Telangana: ఈ నెల 22న ఇంటర్‌ ఫలితాలు | Telangana Intermediate Exam Results 2025 To Be Announced On April 22 | Sakshi
Sakshi News home page

Telangana: ఈ నెల 22న ఇంటర్‌ ఫలితాలు

Apr 20 2025 4:21 AM | Updated on Apr 20 2025 11:12 AM

Telangana Intermediate Exam Results 2025 To Be Announced On April 22

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్మీడియెట్‌ పబ్లిక్‌ పరీక్షల ఫలితాలను ఈనెల 22న విడుదల చేయనున్నట్లు తెలంగాణ ఇంటర్మీడియెట్‌ బోర్డు కార్యదర్శి ఎస్‌.కృష్ణ ఆదిత్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు విద్యాభ వన్‌లో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఈ ఫలితాలను విడుదల చేస్తారు.

కార్యక్రమంలో రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ కూడా హాజరు కానున్నారు. విద్యార్థులు/తల్లి దండ్రులు ఫలితాల కోసం బోర్డు అధికారిక వెబ్‌సైట్‌  ్టtgbie.cgg.gov.in ద్వారా ఫలితాలను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఐవీఆర్‌ పోర్టల్‌ 9240205555 ఫోన్‌నంబర్‌ ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చు.

Advertisement
 
Advertisement
Advertisement