజయవిజ్ఞాన్తోపాటు మరో విద్యార్థి అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఎన్.మధుప్రియ, కె.భార్గవి, కె.వరహాలమ్మ పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో వైద్యాధికారులు ప్రత్యేక చికిత్స అందించారు. ప్రస్తుతం అందరి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఇదిలా ఉంటే పాఠశాల నిర్వహణపై తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెనూ అస్తవ్యస్తంగా ఉందని ఫిర్యాదు చేసినా మార్పు రావడం లేదని పేర్కొన్నారు. ఏటీడబ్ల్యూవో జన్ని జగత్రాయ్, ఎంఈవో కృష్ణమూర్తి పాఠశాలను సందర్శించారు. ఘటనపై విచారణ జరుపుతున్నారు. -
TG: గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్..
కొత్తగూడెం: తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గండుగులపల్లి తెలంగాణ ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. పాఠశాలలో వడ్డించిన చికెన్ కర్రీ తిన్న సుమారు 25 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు సమాచారం.విద్యార్థులు ఒక్కసారిగా వాంతులు, కడుపునొప్పి వంటి లక్షణాలతో బాధపడడంతో పాఠశాల సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
ఏకలవ్య పాటశాల విద్యార్థులకు అస్వస్థత
-
గుంటూరు జిల్లా : కళ్లు చెదిరే విన్యాసాలతో...ఔరా అనిపించారు (ఫొటోలు)
-
అబ్బురపరిచిన విద్యార్థులు.. కళ్లు చెదిరే విన్యాసాలతో..
-
విజయవాడలో ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలల జాతీయ క్రీడలు
-
ఏకలవ్య మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష వాయిదా
సాక్షి, అమరావతి: ఏకలవ్య మోడల్ స్కూళ్ల ప్రవేశ పరీక్షను కరోనా కారణంగా వాయిదా వేశామని గిరిజన గురుకులం సంస్థ సంయుక్త కార్యదర్శి ఎస్. లక్ష్మణ్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర గిరిజన గురుకుల విద్యాసంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 29న జరగాల్సింది. ఇక 6వ తరగతిలో ప్రవేశానికి నిర్వహించే ఈ పరీక్షకు హాజరుకావడానికి దరఖాస్తు చేసుకున్న వారందరికీ పరీక్షను వాయిదా వేసిన విషయాన్ని ఇదివరకే వ్యక్తిగతంగా తెలియజేశామని ఆయన చెప్పారు. ఈ పరీక్షను మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తామనే విషయాన్ని అభ్యర్థులందరికీ తర్వాత తెలియజేస్తామని లక్ష్మణ్ రావు వివరించారు. ఈ విషయాన్ని విద్యార్థులు, వారి తల్లితండ్రులు గమనించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. (‘సీఏ’ పరీక్షలు వాయిదా ) చదవండి: ప్రవేశ పరీక్షల సందేహాలకు..ఎన్టీయే పరిష్కారం -
ఆ స్కూలు మొత్తానికి ఒకటే క్లాసు!!
ఏదైనా స్కూల్లో ఒకే ఒక్క తరగతి ఉండటం చూశారా? అది కూడా.. పదో తరగతి!! కానీ ఉంది. ఎక్కడంటారా? అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో. కేంద్ర ప్రభుత్వ పథకం కింద 2009లో అరుణాచల్ ప్రదేశ్లోని తూర్పు కామెంగ్ జిల్లాలో ఓ పాఠశాల నెలకొల్పారు. అక్కడ కేవలం పదోతరగతి మాత్రమే ఉంది. వాళ్లు ఈ సంవత్సరం బోర్డు పరీక్షలు కూడా రాస్తున్నారు. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూలు 54 మంది విద్యార్థులతో ప్రారంభమైంది. అందరూ ఆరోతరగతిలోనే చేరారు. కానీ నాలుగేళ్ల నుంచి ఉన్నవాళ్లు తప్ప.. కొత్తగా ఎవరూ చేరలేదు. ఒక విద్యార్థి మానేశాడు కూడా. దాంతో ప్రతి ఏటా ఒక్కో తరగతి దాటుకుంటూ ఉన్న విద్యార్థులే వస్తున్నారు. దాంతో తొలి సంవత్సరం ఆరోతరగతి, రెండో సంవత్సరం ఏడో తరగతి.. అలా ఇప్పటికి పదో తరగతికి చేరుకున్నారు. ఇక వచ్చే ఏడాది ఆ స్కూలు భవిష్యత్తు ఏంటో!! ఒకవేళ కొత్తగా విద్యార్థులు చేరినా కూడా వారికి పాఠాలు చెప్పడానికి తగినంత మంది టీచర్లు కూడా అక్కడ లేరట. 2009 తర్వాత అక్కడ కొత్తగా నియామకాలే జరగలేదు. దేశంలో తొమ్మిదో పంచవర్ష ప్రణాళికా కాలంలో 100 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లు తెరవాలని కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ నిర్ణయించింది. వాటిలో రెండు అరుణాచల్ ప్రదేశ్కు మంజూరయ్యాయి. వాటి పరిస్థితి ఇలా ఉందన్నమాట!!


