Mariamma Lockup Death Case: మరియమ్మ లాకప్‌ డెత్‌పై తీర్పు వెలువరించిన తెలంగాణ హైకోర్టు

Telangana High Court Judgment On Mariamma Lockup Death Case - Sakshi

Mariyamma Lockup Death Case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మరియమ్మ లాక్ అప్ డెత్ అంశంపై తెలంగాణ హైకోర్టు సోమవారం తీర్పు వెల్లడించింది. మరియమ్మ కేసును సీబీఐకి అప్పగించేందుకు హైకోర్టు నిరాకరించింది. ప్రత్యేకంగా దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చెయ్యాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కోర్టు ఇప్పటికే ఇచ్చిన రిపోర్టు ఆధారంగా దర్యాప్తు కొనసాగించాలని ఆదేశించింది.

కాగా, యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగుడూరు పోలీసు స్టేషన్ పరిధిలో జూన్ నెలలో మృతి చెందిన మరియమ్మ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దొంగతనం కేసులో  ఇంటరాగేషన్‌ పేరుతో మరియమ్మపై స్టేషన్‌లో థర్ఢ్‌ డిగ్రీ ప్రయోగించారు. మరియమ్మ దెబ్బలకు తాళలేక స్పృహ కోల్పోయింది. దీంతో పోలీసులు  స్థానిక ఆర్‌ఎంపీ వద్దకు తీసుకెళ్లారు.  నాడి పరిశీలించిన వైద్యుడు పరిస్థితి విషమంగా ఉందని, పల్స్‌ దొరకడం లేదని చెప్పడంతో హుటాహుటిన భువనగిరి జిల్లా కేంద్రాస్పత్రికి  తరలించారు. అక్కడ పరిశీలించిన వైద్యులు చనిపోయినట్లు చెప్పారు. 
చదవండి: మరియమ్మ లాకప్‌డెత్‌పై సీబీఐ దర్యాప్తు వద్దు.. ‘ఆదేశిస్తే మేము సిద్ధం'

దీనిపై వివిధ ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తం అవ్వడంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. దీంతో బాధితురాలుకు న్యాయం చేకురుస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇప్పటికే మరియమ్మ లాకప్ డెత్ కేసులో ముగ్గురు పోలీసు అధికారులను తెలంగాణ ప్రభుత్వం విధుల నుంచి తొలగించింది. ఎస్సై మహేశ్వర్, కానిస్టేబుల్స్ రషీద్, జానయ్యలను శాశ్వతంగా వీధుల నుండి బహిష్కరించింది. 

తొలగించిన పోలీసుల పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసినట్లు గతంలో ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. అయితే ఈ కేసును సీబీఐ విచారణకు అప్పగిస్తే ప్రజలకు పోలీసులపై నమ్మకం సన్నగిల్లే అవకాశం ఉందని డ్వకేట్‌ జనరల్ కోర్టుకు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న దర్యాప్తు సంస్టల చేత విచారణ జరిపించేలా చూడాలని కోరారు. తాజాగా ఈ కేసును సీబీఐకి అప్పగించే విషయంపై తీర్పు వెలువరించింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top