రాజు ఆత్మహత్యపై విచారణ: 4 వారాలు గడువిచ్చిన హైకోర్టు

Telangana High Court Orders To Probe On Accused Raju Incident - Sakshi

విచారణ జరిపి నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వాలని వరంగల్‌ మెజిస్ట్రేట్‌కు ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: సైదాబాద్‌ ఘటన నిందితుడు రాజు మృతిపై తెలంగాణ హైకోర్టు జ్యుడీషియల్‌ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. విచారణ జరిపి నాలుగు వారాల్లో సీల్డ్‌ కవర్‌లో నివేదిక సమర్పించాలని తెలిపింది. ఈ మేరకు వరంగల్ మూడో మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్‌కు న్యాయస్థానం ఆదేశించింది. రాజు మృతిపై పౌర హక్కుల సంఘం నేత పిల్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. రాజును పోలీసులు హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని పిటిషనర్‌ వాదనలు వినిపించారు.
చదవండి: విద్యార్థినికి ఘోర అవమానం.. పొట్టి దుస్తులు వేసుకోవడం నేరమా?

అయితే ఆ వాదనలకు అడ్వకేట్‌ జనరల్‌ ప్రసాద్‌ ప్రతివాదనలు చేశారు. రాజు ఆత్మహత్య చేసుకున్నాడని స్పష్టం చేసింది. రాజు ఆత్మహత్యపై ఏడుగురి సాక్ష్యాల నమోదు ప్రక్రియ, పోస్టుమార్టం వీడియో చిత్రీకరణ చేసినట్లు ఏజీ నివేదిక ఇచ్చారు. ఆ వీడియోలను రేపు రాత్రి 8 గంటల్లోగా వరంగల్‌ జిల్లా జడ్జికి అప్పగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. స్టేషన్‌ ఘన్‌పూర్‌ సమీపంలో రైల్వే పట్టాలపై గురువారం ఉదయం రాజు మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే పోలీస్‌ వర్గాలు మాత్రం రాజుది ఆత్మహత్య అని స్పష్టంగా చెబుతున్నారు. కానీ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పౌర హక్కుల నాయకుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు.
చదవండి: నిర్మల్‌ సభలో ‘ఈటల’ స్పెషల్‌ అట్రాక్షన్‌: చప్పట్లు మోగించిన అమిత్‌ షా

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top