Telangana: కొత్తగా 114 కరోనా కేసులు

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గురువారం 10,804 మందికి నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో 114 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 8.36 లక్షలకు చేరింది. ఒక రోజులో 130 మంది కోలుకోగా, ఇప్పటి వరకు 8.31 లక్షలకు చేరాయి. ప్రస్తుతం 792 క్రియాశీలక కేసులు నమోదయ్యాయని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు.