తెలంగాణ: రేపు ఇంటర్ సెకండియర్ ఫలితాలు

Telangana Inter Second Year Exam Results Release Tomorrow - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రేపు (సోమవారం) ఉదయం 11 గంటలకు తెలంగాణ ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదల కానున్నాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలు విడుదల చేయనున్నారు. ఫస్టియర్ మార్కుల ఆధారంగా సెకండియర్ మార్కులు కేటాయిస్తామని మంత్రి వెల్లడించారు. ఇప్పటికే మార్కులకు సంబంధించిన మార్గదర్శకాలను సర్కారు విడుదల చేసింది. ప్రాక్టికల్ పరీక్షలకు 100 శాతం మార్కులు, ఫస్టియర్‌లో ఫెయిల్ అయిన సబ్జెక్టులకు ఈ ఏడాది 35 శాతం మార్కులు కేటాయించి పాస్ చేయనున్నారు. tsbie.cgg.gov.inలో ఫలితాలు చూడవచ్చు.

చదవండి: రేవంత్‌కు పోస్ట్‌: ఎంపీ కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు 
అక్కడికి వద్దన్నా వెళ్లిన మోత్కుపల్లి.. బీజేపీ సీరియస్‌!

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top