
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గురువారం 39,413 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, అందులో 612 మంది వైరస్ బారినపడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8.27 లక్షలకు చేరింది. ఒక్కరోజులో 1,061 మంది కోలుకోగా, ఇప్పటి వరకు 8.19 లక్షలకు చేరాయి. ప్రస్తుతం 4,271 క్రియాశీలక కేసులు నమోదయ్యాయి.