breaking news
lockup death case
-
సాయికృష్ణ కేసులో సంచలనం
సాక్షి, అమరావతి: ఆది నుంచీ మలుపులపై మలుపులు తిరుగుతున్న కాపు యువకుడు సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో ఊహించని మలుపు చోటు చేసుకుంది. తన కుమారుడు లాకప్‌డెత్ కేసులో సీబీఐ దర్యాప్తు కోసం తాను దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకోవడం లేదని గాదె విజయలక్ష్మి బుధవారం హైకోర్టుకు నివేదించింది. తనకు తెలియకుండా, తన సమ్మతి లేకుండా, ఎలాంటి సూచనలు తీసుకోకుండానే సీబీఐ దర్యాప్తు కోసం గతంలో ఆమె దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు న్యాయవాది కోగంటి రిత్విక పిటిషన్ వేశారని న్యాయవాది గుడివాక వాసుదేవుడు హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. రిత్విక స్థానంలో వాదనలు వినిపించేందుకు తనను విజయలక్ష్మి నియమించుకుని, ఆ మేరకు వకాలత్ ఇచ్చారని ఆయన వివరించారు. తాను ఈ కేసులో హాజరయ్యేందుకు రిత్విక నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) కోరినప్పటికీ, ఆమె స్పందించడం లేదని వాసుదేవుడు కోర్టుకు నివేదించారు. ఎన్వోసీతో పాటు కేసు రికార్డులను కూడా ఇవ్వలేదని చెప్పారు. అందువల్ల ఎన్వోసీ లేకుండానే వకాలత్ దాఖలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు. ఆ మేర తాము దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను అనుమతించాలని కోరారు. దీంతో హైకోర్టు, విజయలక్ష్మి తాజాగా దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను పరిశీలించింది. ఇందులోని ఆరోపణలు చాలా తీవ్రమైనవన్న హైకోర్టు, వాటి సంగతి తేలుస్తామని స్పష్టం చేసింది. ఇదేమీ చిన్న విషయం కాదంది. రిత్విక వాదనలు విన్న అనంతరమే తగిన నిర్ణయం తీసుకుంటామని, ఆమెకు నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రవినాథ్ తిల్హరి, జస్టిస్ చింతలపూడి పురుషోత్తం కుమార్ ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.నాకు తెలియకుండానే రిత్విక ఆ పిటిషన్ వేశారు..తన కుమారుడిని కోర్టు ముందు హాజరు పరిచేలా ఆదేశాలు జారీ చేయాలంటూ సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ తర్వాత సాయికృష్ణ లాకప్‌డెత్ జరిగిందన్న విషయం రూఢీ అయింది. దీంతో ఆమె తన కుమారుడి లాకప్‌డెత్‌పై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. ఇదిలా ఉండగా, సీబీఐ దర్యాప్తు కోసం తాను దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను ఉపసంహరించుకుంటానని, అందుకు అనుమతినివ్వాలని కోరుతూ ఈ నెల 14న విజయలక్ష్మి తరఫు న్యాయవాది కోగంటి రిత్విక అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో సీబీఐ దర్యాప్తు కోసం వేసిన అనుబంధ పిటిషన్‌తో పాటు హెబియస్ కార్పస్ పిటిషన్‌నూ ఉపసంహరించుంటామని పేర్కొన్నారు. దీనిని పరిశీలించిన జస్టిస్ తిల్హరీ ధర్మాసనం, ప్రధాన పిటిషన్‌ను ఉపసంహరించుకుంటామని ఓ చోట, అనుబంధ పిటిషన్‌ను ఉపసంహరించుకుంటామని మరో చోట రాశారని గుర్తు చేసింది. అసలు సీబీఐ దర్యాప్తు కోసం దాఖలు చేసిన పిటిషన్‌ను ఎందుకు ఉపసంహరించుకోవాలనుకుంటున్నారో వివరిస్తూ తాజాగా పిటిషన్ దాఖలు చేయాలని విజయలక్ష్మిని ఆదేశిస్తూ విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసిన విషయం తెలిసిందే.ఐదుగుర్ని అరెస్ట్ చేశాం.. ఒకరు పరారీలో ఉన్నారు..తాజాగా ఈ కేసు బుధవారం మరోసారి విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా విజయలక్ష్మి తరఫు న్యాయవాది వాసుదేవుడు స్పందిస్తూ జరిగిన విషయాన్ని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ, సాయికృష్ణ కేసు దర్యాప్తు పురోగతి ఏమిటని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) సింగమనేని ప్రణతిను ప్రశ్నించింది. మొత్తం ఆరుగురు నిందితుల్లో ఐదుగురిని అరెస్ట్ చేశామని, మరొకరు పరారీలో ఉన్నారని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, విజయలక్ష్మి అనుమతి లేకుండానే సీబీఐ దర్యాప్తు కోసం గతంలో వేసిన పిటిషన్ ఉపసంహరణకు పిటిషన్ వేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న న్యాయవాది రిత్వికకు నోటీసు ఇవ్వాలని వాసుదేవుడిని ఆదేశిస్తూ విచారణను గురువారానికి వాయిదా వేసింది.దర్యాప్తు పురోగతిని మా ముందుంచండిసాయికృష్ణ లాకప్‌డెత్‌పై నమోదు చేసిన కేసులో దర్యాప్తు పురోగతికి సంబంధించిన వివరాలను తమ ముందుంచాలని హైకోర్టు బుధవారం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఆదేశించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కృష్ణలంక పోలీస్‌స్టేషన్ అప్పటి ఇన్స్పెక్టర్ నాగరాజును పోలీసు కస్టడీకి అప్పగించే విషయంలో సుప్రీంకోర్టు ఏం ఉత్తర్వులిచ్చిందో వాటిని తమ ముందుంచాలని కూడా ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ లీసా గిల్, న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుణరంజన్ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. సాయికృష్ణ లాకప్‌డెత్ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ సెంటర్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ అధ్యక్షుడు గోచిపాత శ్రీనివాసరావు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. -
దళితుడు ఏడుకొండలు లాకప్ డెత్‌లో షాకింగ్ నిజాలు!
-
ఏడుకొండలు లాకప్ డెత్ కేసులో ప్రత్యక్ష సాక్షుల సంచలన నిజాలు!
-
‘సిట్’ మరిచిన సీసీ ఫుటేజీ!
సాక్షి ప్రతినిధి, విజయవాడ: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక ఆధారాల సేకరణ వైపు ‘సిట్’ బృందం కన్నెత్తి చూడటం లేదు. సీసీ ఫుటేజీ రికవరీ చేసే అవకాశం ఉన్నా ఆ దిశగా ప్రయత్నం చేయకపోవడం విస్మయం కలిగిస్తోంది. ఈ కేసు ముందుకు కదలాలంటే సీసీ పుటేజి అత్యంత కీలకమని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రధాన నిందితుడు నాగరాజు గత 18 నెలలుగా పాల్పడిన దారుణాలు వెలుగు చూడకుండా ఉండేందుకే ప్రణాళిక ప్రకారం డేటాను మాయం చేసినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ప్రధానంగా నెట్ వర్క్, వీడియో రికార్డర్ హార్డ్‌డిస్క్‌లను మార్చేసి సాక్ష్యాలు దొరకకుండా జాగ్రత్త పడ్డారు. అయితే ఆపరేటింగ్ సిస్టం పనిచేసేందుకు అందులో కొద్దిపాటి ర్యాం ఉంటుంది. ఈ దృశ్యాలు ఎవరు, ఎప్పుడు తొలగించారు? అనే వివరాలు అంతర్గతంగా నిక్షిప్తం అవుతాయి. ఎన్వీఆర్ లాగ్ వీడియోలను వెలికి తీసి ఫోరెన్సిక్ ల్యాబ్ ద్వారా విశ్లేషిస్తే ఆ గుట్టు రట్టయ్యే అవకాశం ఉంది. సాక్ష్యాధారాల సేకరణలో ఇది కీలకం కానుంది. అయితే సిట్ ఏర్పాటై రోజులు గడిచిపోతున్నా విచారణలో మాత్రం పురోగతి లేదు. బాధితుడి తల్లి విజయలక్ష్మి ఫిర్యాదు మేరకు కొన్ని అరెస్టులు మినహా పెద్దగా సాధించింది ఏమీ లేదు. నిందితుల నుంచి కీలక సమాచారం ఏదీ రాబట్టలేదు. లాకప్‌డెత్‌కు గురైన సాయికృష్ణ, నాగరాజు వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడిన కాంత్రికుమార్ కుటుంబాలను మాజీ సీఎం వైఎస్ జగన్ పరామర్శించడంతో మేలుకున్న చంద్రబాబు సర్కారు తప్పనిసరి పరిస్థితుల్లో విచారణకు ఆదేశించినా చిత్తశుద్ధి చూపడం లేదు.మా లాయర్‌ను మార్చడంలేదురెండో అదనపు జ్యుడీషియల్ కోర్టుకు తెలిపిన సాయికృష్ణ చిన్నమ్మ సాక్షి, విజయవాడ: విజయవాడ కృష్ణలంకకు చెందిన కాపు యువకుడు సాయికృష్ణ లాకప్‌డెత్ కేసును హ్యూమన్ రైట్స్ కమిటీ సభ్యుడు, న్యాయవాది మల్లెమూడి సతీష్ బాబే వాదిస్తారని సాయికృష్ణ తల్లి గాదె విజయలక్ష్మి సోదరి, అడ్వొకేట్ కనకదుర్గ తెలిపారు. గాదె సాయికృష్ణ కేసులో రెండో అదనపు జ్యుడిషియల్ కోర్టులో గాదె విజయలక్ష్మి తన న్యాయవాదిని మార్చుకున్నట్లు ఒక అఫిడవిట్ దాఖలు చేసిన విషయం విదితమే. ఈ పిటిషన్‌పై శుక్రవారం కోర్టులో విచారణ జరిగింది. తన సోదరి విజయలక్ష్మి తన కొడుకు సాయికృష్ణ కేసులో న్యాయవాదిని మార్చుకుంటున్నట్లు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని, న్యాయవాది మల్లెమూడి సతీష్ బాబును మార్చడంలేదని కనకదుర్గ రెండో అదనపు జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ శ్రీకాంత్ దృష్టికి తెచ్చారు. హ్యూమన్ రైట్స్ కమిటీ సభ్యులు మాత్రమే తమ తరఫున వాదనలు కొనసాగిస్తారని పేర్కొన్నారు. పిటిషనర్ గాదె విజయలక్ష్మి తన ఎదుట హాజరు కావాలని, న్యాయవాదిని మార్చుకోవడంలేదని స్పష్టమైన హామీ ఇవ్వాలని, ఆ తరువాతే ఈ కేసులో జ్యుడీషియల్, సీసీ ఫుటేజీ పరిశీలన విచారణను కొనసాగిస్తానని జడ్జి తెలిపారు. విజయలక్ష్మి ఆరోగ్య సమస్య కారణంగా రాలేదని, ఆమె తరఫున తాను హాజరైనట్లు కనకదుర్గ తెలిపారు. దీంతో జడ్జి కేసు విచారణను ఈ నెల 13కి వాయిదా వేశారు. -
లాకప్ డెత్ కేసులో మరో ట్విస్ట్.. కోర్టులో సాయికృష్ణ పిన్ని
-
దొరికిన సాయికృష్ణ లాకప్ డెత్ CCTV ఫుటేజ్
-
సాయికృష్ణ కేసులో ‘సిట్’ సాగదీత!
సాక్షి, విజయవాడ/సాక్షి ప్రతినిధి, విజయవాడ: కాపు యువకుడు సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో ‘సిట్’ దర్యాప్తు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా ఉండగా.. పోలీస్ బాస్‌లు పెదవి విప్పడం లేదు. అధికార పార్టీకి చెందిన ఓ పార్లమెంట్ సభ్యుడు, పోలీస్ బాస్, నగర బాస్‌లకు తెలిసే ఇదంతా జరిగిందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నా స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు నాగరాజుతో పాటు హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నాని, సాంబయ్య, బాబురావును అరెస్టు కాగా సిట్ విచారణ ఒక అడుగు ముందుకు.. నాలుగు అడుగులు వెనక్కి అన్నట్లు సాగడం వెనుక ప్రభుత్వ ఒత్తిడే కారణమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాధిత కుటుంబాన్ని మాజీ సీఎం వైఎస్ జగన్ పరామర్శించిన తరువాతే కూటమి ప్రభుత్వంలో చలనం వచ్చింది. నిజాలు తేల్చాలని అన్ని వర్గాల నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో విధిలేని పరిస్థితుల్లో సిట్‌ను ఏర్పాటు చేసింది. మరి నెలన్నర రోజుల్లో విచారణలో సిట్ ఏం తేల్చిందంటే సమాధానం లేదు. తన కుమారుడిని చంపేశారని.. కనీసం బూడిదైనా ఇవ్వండయ్యా..! అంటూ వేడుకుంటున్న సాయికృష్ణ తల్లి గాదె విజయలక్ష్మి ఆర్తనాదం అరణ్య రోదనగానే మిగిలింది.నాగరాజు బినామీ సురేష్ ఎక్కడ?సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో ఏ 4 ఎవరు? ప్రధాన నిందితుడు నాగరాజు బినామీ సురేష్‌ను సిట్ అదుపులోకి తీసుకుందా? లేదంటే పరారీలో ఉన్నాడా? అనే విషయాలపై స్పష్టత లేదు. కస్టడీలో తీవ్రంగా గాయపడ్డ సాయికృష్ణకు వైద్యం చేసిన ఆర్ఎంపీని సిట్ విచారించిందా? లేదా? అనేది వెల్లడించలేదు. వైద్యం చేయడానికి అతడిని ఎవరు పిలిపించారు? అతడినే పిలవడానికి కారణాలు ఏమిటి? ఇలా ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు రాబట్టాల్సి ఉంది. కృష్ణలంక స్టేషన్‌కు సమీపంలోనే క్లినిక్ నడుపుతున్న ఆర్ఎంపీ ప్రస్తుతం అజ్ఞాతంలోకి జారుకున్నాడు. కొద్ది రోజులుగా క్లినిక్ మూతపడింది. సీన్ రీ కన్స్ట్రక్షన్కు అనుమతి..న్యాయస్థానం అనుమతి మేరకు నిందితుడు నాగరాజును సిట్ బృందం గురువారం నుంచి ఈ నెల 16 వరకు విచారించనుంది. విజయవాడ కోర్టు విధించిన షరతులను హైకోర్టు సవరించిన నేపథ్యంలో రాజమహేంద్రవరం జైలు నుంచి నాగరాజును విజయవాడకు తరలించనున్నారు. సాక్ష్యాధారాలను సేకరించడంతో పాటు సీన్ రీ కన్స్ట్రక్షన్కు న్యాయస్థానం అనుమతించింది. ఈ నెల 17వ తేదీన విజయవాడ కోర్టు మేజిస్ట్రేట్ ఎదుట ఒరిజినల్ వీడియో రికార్డులను సమర్పించాలని సిట్‌ను ఆదేశించింది. నిందితుడు నాగరాజు నోరు మెదపకుండా నొక్కి పెడుతున్నది ఎవరు? అనేది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు కృష్ణలంక పీఎస్ హెడ్ కానిస్టేబుళ్లు చెన్నయ్య, సత్యనారాయణ, కానిస్టేబుల్ బాబు, సహాయ రైటర్ వీరాంజనేయుడు, రైటర్ రాజేష్ తదితరులు సిట్ ఎదుట విచారణకు హాజరైనట్లు సమాచారం. మే 6వతేదీ నుంచి 8వ తేదీ వరకు డ్యూటీలో ఎవరెవరు ఉన్నారు? ఆ సమయంలో స్టేషన్లో ఏం జరిగిందనే కోణంలో విచారించినట్లు సమాచారం. సీఐ నాగరాజుకు రిమాండ్ పొడిగింపువిజయవాడ లీగల్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న సీఐ నాగరాజు రిమాండ్ బుధవారం ముగియడంతో పోలీసులు న్యాయస్థానంలో వర్చువల్‌గా హాజరుపరిచారు. విచారణ అనంతరం నాగరాజుకు ఈ నెల 22వ తేదీ వరకు రిమాండ్ పొడిగిస్తూ 2వ అదనపు జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ న్యాయమూర్తి ఎస్.శ్రీకాంత్ ఆదేశాలు జారీచేశారు. -
సాయికృష్ణ కేసు దర్యాప్తుపై స్టేటస్ రిపోర్ట్ ఇవ్వండి
సాక్షి, అమరావతి: కాపు యువకుడు సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో దర్యాప్తు పురోగతి వివరాలతో స్టేటస్ రిపోర్ట్‌ను సీల్డ్ కవర్లో తమ ముందుంచాలని హైకోర్టు బుధవారం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఆదేశించింది. తదుపరి విచారణను 3 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ లీసా గిల్, న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుణరంజన్ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ సంస్థ అధ్యక్షుడు గోచిపాత శ్రీనివాసరావు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన సంగతి తెలిసిందే.సీజే ధర్మాసనం ముందు తాజాగా విచారణకు వచ్చిన ఈ వ్యాజ్యంలో పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి అంతకుముందు వాదనలు వినిపించారు. ‘సాయికృష్ణ లాకప్‌డెత్ వ్యవహారాన్ని ప్రభుత్వం కేవలం కృష్ణలంక ఇన్స్పెక్టర్ నాగరాజు వరకే పరిమితం చేస్తోంది. లాకప్‌డెత్ వెనుక డీజీపీ, విజయవాడ కమిషనర్, డీసీపీ, ఏసీపీ తదితరుల పాత్ర ఉంది. సాయికృష్ణ తల్లి దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ సందర్భంగా డీజీపీ, విజయవాడ కమిషనర్లు హైకోర్టును తప్పుదోవ పట్టించారు. సాయికృష్ణ ఎక్కడ ఉన్నారో తమకు తెలియనే తెలియదని చెప్పారు. అయితే నాగరాజును అరెస్ట్ చేసిన తరువాత దాఖలు చేసిన రిమాండ్ రిపోర్ట్‌లో సాయికృష్ణను టాస్క్‌ఫోర్స్ పోలీసులు మే 6నే అదుపులోకి తీసుకున్నారు. తద్వారా సాయికృష్ణ గురించి పూర్తి వివరాలు డీజీపీ, కమిషనర్లకు స్పష్టంగా తెలుసని అర్థమవుతోంది. దీనిపై పారదర్శక, నిష్పాక్షిక దర్యాప్తు కోరుతున్నాం. సిట్ దర్యాప్తుపై విశ్వాసం లేదు. స్వతంత్ర సంస్థ దర్యాప్తుతోనే నిజాలు నిగ్గుతేలుతాయి. ఈ దారుణంలో డీజీపీతో సహా ఉన్నతాధికారులు చట్టం నుంచి తప్పించుకోవడానికి వీల్లేదు’ అని పొన్నవోలు ధర్మాసనం ముందు తన వాదనలు వినిపించారు. కాగా, ఈ కేసులో ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు, ఆరుగురిని నిందితులుగా చేర్చినట్లు సిట్ తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ ఈ సందర్భంగా ధర్మాసనానికి తెలియజేశారు. -
హే రామ్..సేవ్ ఆంధ్ర
‘‘సాయికృష్ణ తల్లి మే 28న రాత్రి 7.26 గంటలకు విజయవాడ సీపీకీ అర్జీ పెట్టుకుంది. ఆయన పట్టించుకోలేదు. ఆ తర్వాత సాయికృష్ణ బంధువులు డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఆయన కూడా పట్టించుకోలేదు. రాష్ట్రంలో వ్యవస్థలు కుప్పకూలిపోయాయని చెప్పడానికి ఇవన్నీ నిదర్శనాలు కావా? సీఐని సీపీ కాపాడతాడు. సీపీని డీజీపీ కాపాడతాడు. డీజీపీని చంద్రబాబు కాపాడతాడు. ఇవన్నీ రాష్ట్రంలో మన కళ్లెదుట కన్పిస్తున్న సాక్ష్యాలు. కుప్పకూలిన, దిగజారిన పోలీస్ వ్యవస్థకు అద్దంపడుతున్నాయి.’’‘‘సాయికృష్ణ కోసం ఆ తల్లి వేదన పడుతూ రోజూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ పెట్టుకున్న అర్జీలకు విలువ లేదా? ఒక దళిత యువకుడు ఆత్మహత్య చేసుకుంటూ ఇచ్చిన మరణ వాంగ్మూలానికి విలువ లేదా? జగన్ వెళ్తే కానీ అరెస్ట్‌లు మొదలు కాలేదు. ఆ అరెస్ట్‌లను చిన్న చిన్నోళ్లకు పరిమితం చేశారు. నేరాన్ని కప్పిపెట్టి నిందితుల్ని ప్రోత్సహించిన సీపీని, డీజీపీని, చంద్రబాబును ఎందుకు బాధ్యులు చేయడం లేదని అడుగుతున్నా? ’’‘‘18 నెలల సీసీ కెమెరాల ఫుటేజ్ తొలగించినట్టు రిమాండ్ రిపోర్టులో రాశారు. అంటే ఈ 18 నెలల్లో ఎన్ని మర్డర్లు జరిగాయో? రాష్ట్ర రాజధాని ప్రాంతంలో పైగా సీపీ, డీజీపీ, చంద్రబాబు, హోంమంత్రి కార్యాలయాలన్నీ ఇక్కడే ఉన్నా... సీసీ ఫుటేజ్ మాయమవడం ఎలా సాధ్యం? ఎవరికి నచ్చినట్టు వాళ్లు డిలీట్ చేసుకుంటూ పోవడమేమిటి? ఇక సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిమెంట్లు ఎందుకు? ఇక్కడ డిలీట్ చేస్తే... కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఫుటేజ్ ఉండదా? అక్కడ ఏమైనట్టు?’’ ‘‘అమరావతిలో జరిగే ప్రతీ పనిలోనూ కన్పించేది అవినీతి, దోపిడీయే... కేంద్రప్రభుత్వం అమరావతిలో కడుతున్న ప్రభుత్వ భవనాలు, ఉద్యోగుల క్వార్టర్స్ నిర్మాణానికి చదరపు అడుగుకు రూ.4,645 అవుతుంది. మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ ఎఫైర్స్, కేంద్ర కేబినెట్లో ఈ మేరకు అప్రూవల్ ఇచ్చింది. అదే అమరావతిలో చంద్రబాబు కొత్త సెక్రటేరియట్ నిర్మాణం కోసం ఆయన చేస్తున్న ఖర్చు చదరపు అడుగుకు అక్షరాలా రూ.20,439.’’ ‘‘రెండేళ్ల క్రితం ఏ ఇంట్లో అయినా సంక్షేమం, అభివృద్ధి, విద్యా, వైద్యం, వ్యవసాయం, పరిపాలనా రంగాల్లో తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణలు, ప్రజలకు చేసిన మంచి గురించి చర్చ జరిగేది. కానీ నేడు ఏ ఇంటికి వెళ్లినా రెడ్ బుక్ రాజ్యాంగం, కస్టోడియల్ డెత్స్, చనిపోయిన తర్వాత శవాలను మాయం చేయడం, చంద్రబాబు చేసిన సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ మోసాలు, ఆయన చెబుతున్న అబద్ధాలు, చేస్తున్న టాపిక్ డైవర్షన్లు, ప్రజలకు పొడుస్తున్న వెన్నుపోట్లపైనే చర్చ జరుగుతోంది.’’‘‘జంగిల్ రాజ్ అంటే బిహార్‌లో ఉంటుందని అంటారు. కానీ ఆంధ్రాలో కూడా జంగిల్ రాజ్ నడుస్తోంది. చంద్రబాబు జంగిల్ రాజ్ పాలనలో బాధితులే నిందితులు అవుతున్నారు. రాజధాని ప్రాంతానికి వెళ్లిన మా పార్టీ నాయకులపై దాడి చేయడమే కాకుండా వారిని నిందితులుగా చూపిస్తూ కేసులు పెట్టిన ఘటనలు కళ్లెదుటే కన్పిస్తున్నాయి. న్యాయం, ధర్మం అనేది పూర్తిగా భూస్థాపితం చేశారనడానికి ఇంతకంటే ఉదాహరణ మరొకటి అవసరం లేదు.’’ -వైఎస్ జగన్సాక్షి, అమరావతి: ‘‘రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా(చట్టం) పక్కకు పోయి మొత్తం ‘రూల్ ఆఫ్ ఫియర్’(భయం) రాజ్యమేలుతోంది. పోలీస్ స్టేషన్లకు వెళ్తే న్యాయం జరుగుతుందన్న నమ్మకం ప్రజల్లో సన్నగిల్లిపోయింది. ఇక్కడ జంగిల్‌రాజ్ పాలన సాగుతోంది.’’ అంటూ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు ఎదురు లేదని, తామేం చేసినా చెల్లుతుందన్నట్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహారశైలి ఉందని, రాష్ట్రంలో న్యాయం, ధర్మం గాడితప్పాయని జగన్ పేర్కొన్నారు. చంద్రబాబు తాను చేస్తున్న దోపిడీ, అవినీతి, దుర్మార్గపు పాలనతో పాటు, తాను మోసం చేసిన సూపర్ సిక్సులు, సూపర్ సెవెన్లపై ప్రశ్నించేవారి గొంతు నొక్కడం కోసం చట్టాన్ని, పోలీస్ వ్యవస్థను తన చేతుల్లోకి తీసుకుని దారుణంగా వ్యవహరిస్తున్నారని ఎత్తిచూపారు. సాయికృష్ణ లాకప్‌డెత్, శవాన్ని మాయం చేయడం, పోలీసుల వేధింపులతో క్రాంతికుమార్ ఆత్మహత్య రాష్ట్రంలో నెలకొన్న భయానక పరిస్థితులకు అద్దం పడతాయని అన్నారు. చివరకు తాను వెళ్లి సాయికృష్ణ కుటుంబాన్ని కలిసే వరకు, ప్రభుత్వంలో చలనం రాలేదని, దాదాపు 46 రోజుల పాటు గోప్యంగా ఉంచారని గుర్తు చేశారు. రాష్ట్రంలో పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నాయి కాబట్టే అంటున్నాం.. ‘‘హే రామ్.. సేవ్ ఆంధ్ర’’ అని జగన్ పేర్కొన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ పోలీసు వ్యవస్థను చంద్రబాబు సర్కార్ ఆయుధంగా మార్చుకుని.. వ్యవస్థలను దిగజార్చి సాగిస్తున్న భీతావహపాలనను సాక్ష్యాధారాలతో సహా ఎత్తిచూపుతూ కడిగిపారేశారు. మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ ఏమన్నారంటే.. రాష్ట్రంలో భయం రాజ్యమేలుతోంది.. ‘‘రెండేళ్ల క్రితం వరకు ఏ ఇంట్లో అయినా.. సంక్షేమం, అభివృద్ధి, విద్యా, వైద్యం, వ్యవసాయం, పరిపాలనా రంగాల్లో తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణలు, ప్రజలకు చేసిన మంచి గురించి చర్చ జరిగేది. కానీ నేడు ఏ ఇంటికి వెళ్లినా రెడ్ బుక్ రాజ్యాంగం, కస్టోడియల్ డెత్స్, చనిపోయిన తర్వాత శవాలను మాయం చేయడం, చంద్రబాబు చేసిన సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ మోసాలు, ఆయన చెబుతున్న అబద్ధాలు, చేస్తున్న టాపిక్ డైవర్షన్లు, ప్రజలకు పొడుస్తున్న వెన్నుపోట్లపైనే చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందంటే? చట్టం, న్యాయం (రూల్ ఆఫ్ లా) పక్కకు పోయి భయం(రూల్ ఆఫ్ ఫియర్) రాజ్యమేలుతోంది. పోలీస్ స్టేషన్లకు వెళ్తే న్యాయం జరుగుతుందన్న నమ్మకం, విశ్వాసం ప్రజల్లో పూర్తిగా సన్నగిల్లిపోయాయి. పోలీస్ స్టేషన్‌కు వెళ్లాలంటే భయపడే పరిస్థితులు వచ్చాయి. చంద్రబాబు చేస్తున్న దోపిడీ, అవినీతి, దుర్మార్గపు పాలన, తాను చేసిన సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ మోసాలు, ఎన్నికలప్పుడు ఆయనిచ్చిన బాండ్ల గురించి ఎవరైనా ప్రశ్నిస్తే చాలు.... ఆ ప్రశ్నించే గొంతును నొక్కే కార్యక్రమం జరుగుతోంది. చట్టాన్ని, పోలీస్ వ్యవస్థను చంద్రబాబు తన చేతుల్లో తీసుకున్నారు.. ఎవరైనా తనను ప్రశ్నిస్తే.. అది ప్రతిపక్ష పార్టీ నేతలైనా, సోషల్ మీడియా కార్యకర్తలైనా, జర్నలిస్టులైనా.. వారిని అణిచివేసే కార్యక్రమం జరుగుతోంది. ఇందుకోసం చట్టాలను, పోలీస్ వ్యవస్థను ఆయుధంగా వాడుకుంటున్నారు. వ్యవస్థలన్నీ దిగజారిపోయాయివ్యవస్థలన్నీ దిగజారిపోయాయి. ఇవాళ మనం చూస్తున్న ఈ దుర్మార్గాలన్నీ కూడా దాని పర్యవసానాలే. రాష్ట్రంలో న్యాయం, ధర్మం గాడితప్పింది. పాలించే వారిలో భయమనేది పోయింది. మనం మనుషులమేనన్న సంగతి మరిచిపోయి, ఒక మనిíÙని మనం ఏం చేసినా అడిగే వాడు ఉండడనే ధైర్యం అసలు ఎక్కడ నుంచి వచ్చింది? ఇది ప్రభుత్వం తప్పు కాదా? విజయవాడలో మొన్న జరిగిన సాయికృష్ణ కేసు తీసుకున్నా, పోలీసుల వేధింపులకు గురై క్రాంతికుమార్ అనే అబ్బాయి వీడియో చేసి మరణవాంగ్మూలం ఇచ్చి ఆత్మహత్య చేసుకున్న ఘటన అయినా, కర్నూలు జిల్లాలో లాకప్ డెత్‌కు గురైన దళిత మహిళ గంగమ్మ కేసు, తెనాలిలో తిరుపతమ్మ కేసు, శ్రీకాకుళం సంతకవిటికి చెందిన కళావతి కేసు రాష్ట్రంలో నెలకొన్న భయానక వాతావరణానికి అద్దంపడతాయి. కస్టడీలోకి తీసుకొని ఒక మనిíÙని దారుణంగా కొట్టి చంపి, కుట్రపూరితంగా సీసీ ఫుటేజ్ లేకుండా చేసి, చివరికి శవం కూడా మాయం చేసి ఆ శవం ఎక్కడ ఉందో ఏం చేశారో ఏమైందో కనీసం కుటుంబ సభ్యులకు కూడా బూడిద కూడా ఇవ్వని అత్యంత అమానవీయ పాశవిక ఘటన జరిగింది. ఇది రాజధానిలో.. చంద్రబాబు ఇంటికి ఆమడదూరంలో జరిగింది. రాష్ట్ర ప్రజలందరూ నివ్వెరపోయిన ఘటన ఇది. ఒక్కొక్కటిగా ఇలాంటి ఘటనలు బయటకొస్తున్నా చంద్రబాబును ఎవరూ నిలదీయకూడదట. వీటి కోసం ప్రశ్నిస్తే, నిలదీస్తే సమాధానం చెప్పాల్సింది పోయి, క్రిమినల్స్‌కు మద్దతు ఇస్తారా అంటూ ఎదురు దాడి చేయడమే కాకుండా.. తమకు తానా తందానా అనే ఎల్లో మీడియాలో ఇదే మాదిరిగా రాతలురాయిస్తూ వ్యక్తిత్వ హననం చేస్తున్నారు. అధికారులను కాపాడుతున్న చంద్రబాబు ఇంట్రస్ట్ ఏమిటి? సాయికృష్ణను మార్కాపురం నుంచి తీసుకొచ్చింది టాస్క్‌ఫోర్స్ పోలీసులు. కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు అప్పగించిన తర్వాత ఎక్నాలెడ్జ్మెంట్ తీసుకున్నారు. రిమాండ్ రిపోర్టులో స్పష్టంగా రాశారు. మరి ఈ టాస్క్ ఫోర్స్ పోలీసులు పనిచేసేది పోలీస్ కమిషనర్ కింద కాదా? ఈ ఘటన మే 6వతేదీన జరిగింది. తన కొడుకును పోలీసులు తీసుకొచ్చారని, ఇప్పటి వరకు ఏ కోర్టులోనూ ప్రవేశపెట్టలేదని, లాకప్ డెత్ చేశారన్న అనుమానాలు ఉన్నాయని, అత్యవసరంగా ఈ కేసులో జోక్యం చేసుకోవాలని సాయికృష్ణ తల్లి మే 28న రాత్రి 7.26 గంటలకు ఇదే విజయవాడ సీపీకీ అర్జీ పెట్టుకుంది. కానీ సీపీ పట్టించుకోలేదు. ఆ తర్వాత సాయికృష్ణ బంధువులు డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఆయన కూడా పట్టించుకోలేదు. రాష్ట్రంలో వ్యవస్థలు కుప్పకూలిపోయాయని చెప్పడానికి ఇవన్నీ నిదర్శనాలు కావా? సీఐని సీపీ కాపాడతాడు. సీపీని డీజీపీ కాపాడతాడు. డీజీపీని చంద్రబాబు కాపాడతాడు. ఇవన్నీ రాష్ట్రంలో మన కళ్లెదుట కన్పిస్తున్న సాక్ష్యాలు. కుప్పకూలిన, దిగజారిన పోలీస్ వ్యవస్థకు అద్దంపడుతున్నాయి. క్రాంతికుమార్ మరణ వాంగ్మూలానికి విలువ లేదా?మరో ఘటనలో దళిత యువకుడు క్రాంతి కుమార్ మరణవాంగ్మూలం ఇస్తూ ఆత్మహత్య చేసుకున్న ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన చావుకు కారణం ఇదే కృష్ణ లంక పోలీస్ స్టేషన్, ఇదే సీఐ కారణమని చెబుతూ మరణవాంగ్మూలం ఇచ్చిన ఘటన కూడా ఇదే సీపీ పరిధిలో జరిగినా సీపీ, డీజీపీలు ఏం చేస్తున్నారు? క్రాంతికుమార్ మరణ వాంగ్మూలానికి విలువ లేదా? తనకొడుకు సాయి కృష్ణ కోసం ఆ తల్లి వేదన పడుతూ రోజూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ అర్జీలు పెట్టుకుంటే విలువ లేదా? ఒక దళిత యువకుడు ఆత్మహత్య చేసుకుంటూ ఇచ్చిన మరణవాంగ్మూలానికి విలువ లేదా? జగన్ వెళ్తే కానీ అరెస్ట్‌లు మొదలు కాలేదు. ఆ అరెస్ట్‌ల్లో కూడా చిన్న చిన్నోళ్లను పరిమితం చేశారు. నేరాన్ని కప్పిపెట్టి నిందితుల్ని ప్రోత్సహించిన సీపీని, డీజీపీని, చంద్రబాబును ఎందుకు బాధ్యులు చేయడం లేదని అడుగుతున్నా? ఇంతగా బరితెగించి సీఐ నుంచి డీజీపీ వరకు అధికారులను కాపాడుతున్న చంద్రబాబు ఇంట్రస్ట్ ఏమిటి? ఏ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ కేసును కవరప్ చేస్తున్నారని అడుగుతున్నా ? అసలు ఈ ఘటన ఇంత పెద్దది కాకపోయినా, జగన్ వెళ్లకపోయినా ఈ ఇన్సిడెంట్ బయటకు వచ్చేది కాదు.. పూర్తిగా కవరప్ చేసేవారు. ప్రశ్నిస్తే ఎన్టీఆర్‌ను కూడా రౌడీషీటర్ అనే వారు.. నిజంగా విలన్లను ఎక్కడో సినిమాల్లో చూస్తుంటాం. కానీ చంద్రబాబు రూపంలో ఇక్కడే మన కళ్లెదుటే మనకు విలన్లు కన్పిస్తున్నారు. ఇవన్నీ దారుణాలు కావా? దాడులకు గురైన మా మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, నాయకులు రౌడీషీటర్లట..రౌడీలను పెట్టుకుంది నువ్వు. దాడి చేసింది, కొట్టించింది, కారు అద్దాలు పగలు కొట్టింది నువ్వు. తిరిగి మా వాళ్లను రౌడీలంటావా? నిజంగా ఎన్టీఆర్ బతికి ఉండి ఉంటే.. చంద్రబాబును ప్రశ్నించేంత సమయం ఆయనకు ఉండి ఉంటే.. ఆయన్ని కూడా రౌడీషీటర్ అనే వారు. ఎన్టీఆర్ అయినా, లక్ష్మీపార్వతి అయినా అంతే. చంద్రబాబును ప్రశ్నిస్తే రౌడీషీటర్ అంటారు. చంద్రబాబు పాలనలో ఎవరికైనా ఎక్కడైనా రక్షణ ఉంటుందా? అని అడుగుతా ఉన్నా. వీడియోలలో.. రాళ్లు విసురుతున్న టీడీపీ గూండా రాయపూడి కిరణ్.. ధ్వంసమైన కారు.. రాయి పట్టుకుని ఉన్న టీడీపీ నేతలు పెంచలయ్య, మట్టిమాఫియా నేత నాగరాజు.. టీడీపీ గూండాలను దాడికి పురికొల్పుతున్న లోకేశ్ అనుచరుడు ముమ్మిడి సత్యనారాయణ.. కనిపిస్తున్నారు.. పోలీసుల సమక్షంలోనే రాళ్లు పట్టుకొని దాడులు చేస్తున్నారు. కారు పగలగొడుతున్నారు. చివరికి ఒక పోలీస్ కానిస్టేబుల్‌కు దెబ్బలు తగిలాయి. మా వాళ్ల మీద ఎందుకు తప్పుడు కేసులు పెడుతున్నారు. అదేమైనా పాకిస్థాన్ బోర్డరా? కొంతమంది పోలీసులు పొలిటికల్ ఏజెంట్లుగా పనిచేస్తున్నారనడానికి ఇదొక నిదర్శనం. ఇప్పటి వరకు మా వాళ్లు పెట్టిన ఫిర్యాదులపై కేసులు పెట్టలేదు. ఏ తెలుగుదేశం వాళ్లను అరెస్ట్ చేయలేదు.. నిజంగా రైతులు ఏం తప్పు చేశారని అడుగుతున్నా. అమరావతి పేరుతో ఇప్పటికే వేలాది ఎకరాలు తీసుకున్నారు. ఇంకా భూములు ఎందుకయ్యా అని ఆ రైతులు అడుగుతున్నారు. కేవలం చంద్రబాబు తమ బినామీలకు, నాయకులకు ఆ భూములు పంచడానికి మమ్మల్ని నాశనం చేస్తారా? అని రాజధాని ప్రాంత రైతులు ప్రశ్నిస్తున్నారు. నీ స్వార్థం కోసం భూములు తీసుకొని మమ్మల్ని మా గ్రామాల నుంచి వెళ్లగొడతారా? అని రైతులు నిలదీస్తున్నారు. చంద్రబాబు, ఆయన పార్టనర్ అధికారిక ప్రకటన చేయగలరా?అమానవీయంగా ఒక వ్యక్తిని పోలీస్ కస్టడీలో తీసుకోవడం, కొట్టడం, చంపడం, కుట్ర పూరితంగా సీసీ ఫుటేజ్, శవం మాయం చేయడం, చివరకు ఆ తల్లికి బూడిద కూడా ఇవ్వని అమానవీయ ఘటనపై ఎల్లోమీడియాలో అక్షరం ముక్క రాయరు. పైగా తానా తందానా అంటూ చంద్రబాబుకు భజన చేస్తారు. రౌడీ షీటర్‌కు సపోర్ట్ చేస్తారా అంటూ ఎదురుదాడి చేస్తారు. ఈ టాపిక్‌ను డైవర్ట్ చేయడానికి చంద్రబాబు పార్టనర్ కూడా ఒక సైడ్ క్యారెక్టర్ మాదిరిగా తెరపైకి వచ్చి అందరూ కలిసికట్టుగా పొలిటికల్ డ్రామాలు చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో చట్టం, న్యాయం లేదని, కోర్టులతో తమకు పనిలేదని, తమకు ఏది అనిపిస్తే అది చేస్తామని, తమ చేతుల్లో ఉన్న కొంతమంది పోలీసులతో తామే శిక్షలు వేస్తామని దొంగ కేసులు పెడతామని, చంపుతామని, శవాలు మాయం చేస్తామని, బూడిద కూడా ఇవ్వమని అధికారిక ప్రకటన చేయగలరా? అని చంద్రబాబును, ఆయన పార్టనర్‌ని సూటిగా ప్రశ్నిస్తున్నా. కవరప్‌లో భాగంగా సాయికృష్ణ మొదట రౌడీషీటర్ అన్నారు. రౌడీషీటర్‌ను వెనకేసుకొస్తారా అని ఎదురు దాడి చేశారు. జనం ఎప్పుడైతే ఛీ కొట్టడం మొదలు పెట్టారో వెంటనే యూ టర్న్ తీసుకొని ఇదే చంద్రబాబు సాయికృష్ణ కుటుంబ సభ్యులను సెక్రటేరియట్‌కు పిలిపించుకుని పక్కన కూర్చో పెట్టుకొని చేయి పట్టుకుని న్యాయం చేస్తానంటూ మొసలి కన్నీరు కారుస్తున్నాడు.. ఏకంగా 46 రోజుల పాటు బయటకు రాకుండా తొక్కిపెట్టిన ఈ ఘటనతో యావత్ దేశమంతా దిగ్భ్రాంతికి గురైంది.నేను వెళ్లాకే అరెస్టులునేను వెళ్లిన నాలుగు రోజుల తర్వాత అరెస్ట్‌లు ప్రారంభించారు. 46 రోజుల పాటు ఈ కేసును ఎందుకు తొక్కిపెట్టారు, అసలు ఏం జరిగింది? దీనికి వెనుక ఉన్న పెద్దల మీద చట్టప్రకారం ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాల్సిన బాధ్యత ఈ ముఖ్యమంత్రిపైన లేదా అని అడుగుతున్నా. ఇంత జరిగినా కూడా ఇప్పటికీ చంద్రబాబులో కానీ, ఈ ప్రభుత్వంలో కానీ చిత్తశుద్ధి లేదు. ఎక్కడా ఏ కోశానా పశ్చాత్తాపం కన్పించలేదు. సాయికృష్ణ రిమాండ్ రిపోర్టు చూస్తే.. సాగుతున్న దర్యాప్తును ఒక్కసారి గమనిస్తే కేసును నిర్వీర్యం చేసేందుకు, పైవాళ్లను కాపాడేందుకు ఏ విధంగా ప్రయత్నిస్తున్నారో ఆధారాలతో సహా చాలా స్పష్టంగా కన్పిస్తుంది.18 నెలలుగా సీసీ ఫుటేజ్ లేదంటున్నారు.. ఇంకెన్ని హత్యలు జరిగాయోమోసపూరిత కుట్ర ఎంత లోతుగా ఉందో మరో ఉదాహరణ... కృష్ణలంక పోలీస్ స్టేషన్లో వీళ్లు ఫైల్ చేసిన మొదటి రిమాండ్ రిపోర్టులో మే 1వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు వీడియో ఫుటేజ్ లేదని రాశారు. ఇద్దరు కానిస్టేబుళ్లను అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ల రిమాండ్ రిపోర్టులో 18 నెలలుగా సీసీ కెమెరాల ఫుటేజ్ తొలగించినట్టు రాస్తారు. అంటే ఈ 18 నెలల్లో ఎన్ని మర్డర్లు జరిగాయో? రాష్ట్ర రాజధాని ప్రాంతంలో పైగా సీపీ, డీజీపీ, చంద్రబాబు, హోంమంత్రి కార్యాలయాలన్నీ ఇక్కడే ఉన్నా... సీసీ ఫుటేజ్ మాయమవడం ఎలా సాధ్యమని అడుగుతున్నా.. ఎవరికి నచ్చినట్టు వాళ్లు డిలీట్ చేసుకుంటూ పోవడానికి ఎలా కుదురుతుంది. ఇక సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిమెంట్లు ఎందుకు? ఇక్కడ డిలీట్ చేస్తే.. కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఫుటేజ్ ఉండదా? అక్కడ ఏమైనట్టు? ఒకచోట డిలీట్ చేస్తే మరొక చోటైనా ఉంటుంది కదా? సీపీ, డీజీపీ కార్యాలయాల్లో ఉన్న ఫుటేజ్ ఏమైంది? పోలీస్ వ్యవస్థను ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నారో చెప్పడానికి ఇది ఇంకొక నిదర్శనం. స్టేషన్లో ఫుటేజ్‌లో లేదంటున్నారు. విజయవాడలోని బస్టాండ్, రైల్వే స్టేషన్, రోడ్ జంక్షన్లు, పబ్లిక్ ప్లేస్‌లలో సీసీ కెమెరాల్లోని ఫుటేజ్ ఏమైంది. ఆ ఫుటేజ్ ఆధారంగా సాయికృష్ణ శవాన్ని ఎక్కడకు తీసుకెళ్లారో? ఏం చేశారో కనుక్కోవచ్చు కదా.. కానీ సిట్ ఆ దిశగా ఎందుకు పనిచేయడం లేదని అడుగుతున్నాం. మ్యాట్రిక్ సిస్టమ్, క్లౌడ్ సర్వర్లలో 90 రోజుల వరకు ఫుటేజ్ అందుబాటులో ఉంటుందని తెలిసినా దాన్ని సిట్ ఎందుకు స్వాదీనం చేసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నా. సీఐతో పాటు సంబంధిత పోలీస్ బాసుల ఫోన్లు, మెసేజ్‌లు, కాల్ రికార్డులు, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ల పరిశీలించే కార్యక్రమం ఎందుకు చేయడంలేదు? ఆశ్చర్యమేమిటో తెలుసా ఆర్థిక ఇబ్బందుల వలన కానిస్టేబుళ్ల ఫోన్లు నాగపూర్‌లో అమ్మేశారని చెబుతున్నారు. మనిషిని చంపేశారు. శవాన్ని కన్పించకుండా చేశారు. వీడియో ఫుటేజ్ మాయం చేశారు. ఫోన్లు నాగపూర్‌లో అమ్మేశారు. రాజధాని ప్రాంతంలోనే సామాన్యుల పరిస్థితి ఇలా ఉంటే. మారుమూల ప్రాంతాల్లో ఉండే సామాన్యుల పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకంగా ఉంది. మానవ హక్కులకు విలువ లేదా? యథేచ్ఛగా మానవ హక్కుల ఉల్లంఘనలు..చంద్రబాబు పాలనలో వ్యవస్థలు, వాటికి బాధ్యత వహిస్తున్న వాళ్లు ఈ విధంగా కుమ్మక్కవడం కొత్తేమీ కాదు. ఈ రెండేళ్లలో శతకోటి ఉదాహరణలు ఇవ్వొచ్చు. సీసీ ఫుటేజ్ మాయంతో సహా ఆధారాలు నాశనంచేయడం, తమ తప్పులను కప్పిపుచ్చుకోవడం, తప్పుడు సాక్ష్యాలు క్రియేట్ చేయడం, న్యాయ స్థానాలను పక్కదోవపట్టించడం, చివరకు కొన్ని కేసుల్లో పోలీసులే స్వయంగా డబ్బులు తీసుకెళ్లి వాళ్ల ఇళ్లల్లో పెట్టి మరీ కేసులు పెడుతున్నారు. ఈ స్థాయిలో వ్యవస్థలన్నీ దిగజారిపోయాయి. రెండేళ్లుగా రెడ్ బుక్ పాలనలో రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘనలు ఎన్నో చూశాం. ఒకర్ని పిన్ పాయింట్‌గా గుర్తించడం, వాళ్లను బలవంతంగా కేసుల్లో ఇరికించే కార్యక్రమం జరుగుతుంది. ఎక్కడా నైతికత, విలువలు లేకుండా పోయాయి. అమాయకుల జీవితాలను నాశనం చేస్తున్నామన్న పశ్చాత్తాపం కూడా కన్పించడం లేదు. ఏ స్థాయికి దిగజారిపోయినా పర్వాలేదు. చంద్రబాబు ముఖంలో సంతోషం చూడాలి. అదొక్కటే లక్ష్యంగా పనిచేస్తున్నారు. నిజంగా ఇవన్నీ చూసినప్పుడే జంగిల్ రాజ్ అనక ఇంకేమనాలి. జంగిల్ రాజ్ అంటే బిహార్‌లో ఉంటుందని అంటారు. కానీ ఆంధ్రాలో కూడా జంగిల్ రాజ్ నడుస్తోంది. చంద్రబాబు జంగిల్ రాజ్ పాలనలో బాధితులే నిందితులు అవుతారని చెప్పడానికి ఇంకొక ఉదాహరణ. రాజధాని ప్రాంతమైన ఉండవల్లిలో రైతుల కోరిక మేరకు వైఎస్సార్ సీపీకి చెందిన నాయకుల బృందం ఆ గ్రామాలకు వెళ్తే ఏం జరిగిందో మనమంతా చూశాం. అమరావతి పేరిట చంద్రబాబు చేస్తున్న అవినీతి, దోపిడీ, దౌర్జన్యాలను, రాజధాని ప్రాంత రైతులు పడుతున్న బాధలను బయట ప్రపంచానికి తెలియనీయకుండా చేయడానికి ఒక ప్లాన్ ప్రకారం చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు.దాడికి గురైన బాధితులపైనే కేసులు పెట్టి వేధిస్తున్నారు..రాజధాని ప్రాంతానికి వెళ్లిన మా పార్టీ నాయకులపై దాడి చేయడమే కాకుండా బాధితులైన మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, మా పార్టీ నేతలనే నిందితులుగా చూపిస్తూ కేసులు పెడుతున్న ఘటనలు కళ్లెదుటే కన్పిస్తున్నాయి. న్యాయం, ధర్మం అనేది పూర్తిగా భూస్థాపితం చేశారనడానికి ఇంతకంటే ఉదాహరణ మరొకటి అవసరం లేదు. ఇదే మీటింగ్ హాలులో ఇటీవలే రాజధాని గ్రామాలకు చెందిన రైతులు నన్ను కలిశారు. తమ గోడు చెప్పుకున్నారు. వాళ్ల కోరిక మేరకు ఒక కమిటీని, లీగల్ టీమ్‌ను ఏర్పాటు చేశాం. క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతుందో మీకు చూపుతాం.. మీరు రండి అని రైతులు అడిగితేనే మా పార్టీ బృందం అక్కడకు వెళ్లింది. ఆ బృందంలోని మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులపై దాడులు చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. కార్ల అద్దాలు పగలకొట్టారు. రాళ్లు విసిరారు. రాళ్ల దాడిలో కానిస్టేబుల్ తీవ్రగాయాలతో ఆస్పత్రి పాలయ్యాడు. మళ్లీ తిరిగి మా వాళ్లే దాడులు చేసినట్టుగా బాధితులపైనే ఎదురు కేసులు పెట్టారు. అమరావతి పేరుతో చంద్రబాబు చేస్తున్న దారుణాలకు బలైపోతున్న రైతులకు తోడుగా నిలవడం తప్పా అని సూటిగా ప్రశ్నిస్తున్నా. భూములివ్వని వారిని భూ సేకరణ నోటీసుల పేరిట వేధించడం, వారి పొలాలకు వెళ్లే మార్గాలను ధ్వంసం చేయడం, ఈ రైతుల పొలాల్లో అక్రమంగా మట్టి తవ్వి దోపిడీ చేయడం, ఇంకా దారుణంగా కొండవీటి వాగును వీరి భూముల్లోకి మళ్లించి వాళ్ల భూములు చుట్టూ నీళ్లు నింపేసి చివరికి గత్యంతరం లేని పరిస్థితుల్లో వాళ్లు భూములు వదిలేసుకునే పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వమే క్రియేట్ చేస్తోంది.అమరావతిలో ప్రతీ పనిలోనూ దోపిడీయే..అమరావతిలో జరిగే ప్రతీ పనిలోనూ కన్పించేది అవినీతి, దోపిడీయే... కేంద్రప్రభుత్వం అమరావతిలో కడుతున్న ప్రభుత్వ భవనాలు, ఉద్యోగుల క్వార్టర్స్ నిర్మాణానికి చదరపు అడుగుకు రూ.4,645 అవుతుంది. మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ ఎఫైర్స్, కేంద్ర కేబినెట్లో ఈ మేరకు అప్రూవల్ ఇచ్చింది. అదే అమరావతిలో చంద్రబాబు కొత్త సెక్రటేరియట్ నిర్మాణం కోసం ఆయన చేస్తున్న ఖర్చు చదరపు అడుగుకు అక్షరాలా రూ.20,439. పైగా దేశంలో ఎక్కడా లేని విధంగా ఏకంగా 52 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ సెక్రటేరియట్ నిర్మిస్తున్నారు. పక్కన తెలంగాణ సెక్రటేరియట్ 10 లక్షల ఎస్ఎఫ్టీలకు మించి లేదు. ఇది దోపిడీ కాదా ? అని అడుగుతున్నా. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు ఏ నగరం తీసుకున్నా 5స్టార్ సదుపాయాలతో ఇటాలియన్ మార్బుల్స్‌తో నిర్మించినా చదరపు అడుగుకు రూ.4,500 దాటదు. చివరికి జాతీయ రహదారి నిర్మాణం కిలోమీటర్‌కు రూ.24 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు స్వయంగా ఓ ప్రశ్నకు సమాధానంగా పార్లమెంటులో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. కానీ అమరావతిలో ఎంతో తెలుసా ? కిలోమీటర్‌కు సగటున రూ.53 కోట్లు ఖర్చు చేస్తున్నారు. అంటే డబుల్ కంటే ఎక్కువ. ఇవన్నీ బయటకు రాకూడదని, రైతులు పడుతున్న ఇబ్బందులు, వారికి చేస్తున్న అన్యాయం, మోసం, అమరావతి పేరిట చేస్తున్న దోపిడీ బయటకు రాకూడదనే ఈ దాడులకు పాల్పడుతున్నారు. -
సాయికృష్ణ కేసు.. అంబటి లేఖతో దర్యాప్తుపై కలకలం
సాక్షి, తాడేపల్లి: గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కొత్త మలుపు చోటు చేసుకుంది. సిట్ చీఫ్, ఐజీ ఎం. రవిప్రకాష్‌కు వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు రాసిన లేఖ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. సాయికృష్ణ కేసు దర్యాప్తులో లోపాలు, అనేక అనుమానాస్పద అంశాలను ప్రస్తావించిన అంబటి.. రిమాండ్ రిపోర్టులో కీలక వివరాలు స్పష్టంగా లేవని అభ్యంతరం వ్యక్తం చేశారు. హత్య ఎలా జరిగింది? మొదలు.. ప్రతీ కీలక ప్రశ్నకూ సరైన సమాధానం లేకపోవడం అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారాయన.టాస్క్‌ఫోర్స్, కృష్ణలంక పోలీస్‌స్టేషన్, పైస్థాయి అధికారుల పాత్ర ఉన్నప్పటికీ క్రిమినల్ లయబిలిటీని(బాధ్యత) కేవలం ఒక సీఐకే పరిమితం చేయడం సరికాదని అంబటి తన లేఖలో విమర్శించారు. సాయికృష్ణను హ్యాండోవర్ చేసిన సమయంలో రాతపూర్వక అకాలెడ్జ్మెంట్ ఉన్నప్పటికీ కస్టడీ విషయాన్ని సీఐ మాత్రమే దాచాడని చెప్పడం నమ్మశక్యం కాదని ఆయన ప్రశ్నించారు.కేసులో అత్యంత కీలకమైన సీసీటీవీ ఫుటేజీ విషయంలో సిట్ నిర్లక్ష్యం చూపిందని లేఖలో ఆరోపించారు. డీజీపీ ఆధీనంలోని టెక్నికల్ వింగ్‌లో ఉన్న ఫుటేజీని వెంటనే సీజ్ చేయకపోవడం, ఓవర్‌రైట్ లేదంటే డిలీట్ అయ్యే అవకాశం ఉన్నప్పటికీ చర్యలు తీసుకోకపోవడం తీవ్రమైన లోపమని ఆయన పేర్కొన్నారు. కృష్ణలంక పోలీస్‌స్టేషన్ సీసీటీవీ ఫుటేజీ ధ్వంసం కావడంపై కూడా స్పష్టత అవసరమని అన్నారు.అంతేకాకుండా పోలీస్ అధికారుల ఫోన్లు, మెసేజ్‌లు, కాల్ రికార్డులు, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్‌ను పరిశీలిస్తే పెద్ద కుట్ర వెలుగులోకి వచ్చేదని.. కానీ సిట్ ఆ దిశగా వెళ్లలేదని అంబటి ఆరోపించారు. భారత న్యాయసంహిత(BNS) సెక్షన్లు 61, 3(5) కింద క్రిమినల్ కాన్స్పిరసీ, కామన్ ఇంటెన్షన్ అంశాలు ఎందుకు నమోదు చేయలేదని ఆయన ప్రశ్నించారు.విజయవాడ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, మ్యాట్రిక్స్ సర్వైలెన్స్ సిస్టమ్, 90 రోజుల క్లౌడ్ బ్యాకప్ వంటి ఆధునిక నిఘా వ్యవస్థల ఫుటేజీని సిట్ పరిశీలించకపోవడాన్ని కూడా ఆయన తప్పుబట్టారు. వాహనాల కదలికలు, మృతదేహం తరలింపు వంటి కీలక అంశాలు ఈ ఫుటేజీల్లో ఉండే అవకాశం ఉన్నా వాటిని స్వాధీనం చేసుకోలేదని లేఖలో పేర్కొన్నారు.మే 28న బాధిత తల్లి ఇచ్చిన క్రైమ్ పిటిషన్‌పై ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ నమోదు కాకపోవడాన్ని కూడా అంబటి ప్రశ్నిస్తూ విచారణపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ లేఖతో సాయికృష్ణ కేసు మరోసారి రాజకీయ, పరిపాలనా వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. -
తెర వెనుక మల్లగుల్లాలు
సాక్షి ప్రతినిధి, విజయవాడ: కాపు యువకుడు గాదె సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో సిట్ విచారణ తూతూ మంత్రంగా సాగుతోంది. అసలు సూత్రధారులు, పాత్రధారులను రక్షించే విధంగా దర్యాప్తు పక్కదారి పట్టిందనే ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు సాయికృష్ణ మిస్సింగ్‌కు సంబంధించి కీలకమైన ‘హెబియస్ కార్పస్’ పిటిషన్ సోమవారం హైకోర్టులో విచారణకు రానుంది. ఈ తరుణంలో ప్రభుత్వ పెద్దలు తెరవెనుక పొలిటికల్ డ్రామాకు తెర తీశారు. బాధిత కుటుంబ సభ్యుల ద్వారా కేసు ఉపసంహరణకు ఓ పచ్చనేత తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశిస్తే ఈ కేసులో సూత్రధారులు వెలుగులోకి రావడం ఖాయమనే ఆందోళనతో తెర వెనుక కుట్రలకు పదును పెట్టారు. -
సాయికృష్ణ లాకప్‌డెత్‌పై తల్లి న్యాయ పోరాటం
సాక్షి, అమరావతి: కాపు యువకుడు గాదె సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో అతడి తల్లి విజయలక్ష్మి తన న్యాయ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. అదృశ్యమైన తన కుమారుడి ఆచూకీ తెలుసుకుని కోర్టు ముందు హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలని ఇప్పటికే హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసి న్యాయ పోరాటం చేస్తున్న విజయలక్ష్మి తాజాగా మరోసారి హైకోర్టు తలుపుతట్టారు. తన కుమారుడి లాకప్‌డెత్ కేసు దర్యాప్తు బాధ్యతలను స్థానిక పోలీసుల నుంచి తప్పించి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) లేదా న్యాయస్థానం సరైనదని భావించే మరేదైనా ఇతర సమర్థవంతమైన స్వతంత్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలని అభ్యరి్థస్తూ ఆమె హైకోర్టులో ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. ఈ స్వతంత్ర దర్యాప్తు కేవలం ఆ సంస్థ పరిధిలోనే కాకుండా పూర్తి స్థాయిలో కోర్టు ప్రత్యక్ష పర్యవేక్షణలో జరిగేలా చూడాలని ఆమె హైకోర్టుకు విన్నవించారు. సాయికృష్ణ ఏ పరిస్థితులలో మాయమయ్యాడు? దీని వెనుక ఎవరెవరి ప్రమేయం ఉందనే కోణంలో ఎటువంటి పక్షపాతం లేకుండా, పారదర్శకంగా స్వతంత్ర విచారణ జరిపించాలని కోరారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తులు జస్టిస్ రవినాథ్ తిల్హరీ, జస్టిస్ సుభేందు శమంతో ధర్మాసనం సోమవారం విచారణ జరపనుంది. 40 రోజుల పాటు కమిషనర్ మౌనంగా ఉన్నారంటే అర్థమేంటి..? ‘కృష్ణలంక పోలీస్ స్టేషన్ సిబ్బంది, టాస్‌్కఫోర్స్ అధికారులు సాయికృష్ణ అదృశ్యం, సాక్ష్యాల నాశనంలో స్వయంగా భాగస్వాములుగా ఉన్నారని సిట్ తన రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. నిందితులుగా ఉన్న అదే పోలీస్ శాఖే ఈ కేసును విచారిస్తే న్యాయం జరగదు. ఉన్నతాధికారులను కాపాడటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మాకు న్యాయం జరగాలంటే ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించడమే ఏకైక మార్గం. తన అధికార పరిధిలో ఒక వ్యక్తి అదృశ్యం కావడం, పోలీస్ కస్టడీలో మరణం లాంటి తీవ్రమైన ఘటన జరిగితే కనీసం 7 రోజుల్లోగా ఆ ప్రాంత పోలీసు అధిపతి అయిన కమిషనర్‌కు పూర్తి సమాచారం తెలిసిపోతుంది. కానీ ఈ కేసులో సదరు కమిషనర్ 40 రోజుల పాటు పూర్తిగా మౌనం వహించారు. ఇంత సుదీర్ఘకాలం కమిషనర్ స్పందించకపోవడం దేనిని సూచిస్తోందంటే.. ఈ నేరంలో లేదా ఈ విషయాన్ని తొక్కిపెట్టడంలో కేవలం కింది స్థాయి సిబ్బందే కాకుండా ఉన్నత స్థాయి అధికారుల హస్తం కూడా ఉందనే బలమైన అనుమానాలకు తావిస్తోంది. ఈ కుట్రలో పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్ద అధికారుల ప్రమేయం ఉన్నప్పుడు న్యాయం జరుగుతుందని ఆశించడంలో అర్థమే లేదు. ఈ అసాధారణ పరిస్థితుల దృష్ట్యా స్థానిక పోలీసుల దర్యాప్తును నమ్మడానికి వీల్లేదు కాబట్టి, హైకోర్టు వెంటనే జోక్యం చేసుకుని ఈ కేసును సీబీఐకి అప్పగించాలి’ అని సాయికృష్ణ తల్లి హైకోర్టును అభ్యర్థించారు. హైకోర్టుకు ఏదో ఒకటి చెప్పి కేసును మూసేయించాలని చూస్తున్నారు.. ‘ప్రస్తుత దర్యాప్తు కేవలం ఒక్క పోలీస్ అధికారి (నాగరాజు) చుట్టూనే తిరుగుతోంది. కానీ అసలు నిజం ఏమిటంటే కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు చెందిన సిబ్బంది మొత్తం సాయికృష్ణ అదృశ్యం ఘటనలో భాగస్వాములయ్యారు. సాయికృష్ణ ప్రాణాలు తీసి అతడి శరీరాన్ని ఎప్పటికీ దొరకకుండా మాయం చేయాలనే క్రూరమైన ఉద్దేశంతో వీరంతా కలిసి పనిచేశారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ ఈ కుట్రను పూర్తిగా ఛేదించడం లేదు. నేరంలో భాగమైన కృష్ణలంక స్టేషన్ సిబ్బంది అందరినీ వదిలేసి, కేవలం ఆ ఒక్క నిందితుడి నుంచి మాత్రమే సమాచారాన్ని రాబట్టడానికి ప్రయత్నిస్తోంది. ఇది కేవలం కంటితుడుపు చర్య మాత్రమే. తాము దర్యాప్తు చేస్తున్నట్లు హైకోర్టుకు ఏదో ఒక నివేదిక సమర్పించి తద్వారా ఈ హెబియస్ కార్పస్ పిటిషన్‌ను మూసివేయించాలని చూస్తున్నారు. ఒకసారి కోర్టులో ఈ పిటిషన్ మూసివేస్తే ఈ కేసు భవిష్యత్తులో ఎప్పటికీ వెలుగులోకి రాకుండా పూర్తిగా అణచివేయవచ్చని, దోషులను శాశ్వతంగా తప్పించవచ్చని పోలీసులు భావిస్తున్నారు’ అని ఆమె తన పిటిషన్లో ఆరోపించారు. ఫిర్యాదు చేసిన 45 రోజుల తరువాత కేసు నమోదు చేశారు... ‘సాయికృష్ణ అదృశ్యంపై నేను మే 28నే విజయవాడ పోలీస్ కమిషనర్‌కు అధికారికంగా ఫిర్యాదు చేశా. ఒక పౌరుడి ప్రాణానికి సంబంధించిన ఇంతటి తీవ్రమైన విషయంపై, అది కూడా హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ విచారణ పెండింగ్‌లో ఉన్నప్పటికీ, పోలీసులు జూన్ 19 వరకు కేసు నమోదు చేయకపోవడం వెనుక వారి ఉద్దేశాలు స్పష్టమవుతున్నాయి. కేసు నమోదు చేయడానికి దాదాపు 45 రోజులకు పైగా సుదీర్ఘ జాప్యం జరిగింది. ఈ 45 రోజుల కాలంలో బాధితుడి తల్లిగా నేను పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగినా కదలని యంత్రాంగం, కేవలం ఈ హెబియస్ కార్పస్ పిటిషన్ ద్వారా ఈ వ్యవహారం హైకోర్టు పరిధిలోకి తీసుకొచ్చిన తర్వాతే దిగివచ్చి కేసు నమోదు చేసింది. ఒక వ్యక్తి అదృశ్యమైన వెంటనే ప్రాథమిక చర్యలు చేపట్టాల్సిన పోలీసులు 45 రోజుల పాటు మౌనంగా ఉండి, కోర్టు జోక్యం తరువాతే దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేశామని చెప్పడం వారి నిబద్ధతను శంకిస్తోంది. సాయికృష్ణ అదృశ్యమైన తొలి రోజుల్లోనే గాలింపు ప్రారంభించకుండా కేసును కోర్టు విచారణ వరకు లాగడం వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏమిటంటే.. ఈలోపు పోలీసులకు వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాధారాలన్నింటినీ పూర్తిగా తుడిచిపెట్టేయడమే’ అని సాయికృష్ణ తల్లి నివేదించారు. హత్యానేరం ఆరోపణలు ఎదుర్కొంటున్న వారే దర్యాప్తు చేయడమా..? ‘సాయికృష్ణ పోలీసు కస్టడీలో దారుణమైన హింసను ఎదుర్కొన్నాడు. ఆ తర్వాతే అతడిని మాయం చేశారు. ఇదంతా స్థానిక పోలీసుల ఆధ్వర్యంలోనే జరిగింది. చట్టంలో ఒక ప్రాథమిక సూత్రం ఉంది. ఎవరూ కూడా తమ సొంత కేసులో తామే న్యాయమూర్తిగా లేదా దర్యాప్తు అధికారిగా ఉండకూడదు. ఎవరిపై అయితే హత్యానేరం లేదా అక్రమ నిర్బంధం ఆరోపణలు ఉన్నాయో, వారికే దర్యాప్తు చేసే అధికారం ఇస్తే వారు తమ తప్పులను తామే ఎలా ఒప్పుకుంటారు? నిందితులుగా ఉన్న పోలీస్ యంత్రాంగాన్నే ఈ కేసును దర్యాప్తు చేయడానికి అనుమతిస్తే, అది ‘నిష్పక్షపాత, పారదర్శక, స్వతంత్ర దర్యాప్తు లక్ష్యాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తుంది’ అని విజయలక్ష్మి తన పిటిషన్లో పేర్కొన్నారు. కంటి తుడుపు సిట్ దర్యాప్తుతో ఉపయోగం లేదు... ‘సాయికృష్ణ ఆచూకీ కనిపెట్టడానికి సిట్‌ను ఏర్పాటు చేశామని పోలీసులు కోర్టు ముందు కేవలం మాటల్లోనే చెబుతున్నారు. కానీ, ఆ మాటలకు తగ్గట్టుగా ఎలాంటి చట్టపరమైన ఆధారాలను, నివేదికలను వారు ఇప్పటివరకు కోర్టుకు సమర్పించలేదు. హైకోర్టు విచారణ ప్రారంభమై ఇన్ని రోజులవుతున్నా, పోలీసులు ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయలేదు. ఒకవేళ వారు నిజంగానే నిజాయితీగా దర్యాప్తు చేస్తుంటే, ఆ నిజాలను అఫిడవిట్ రూపంలో కోర్టుకు తెలపడానికి ఎందుకు వెనుకాడుతున్నారు? సాయికృష్ణ అసలు ఏ పరిస్థితులలో మాయమయ్యాడు? అనే దానికి సంబంధించిన వాస్తవాలను పోలీసులు కోర్టుకు చెప్పకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. అందుకే ఈ కంటితుడుపు సిట్ దర్యాప్తులను పక్కనబెట్టి కేసును తక్షణమే సీబీఐ లాంటి స్వతంత్ర సంస్థకు అప్పగిస్తేనే నిజాలు బయటకు వస్తాయి. కోర్టు ఆ దిశగా తగిన ఆదేశాలు జారీ చేయాలి’ అని విజయలక్ష్మి తన పిటిషన్లో హైకోర్టును అభ్యర్థించారు. ఉన్నతాధికారులు ఎందుకు తక్షణమే స్పందించలేదు..? ‘ఒకవేళ కింది స్థాయి పోలీస్ సిబ్బంది సాయి కృష్ణ అరెస్ట్, అదృశ్యం గురించి తమ పైఅధికారులకు ముందే సమాచారం అందించి ఉంటే... అంతటి తీవ్రమైన విషయంలో ఆ ఉన్నతాధికారులు ఎందుకు తక్షణమే స్పందించలేదు? చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకోలేదు? అంటే.. వారు కూడా ఈ నేరాన్ని లోపల సమరి్థస్తూ, దాచడానికి ప్రయత్నించారు. ఒకవేళ కింది స్థాయి సిబ్బంది ఈ విషయాన్ని తమ పైఅధికారులకు చెప్పకుండా దాచిపెట్టి ఉంటే... అది నిజాలను తీవ్రంగా తొక్కిపెట్టడం, తమ అధికారిక విధులను నిర్వర్తించడంలో ఘోరంగా విఫలం కావడం కిందకే వస్తుంది. ఒక పౌరుడి ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా ఉన్నతాధికారులు, కిందిస్థాయి అధికారులు ఆ విషయాన్ని దాచగలిగారంటే అక్కడ పర్యవేక్షణ ఎంత దారుణంగా ఉందో సులభంగా అర్థం చేసుకోవచ్చు’ అని విజయలక్ష్మి పేర్కొన్నారు.ఉద్దేశపూర్వకంగానే హైకోర్టును తప్పుదోవ పట్టించారు... ‘సాయికృష్ణ అదృశ్యంపై నేను దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు పలుమార్లు విచారణ జరిపింది. సాయికృష్ణ అసలు ఎవరి కస్టడీలో ఉన్నాడు? అతడిని ఎక్కడ నిర్బంధించారు..? ప్రస్తుతం అతడి పరిస్థితి ఏమిటి? అనే విషయాలపై అప్పుడు కూడా కనీస సమాచారాన్ని పోలీసులు హైకోర్టుకు వెల్లడించలేదు. ఆ తర్వాత సిట్ తన రిమాండ్ రిపోర్టులో సాయికృష్ణను మే 6నే కృష్ణలంక పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, స్పష్టమైన ఆధారాలు దొరికాయని పేర్కొంది. దీన్నిబట్టి చూస్తే జూన్ 2 నుండి కోర్టు విచారణల సమయంలో సాయికృష్ణ అక్రమ నిర్భంధం గురించి, అదృశ్యం గురించి పోలీసులు ఉద్దేశపూర్వకంగానే న్యాయస్థానాన్ని సైతం పక్కదారి పట్టించారని స్పష్టమవుతోంది’ అని ఆమె నివేదించారు. ముందస్తు ప్రణాళికతోనే సాక్ష్యాలను నాశనం చేశారు...‘సాయికృష్ణను ఈ ఏడాది మే 6న ప్రకాశం జిల్లా మార్కాపురంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి విజయవాడ కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌కు తరలించి పోలీస్ కస్టడీలోనే ఉంచారు. దీనిని సిట్ రిమాండ్ రిపోర్ట్ ధృవీకరిస్తోంది. చట్ట ప్రకారం ఏ వ్యక్తినైనా అరెస్ట్ చేస్తే 24 గంటల్లోగా స్థానిక మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టాలి. కానీ సాయికృష్ణ్ణను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచకుండా పోలీసులు చట్టాన్ని పూర్తిగా తమ చేతుల్లోకి తీసుకున్నారు. సాయికృష్ణను స్టేషన్‌కు తీసుకువచ్చిన కాలానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలు డిలీట్ చేశారు. ఇది కస్టడీలో అతడిపై జరిగిన హింసను, మరణాన్ని దాచడానికి పోలీసులు అంతా కలిసి సాక్ష్యాలను ముందస్తు ప్రణాళికతో నాశనం చేశారనడానికి బలమైన ఆధారం’ అని విజయలక్ష్మి తన అనుబంధ పిటిషన్లో స్పష్టం చేశారు. -
ఇప్పటికైనా నా బిడ్డ బూడిద ఇవ్వండి!
లబ్బీపేట(విజయవాడ తూర్పు): ‘నా కొడుకును చూపిస్తామన్న పోలీసులు చివరకు చంపేసి శ్మశానంలో కాల్చేశారు. ఇప్పటికైనా నా బిడ్ద బూడిద ఇవ్వండి. కర్మకాండలు చేసుకుంటా’ అని విజయవాడలోని కృష్ణలంకకు చెందిన కాపు యువకుడు గాదె సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. సాయికృష్ణ కేసులో సీఐ నాగరాజును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తన కొడుకుని పోలీస్ కస్టడీలోనే కొట్టి చంపారన్నది నిజమైందని, తాను మొదటి నుంచి అదే చెబుతున్నానని అన్నారు. సీఐ నాగరాజుతో పాటు ఆయనకు సహకరించిన మిగతా వారందరిపైనా చర్యలు తీసుకోవాలని కోరారు. తమ బిడ్డను స్టేషన్లోనే కొట్టి చంపేసి మూటకట్టి శ్మశానానికి తీసుకెళ్లి కాల్చేశారని, కనీసం బూడిద కూడా ఇవ్వలేదని, ఇదేమైనా న్యాయంగా ఉందా అంటూ కన్నీరు పెట్టుకున్నారు. ‘ఈరోజు నేను కుమిలిపోతున్నాను. నా బిడ్డ ఎక్కడ. ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. ఇంత అన్యాయం చేశారు పోలీసులు. నా బిడ్డను అంత చిత్రవధ చేసి చంపిన వాళ్లందరికీ శిక్ష పడాలి. అందరూ కలిసి కొట్టి కొట్టి చంపేశారు. నన్ను స్టేషన్‌కు కూడా రానివ్వకుండా వాడిని ఎక్కడికో తీసుకెళ్లి హతమార్చారు. అలా చేయాల్సిన అవసరం ఏమొచి్చంది. వాడి వయసెంత. మీ పోలీసుల వయసెంత. అంత చిన్న బిడ్డను చిత్రవధ చేశారు. వాళ్లకు తగిన శిక్ష పడాలి. నాకు అదే కావాలి’ అని వాపోయారు. మీడియాను చూపిస్తూ ‘నాకు మీరే న్యాయం చేయాలి’ అని వేడుకున్నారు. -
ప్రభుత్వ హత్యే.. పెద్దలను కాపాడే కుట్రే!
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం బరి తెగించేసింది! రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కాపు యువకుడు గాదె సాయికృష్ణ లాకప్ హత్య కేసును నీరుగార్చేందుకు పక్కా పన్నాగానికి తెగబడింది. ఈ హత్య వెనుక సూత్రధారులు, పాత్రధారులను కాపాడేందుకు కుతంత్రం పన్నింది. ప్రభుత్వ పెద్దలు, పోలీస్ బాస్, బిగ్‌బాస్‌తో సహా అందరినీ ఈ కేసు నుంచి తప్పించింది. అందుకు ఈ కేసు దర్యాప్తునకు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను సాధనంగా చేసుకుంది. సాయికృష్ణ లాకప్ హత్యకు సంబంధించిన కనీస వివరాలు, దర్యాప్తులో పాటించాల్సిన ప్రాథమిక నియమాలను కూడా పట్టించుకోకుండా ‘సిట్’ న్యాయస్థానంలో దాఖలు చేసిన రిమాండ్ నివేదిక ప్రభుత్వ కుట్రను బట్టబయలు చేస్తోంది. అసలు సాయికృష్ణ హత్యకు గురైనట్లు సూటిగా పేర్కొనని సిట్... దర్యాప్తులో కీలకమైన అంశాలను ఉద్దేశపూర్వకంగా విస్మరించి తూతూమంత్రంగా రిమాండ్ రిపోర్టును రూపొందించడం వెనుక ప్రభుత్వ పెద్దల కుతంత్రం ఉందన్నది స్పష్టమవుతోంది. అసలు సాయికృష్ణను ఎప్పుడు హత్య చేశారు..? హత్యాయుధం.. సమయం.. మృతదేహం తరలింపు.. అవశేషాల గుర్తింపు.. ప్రత్యక్ష సాక్షులు, కీలకమైన పోలీసు రిజిస్టర్లు, రికార్డులు... వాటిని పర్యవేక్షించాల్సిన పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్‌బాబు... సాయికృష్ణను అదుపులోకి తీసుకున్న టాస్క్‌ఫోర్స్ బాధ్యులు.. సీసీ టీవీ ఫుటేజీ బ్యాకప్ స్వాధీనం..! ఇలా ఏ అంశాలను కూడా ప్రస్తావించకుండానే, వాటి గురించి పేర్కొనకుండానే రిమాండ్ రిపోర్టును సమర్పించడం విభ్రాంతి కలిగిస్తోంది. ప్రధానంగా సాయికృష్ణను లాకప్‌లోనే హత్య చేయడం వెనుక కుట్ర కోణం ఏమిటన్నది పట్టించుకోకపోవడం గమనార్హం. తద్వారా ఈ కేసులో ఎవరో కీలక ప్రభుత్వ పెద్దలు, పోలీస్ బాస్, బిగ్బాస్లను కాపాడాలన్నదే ప్రభుత్వ పన్నాగమన్నది తేటతెల్లమవుతోంది. సిట్ రిమాండ్ నివేదిక సాక్షిగా బట్టబయలైన చంద్రబాబు ప్రభుత్వ కుట్ర ఇదిగో ఇలా ఉంది....హత్య వివరాలే లేకుండా రిమాండ్ రిపోర్టా?కాపు యువకుడు సాయికృష్ణ లాకప్ మరణం కేసును న్యాయ విచారణలో బలహీనపరిచేందుకు చంద్రబాబు ప్రభుత్వం పక్కా పన్నాగంతో వ్యవహరించింది. అసలు సాయికృష్ణ హత్యకు గురయ్యారని సూటిగా పేర్కొనలేదు. హత్యకు గురై ఉంటారని మొక్కుబడిగా పేర్కొంటూ ఆయన్ని హతుడు (డిసీజ్డ్)అని పేర్కొంది. కానీ ఆయన్ని ఎప్పుడు, ఎక్కడ ఎలా హత్య చేశారు? అనే కనీస వివరాలను రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొనలేదు. అంటే.. నేర ప్రదేశం, సమయం, నేరం చేసిన విధానం గురించి అసలు ప్రస్తావించనేలేదు. టాస్క్‌ఫోర్స్ అధికారులు సాయికృష్ణను కృష్ణలంక పోలీసులకు అప్పగించిన తరువాత.. వివరాలన్నీ అగమ్యగోచరమే. కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చిన సాయికృష్ణ తరువాత ఏమయ్యారన్నది సిట్ అధికారులు తమ నివేదికలో ప్రస్తావించనే లేదు. ఆయన ప్రాణాలతో పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వెళ్లారా...? లేదా ఆయన మృతదేహాన్ని పోలీస్ స్టేషన్ నుంచి బయటకు తరలించారా? అనే కీలక అంశాన్ని పేర్కొనాల్సిన కనీస బాధ్యతను కూడా సిట్ అధికారులు విస్మరించారు. అసలు సాయికృష్ణ లాకప్‌లో హత్యకు గురయ్యారనే విషయాన్నే రిమాండ్ రిపోర్ట్‌లో సూటిగా ఎక్కడా ప్రస్తావించకపోవడం విస్మయపరుస్తోంది. లాకప్‌లో హత్యకు గురైనట్టు భావిస్తున్నామని మాత్రమే పేర్కొంది. హత్య ప్రదేశం, సమయం, హత్యకు ఉపయోగించిన ఆయుధాలు అన్నవి ఈ కేసులో ప్రధానమైనవి. ఆ మూడు కీలక అంశాల గురించి రిమాండ్ రిపోర్ట్‌లో ప్రస్తావించకపోవడం గమనార్హం. సాయికృష్ణ మృతదేహాన్ని చూసిన ప్రత్యక్ష సాక్షులను కూడా సిట్ గుర్తించనే లేదు. తద్వారా సాయికృష్ణను లాకప్‌లో హత్య చేశారని నిరూపించడానికి కీలక ఆధారం లేకుండా ప్రభుత్వం ముందు జాగ్రత్త పడినట్టు స్పష్టమవుతోంది. అంటే సాయికృష్ణ అసలు హత్యకు గురయ్యారా లేదా అనే సందేహానికి బలం చేకూర్చేందుకు ప్రభుత్వం ముందుగానే కుట్రకు బరితెగించింది. అంతగా ఈ కేసును నీరుగార్చాలని ప్రభుత్వ పెద్దలు ఎందుకు భావిస్తున్నట్లు? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ప్రత్యక్ష సాక్షులే లేకుండా చేసే కుతంత్రంఇక ఈ కేసులో ప్రత్యక్ష సాక్షులు ఎవరూ లేకుండా చేయాలన్న ముందస్తు పన్నాగంతో వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. కేవలం బాధితుడి తల్లితోపాటు ఎస్సైను మాత్రమే ప్రత్యక్ష సాక్షిగా పేర్కొనడం విడ్డూరంగా ఉంది. పోలీసులు కొడుతున్న దెబ్బలకు తన కుమారుడు ఆర్తనాదాలు చేయటాన్ని తాను విన్నట్లు సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి చెప్పారని ప్రస్తావించారు. బాధితుడి తల్లి ఫిర్యాదుదారు కాబట్టి ఆమె సాక్ష్యం న్యాయస్థానంలో చెల్లదు. ఆ ఎస్సై కూడా తాను మే 6 – 8వ తేదీల మధ్య సాయికృష్ణను కృష్ణలంక పోలీస్ స్టేషన్లో చూశానని చెప్పినట్టుగా రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. న్యాయ విచారణ సమయంలో ఆయన మాట మార్చే అవకాశాలు ఉన్నాయి. మరి అన్ని రోజులపాటు పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహించిన అంతమంది ఇతర అధికారులు, పోలీసులను ప్రత్యక్ష సాక్షులుగా ఎందుకు పేర్కొన లేదన్నది కీలకంగా మారింది. సాయికృష్ణ మృతదేహం పోలీసు స్టేషన్ నుంచి మాయమైంది. ఆ పని కేవలం ఒక్క మనిషి చేయడం అసాధ్యం! మరి ఇందులో ఎవరెవరు పాల్గొన్నారు? అనేది సిట్ పట్టించుకోలేదు. సరైన సాక్ష్యాలు లేకుండా సిట్ తూతూ మంత్రంగా రిపోర్ట్ రిపోర్ట్ రూపొందించడం ద్వారా ఈ కేసు నుంచి ఎవర్ని కాపాడేందుకు యత్నిస్తోందని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. కీలక రిజిస్టర్లు, రికార్డుల వివరాలే లేకుండా రిమాండ్ రిపోర్టా...!సాయికృష్ణ లాకప్ మరణం కేసును నీరుగార్చేందుకు సిట్ పక్కాగా రంగంలోకి దిగింది. ప్రధాన బాధ్యుడైన పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్బాబుతోపాటు టాస్క్‌ఫోర్స్ అధికారిని ఈ కేసు నుంచి తప్పించాలన్న కుట్ర బయటపడింది. తద్వారా వారిద్దరి వెనుక ఉన్న ప్రభుత్వ పెద్దలను కాపాడాలన్న లక్ష్యంతో వ్యవహరించింది. సాయికృష్ణను టాస్క్‌ఫోర్స్ అధికారులు మార్కాపురంలో అదుపులోకి తీసుకుని సీఐ నాగరాజుకు అప్పగించినట్టు సిట్ పేర్కొంది. కానీ ఆ తరువాత పరిణామాలపై మాత్రం మౌనంగా ఉండిపోవడం గమనార్హం. ప్రధానంగా ఓ నిందితుడిని అదుపులోకి తీసుకున్న తరువాత నిబంధనల ప్రకారం నమోదు చేయాల్సిన కీలక రిజిస్టర్లు, రికార్డులను సిట్ కనీసం పరిశీలించలేదు. తమ రిమాండ్ రిపోర్ట్‌లో ప్రస్తావించనూ లేదు. వాటిని రోజూ పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాల్సిన సీపీ రాజశేఖర్‌బాబు ఎందుకు తన బాధ్యతను విస్మరించారనే కోణంలో దర్యాప్తు చేయకపోవడం గమనార్హం. ఆ కీలక అంశాలు ఇవీ...» పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల లాకప్‌లలో ఉన్న వారి వివరాలతో లాకప్ డెయిరీ సర్వీస్‌రిజిస్టర్(డీఎస్ఆర్)ను సీపీకి సమర్పిస్తారు. నిందితులను లాకప్‌లో పెట్టిన తేదీ, సమయం, సంబంధిత పోలీసు అధికారి తదితర వివరాలు అందులో ఉంటాయి. 24 గంటలు మించి ఎవరూ లాకప్‌లో ఉండకుండా.. న్యాయస్థానంలో హాజరుపరిచారా లేదా? అన్నది సీపీ పరిశీలించాలి. మరి సాయికృష్ణను రోజుల తరబడి అక్రమంగా లాకప్‌లో ఉంచితే ఆ విషయాన్ని సీపీ ఎందుకు పట్టించుకోలేదు? అవేవీ పరిశీలించకుండానే డీఎస్‌ఆర్‌ను ఆమోదించారా? అని న్యాయ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. అంటే సీపీకి తెలిసే సాయికృష్ణను రోజుల తరబడి అక్రమంగా లాకప్‌లో ఉంచారన్నది స్పష్టమవుతోంది. » ఇక పోలీస్ స్టేషన్లలో స్టేషన్ ఆఫీసర్లు, జనరల్ డ్యూటీ ఇన్‌చార్జ్‌లు, సెంట్రీలు ప్రతి ఆరు నుంచి 12 గంటల మధ్య షిఫ్ట్‌లు మారుతూ ఉంటారు. అలా షిఫ్ట్ మారే సమయంలో లాకప్‌లో ఉన్న వారి వివరాలను జనరల్ డైరీలో రాయాలి. మరి సాయికృష్ణను ఉంచిన కృష్ణలంక పోలీస్ స్టేషన్లో జనరల్ డైరీ వివరాలను సిట్ ఎందుకు రిమాండ్ రిపోర్ట్‌లో ప్రస్తావించ లేదు? జనరల్ డైరీ, స్టేషన్ డైరీ, లాకప్ రిజిస్టర్, కస్టడీ రిజిస్టర్, ప్రిజనర్ మూవ్మెంట్ రిజిస్టర్, విజిటర్స్ రిజిస్టర్, సెంట్రీ రిజిస్టర్, అరెస్టు రికార్డులు ఇవన్నీ కీలకం. వాటిని పరిశీలించకుండా వాటి ప్రస్తావనే లేకుండా రిమాండ్ రిపోర్ట్ రూపొందించడం ద్వారా ఈకేసును నీరుగార్చేందుకు కుట్ర పన్నారన్నది స్పష్టమవుతోంది. » సాయికృష్ణకు వ్యతిరేకంగా నాన్ బెయిలబుల్ వారంట్ (ఎన్బీడబ్ల్యూ) పెండింగ్‌లో ఉన్నందునే టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారని రిమాండ్ నివేదికలో పేర్కొన్నారు. మరి పెండింగ్‌లో ఉన్న ఎన్బీడబ్ల్యూలు, వాటిపై తీసుకున్న చర్యలను పోలీస్ కమిషనర్‌కు ప్రతి రోజూ నివేదిస్తారు. మరి సాయికృష్ణను ఎన్బీడబ్ల్యూ జారీ చేసి అదుపులోకి తీసుకుంటే ఆ విషయాన్ని సీపీకి సమర్పించే రోజువారీ నివేదికలో ప్రస్తావించాలి కదా? మరి ఈ అంశాన్ని ఆయన ఎందుకు పట్టించుకోలేదు? సాయికృష్ణకు ఎన్బీడబ్లూ జారీ చేసి అదుపులోకి తీసుకున్నారా...? తీసుకుంటే న్యాయస్థానంలో ఎప్పుడు ప్రవేశపెడతారు? అని ప్రశ్నించాలి కదా. మరి ఆయన ఎందుకు బాధ్యతాయుతంగా స్పందించలేదు? అంటే ఆయనకు తెలిసే సాయికృష్ణను అక్రమంగా అదుపులోకి తీసుకున్నారా? అని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. అందుకే ఉద్దేశపూర్వకంగా ఆయన ప్రస్తావన రిమాండ్ నివేదికలో పేర్కొనలేదా? అని సందేహం వ్యక్తం చేస్తున్నారు.సాయికృష్ణను ఎక్కడ దహనం చేశారో ఎందుకు వెల్లడించలేదు?సాయికృష్ణను ఎలా కనుమరుగు చేశారన్నది కూడా రిమాండ్ రిపోర్ట్‌లో ప్రస్తావించకపోవడం గమనార్హం. ఆయన మృతదేహం అనే అత్యంత కీలకమైన అంశాన్ని ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే విస్మరించింది. మృతదేహాన్ని ఎలా మాయం చేశారనే విషయాన్నే సిట్ అధికారులు ప్రస్తావించనే లేదు. సాయికృష్ణ మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా దహనం చేసేశారు అనే కోణంలో సిట్ అధికారులు ఎందుకు దర్యాప్తు చేయడంలేదు? ఆయన మృతదేహాన్ని దహనం చేశారని భావిస్తున్న ప్రదేశాన్ని ఎందుకు గుర్తించ లేదు? వాస్తవానికి సాయికృష్ణను దహనం చేసిన ప్రదేశాన్ని గుర్తించి... అక్కడ అవశేషాలను సేకరించాల్సిన బాధ్యత సిట్ అధికారులపై ఉంది. ప్రధానంగా దంతపు అవశేషాలు అత్యంత కీలకం. మృతదేహాన్ని దహనం చేసినా దంతపు అవశేషాలు మిగిలే ఉంటాయి. వాటి నుంచి డీఎన్ఏ నమూనాలను పరీక్షించి నేరాన్ని శాస్త్రీయంగా నిరూపించాలి. ఇంతటి కీలకమైన అంశాన్ని పోలీసులు ఎందుకు విస్మరించారన్నది సందేహాస్పదంగా మారింది. అంటే సాయికృష్ణ లాకప్ మరణం కేసు విచారణను ఉద్దేశపూర్వకంగా బలహీనపరచాలన్నది పోలీసుల లక్ష్యమని స్పష్టమవుతోంది. తద్వారా ఈ హత్య వెనుక ఉన్న ప్రభుత్వ పెద్దలు, పోలీసు ఉన్నతాధికారులను రక్షించాలన్నదే అసలు ఉద్దేశమని తెలుస్తోంది.క్రిమినల్ కుట్ర కోణాన్నే పట్టించుకోని సిట్ ప్రభుత్వ పెద్దల ఆదేశంతోనే...సాయికృష్ణ లాకప్ హత్య వెనుక ప్రభుత్వ పెద్దలు, ప్రధాన సూత్రధారులను తప్పించేందుకు సిట్ అధికారులు బరితెగించారు. అసలు సాయికృష్ణ హత్య వెనుక కుట్రకోణం ఉందనే విషయాన్నే పట్టించుకోకపోవడమే అందుకు తార్కాణం. అందుకే సాయికృష్ణను ఎందుకు హత్య చేసి ఉంటారు? అనే కోణంలో కనీసం దర్యాప్తు చేయలేదు. విజయవాడకు చెందిన టీడీపీ ప్రజాప్రతినిధికి చెందిన ఓ భూ వివాదం, విజయవాడలో ఓ ప్రైవేటు ఆర్థిక సంస్థలో నిధుల వ్యవహారంలో రెండువర్గాల మధ్య విభేదాలు తలెత్తాయని... ఆ వ్యవహారాలను కప్పిపుచ్చేందుకే సాయికృష్ణను లాకప్‌లో హత్య చేశారనే వాదన బలంగా వినిపిస్తోంది. మరి సిట్ ఆ కోణంలో ఎందుకు దర్యాప్తు చేయలేదన్నది కీలకంగా మారింది. ఆ కోణంలో దర్యాప్తు చేస్తే టీడీపీ ప్రజాప్రతినిధితోపాటు అందుకు సహకరించిన విజయవాడ పోలీస్ బాస్తోపాటు బిగ్‌బాస్ పాత్ర బయటపడుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అందుకే అసలు సాయికృష్ణ హత్య వెనుక కుట్ర కోణాన్నే విస్మరిస్తే... ప్రభుత్వ, పోలీసు పెద్దలను రక్షించవచ్చన్నది సిట్ ఉద్దేశం కావచ్చని చెబుతున్నారు.న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టించేందుకేనా...!సాయికృష్ణ మిస్సింగ్ విషయంలో సీఐ నాగరాజుతోపాటు పోలీసులు న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టించేందుకు బరితెగించారు. హెబియస్ కార్పస్ లాంటి కీలకమైన పిటిషన్‌కు సంబంధించి న్యాయస్థానానికి సమర్పించే అధికారిక నివేదికపై సీపీ రాజశేఖర్‌బాబుకు ముందే సమాచారం ఉంటుంది. ఆయన ఆమోదంతోనే న్యాయస్థానానికి నివేదిక ఇస్తారు. కాగా హెబియస్ కార్పస్ పిటిషన్ విచారణ సమయంలో సాయికృష్ణ ఆచూకీ తమకు తెలియదని సీఐ నాగరాజుతోపాటు విజయవాడ పోలీసులు న్యాయస్థానానికి నివేదించారు. కానీ సిట్ రిమాండ్ రిపోర్ట్ అందుకు విరుద్ధంగా ఉండటం గమనార్హం. సాయికృష్ణను టాస్క్‌ఫోర్స్ పోలీసులు తనకు మే 6న అప్పగించినట్టు నాగరాజు పేర్కొన్నారని చెప్పారు. ఇక్కడ రెండు ప్రధాన సందేహాలు తలెత్తుతున్నాయి...» సాయికృష్ణ ఆచూకీ తమకు తెలియదని కొద్ది రోజుల క్రితం న్యాయస్థానానికి సమర్పించిన నివేదికలో ఉద్దేశపూర్వకంగానే అవాస్తవాలు చెప్పారా..? అలా చెబితే అందుకు సీపీతోపాటు విజయవాడ పోలీసులు బాధ్యులు అవుతారు. » లేదా... టాస్క్‌ఫోర్స్ పోలీసులు సాయికృష్ణను సీఐ నాగరాజుకు అప్పగించినట్టు ప్రస్తుతం చెబుతున్న రికార్డులు ట్యాంపర్ చేసి ఉండవచ్చు. అధికారిక రికార్డులను ట్యాంపర్ చేయడం తీవ్రమైన నేరం. అందుకు సీపీ రాజశేఖర్‌బాబు, టాస్క్‌ఫోర్స్ అధికారులు కూడా బాధ్యులు అవుతారు.ఈ రెండింటిలో ఏది వాస్తవం..? ఏది అవాస్తవం..? అన్నది తేలాల్సి ఉంది.సీసీ టీవీ బ్యాకప్ ఫుటేజీని ఎందుకు స్వాధీనం చేసుకోవడం లేదు?కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సీసీ టీవీ కెమెరా ఫుటేజీ ధ్వంసమైనట్లు సిట్ పేర్కొంది. కానీ రాష్ట్రంలో అన్ని పోలీస్ స్టేషన్ల సీసీ టీవీ ఫుటేజీ డీజీపీ కార్యాలయంలో ఉంటుంది. ఆ బ్యాకప్ నుంచి ఫుటేజీని సిట్ అధికారులు ఇంకా ఎందుకు స్వాధీనం చేసుకోలేదన్నది కీలకంగా మారింది. ఆ ఫుటేజీ కావాలని సిట్ అధికారులు ఆ ప్రాజెక్టు నిర్వహిస్తున్న ప్రైవేటు సంస్థకు లేఖ రాశారు. కనీసం 15 లక్షల నుంచి 20 లక్షల మెమోరీ డ్యూరేషన్ యూనిట్లు అవసరమని... ఆ మెమోరీ సమకూరిస్తే తాము అందిస్తామని ఆ ప్రైవేటు సంస్థ చెప్పినట్టు తెలుస్తోంది.కాలయాపన చేసేందుకే సిట్ అధికారులు ఇలా వ్యవహరిస్తున్నారా? అనే సందేహం కలుగుతోంది. ఎందుకంటే సీసీ టీవీ ఫుటేజీ బ్యాకప్ డీజీపీ కార్యాలయంలోనే ఉంది. సిట్ అధికారులు వెంటనే వెళ్లి ఆ బ్యాకప్‌ను ఎందుకు స్వాధీనం చేసుకోవడం లేదు?.. వారిని అడ్డుకుంటున్నది ఎవరు? ప్రైవేటు సంస్థ ఇచ్చేంతవరకు ఎందుకు కాలయాపన చేస్తున్నారు? వెంటనే వచ్చి స్వాధీనం చేసుకోవాలని డీజీపీ ఎందుకు ఆదేశించడం లేదు? ఈలోగా బ్యాకప్ ఫుటేజీ కూడా మాయం చేసే కుట్ర దాగుందా? అనే సందేహాలు రేకెత్తుతున్నాయి. పోలీసు ప్రధాన కార్యాలయంలో బ్యాకప్ ఫుటేజీ కూడా గల్లంతు అయితే అందుకు డీజీపీతోపాటు యావత్ పోలీసు ఐటీ విభాగం బాధ్యత వహించాల్సి ఉంటుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సాయికృష్ణ హత్యకు గురయ్యారని స్పష్టంగా పేర్కొన లేదు. పోస్ట్‌మార్టం, మెడికల్ రికార్డులు లేనే లేవు. మృతదేహాన్ని ఏం చేశారన్నదీ చెప్పలేదు. మృతదేహం అవశేషాలు గుర్తించలేదు. ఎటువంటి అధికారిక రిజిస్టర్టు, రికార్డుల వివరాలు పేర్కొన లేదు. ప్రత్యక్ష సాక్షుల ప్రస్తావనే లేదు. హత్య వెనుక కుట్ర కోణంపై దర్యాప్తే లేదు. వెరసి సాయికృష్ణ లాకప్ హత్య కేసును నీరుగార్చి సూత్రధారులు, పాత్రధారులను కాపాడేందుకు సిట్ ద్వారా చంద్రబాబు ప్రభుత్వం బరితెగించిందన్నది స్పష్టమవుతోంది. -
‘సాయికృష్ణ మృతదేహాన్ని సీఐ నాగరాజు ఒక్కడే మోసుకెళ్లాడా?’
సాక్షి,తాడేపల్లి: చంద్రబాబు ప్రభుత్వంలో పోలీస్ వ్యవస్థ భ్రష్టుపట్టిందని మాజీ మంత్రి పేర్నినాని ధ్వజమెత్తారు. సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో కొనసాగుతున్న సిట్ విచారణపై ఆయన బుధవారం తాడేపల్లి లోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. పోలీస్‌స్టేషన్‌లోనే మర్డర్ చేస్తే ఒక్క అధికారి కానీ, మంత్రికానీ అడగలేదు. సాయికృష్ణ ఇంటికి వైఎస్ జగన్ వెళ్లి పరామర్శిస్తే గాని ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. సాయికృష్ణ మృతదేహం ఏమైందో చెప్పలేని పరిస్థితుల్లో అధికారులున్నారు. ఈఘటనలో చంద్రబాబు ప్రభుత్వం సిగ్గుపడాలి. సామాన్యుడి ప్రాణం పోతే పట్టించుకోరా?సాయికృష్ణ ఘటనకు ఎవరు రాజకీయ రంగు పులిమారు. చంద్రబాబూ.. మిమ్మల్ని ప్రజలు ఖబడ్దార్ అంటున్నారు. మీ పాలన ఎప్పుడు పోతుందో అని ప్రజలు రోజులు లెక్కపెడుతున్నారు.మీరు మోదీకి వంగి వంగి దండాలు పెడుతున్నారు. రౌడీషీటర్ అని ఆరోపిస్తున్నారు.. రౌడీ షీటర్ అయితే చంపేస్తారా?.కోర్టులో హాజరు పరిచి శిక్ష విధించేలా చేయండి. సాయికృష్ణ కేసులో ఇవాళ జరిగిందా డొల్ల విచారణే. సీపీ నేతృత్వంలోనే టాస్క్ ఫోర్స్ నడుస్తోంది. విచారణలో సీపీ పేరు రాకపోవడం దుర్మార్గం. కృష్ణలంక పీఎస్ పరిధిలోకి వచ్చే ఏసీపీని మీరెందుకు విచారించలేదు.17మంది సాక్షులను విచారించామని చెబుతున్నారు. సిట్ అధికారులు ఈ 17మందితోనే ఎందుకు ఆగిపోయారు.సిట్ విచారణలో సాయికృష్ణను కొట్టి చంపింది ఒక్క సీఐ నాగరాజేనా?. మిగితావారు ఈ కేసులో లేరా?. సీఐ నాగరాజుకు ఎవరు సాయం చేశారు? డెడ్ బాడీని ఎవరు మాయం చేశారు. సాయికృష్ణ మృతదేహాన్ని సీఐ నాగరాజు ఒక్కడే మోసుకెళ్లాడా?. సిట్ విచారణలో ఈ అంశాలన్నీ ఎందుకు తేల్చలేదు. పీఎస్‌లో ఫుటేజీ మాయం చేస్తే.. బయటి ఫుటేజీ అయినా ఉండాలి కదా?. అంటే ఎవరూ లేని సమయంలో స్టేషన్లోనే మృతదేహాన్ని పాతి పెట్టారా?’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. -
సాయికృష్ణ కేసులో కీలక మలుపు
సాక్షి,విజయవాడ: గాదె సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. సాయికృష్ణను మార్కాపురం నుంచి విజయవాడకు తీసుకొచ్చిన తర్వాత టాస్క్‌ఫోర్స్ పోలీసులు అతన్ని విచారించారు. ఈ విచారణపై సమాచారం తెలుసుకున్న కేసు దర్యాప్తు అధికారి, ఏసీపీ దైవప్రసాద్... కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు టాస్క్‌ఫోర్స్ ఏసీపీ లతాకుమారిని పిలిపించుకున్నారు. ప్రస్తుతం కృష్ణలంక స్టేషన్లో ఏసీపీ దైవప్రసాద్తో పాటు ఆయన నేతృత్వంలోని ఇద్దరు సీఐలు, ఇద్దరు ఎస్ఐల బృందం లతాకుమారిని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. -
సాయికృష్ణ, క్రాంతి కుమార్ కేసులు.. NHRCకి వైఎస్సార్సీపీ ఎంపీల ఫిర్యాదు
సాక్షి,న్యూఢిల్లీ: విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ సీఐ నాగరాజు వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకున్న క్రాంతికుమార్, అలాగే లాకప్ డెత్‌కు (అదృశ్యం) గురైన గాదె సాయికృష్ణ కేసుల్లో బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ వైఎస్సార్సీపీ ఎంపీలు జాతీయ మానవ హక్కుల సంఘం (NHRC) ఛైర్మన్‌ను కలిశారు. ఈ రెండు ఘటనలపై తక్షణమే దర్యాప్తు జరిపించాలని వైఎస్సార్సీపీ ఎంపీలు మద్దిల తనూజరాణి, డాక్టర్ గురుమూర్తి విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా సాయికృష్ణ లాకప్‌డెత్, క్రాంతి కుమార్ ఆత్మహత్యల వెనుక ఉన్న నిజాలను బయటకు తీసి, బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు ఎన్హెచ్ఆర్సీ ఛైర్మన్‌కు సమర్పించిన వినతి పత్రంలో కోరారు. -
‘సాయికృష్ణను లాకప్‌లోనే కొట్టి చంపేశారు’
సాక్షి,గుంటూరు: 23ఏళ్ల యువకుడు సాయికృష్ణను పోలీస్ స్టేషన్లో హత్య చేసి.. ఆనవాళ్లు లేకుండా చేసి డెడ్‌బాడీని దహనం చేశారు. ఈ అంశంలో జనసేన అధ్యక్షుడు పవన్ ఎందుకు మాట్లాడరని మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు.సాయికృష్ణ మృతిపై గుంటూరు వైఎస్సార్సీపీ కార్యాయంలో అంబటి మీడియాతో మాట్లాడారు. సాయికృష్ణ లాకప్ డెత్ చర్చనీయాంశమైంది. గాదె సాయి కృష్ణ మేనమామ నవరంగ్ నా దగ్గరకు వచ్చారు. నేను జనసేన కార్యకర్తను అని నవరంగ్ చెప్పారు. సాయికృష్ణ తల్లి వేదన బాధ కలిగించింది. పార్టీలకు అతీతంగా ఉద్యమ రూపం ఇవ్వాలి. దేశంలోనే ఇటువంటి ఘటన ఎక్కడా జరగలేదు. ఎన్నో లాకప్ డెత్స్ జరిగాయి.కానీ ఇక్కడ చనిపోయితే శవాన్ని మాయం చేశారు. ఏపి పోలీస్ మర్డర్ చేసి శవాన్ని మాయం చేశారు.హెబియస్ కార్పస్ కేసు వేస్తే సాయికృష్ణ కోసం వెతుకుతున్నామని పోలీసులు చెబుతున్నారు.సాయికృష్ణ మృతికి పోలీసులే కారణంసాయికృష్ణ మృతిపై సీబీఐ ఎంక్వయిరీ వేసి న్యాయం చేయండి.పవన్ కల్యాణ్ కు రిక్వెస్ట్ చేస్తున్నాను. చేతులు జోడించి అడుగుతున్నాను పవన్ కల్యాణ్.. ఎంక్వయిరీ వేయండి.మనం మానవులు అన్నది గుర్తించాలి. మర్డర్ చేసి కాల్చేయడం చట్టం చేసే పనా. తమిళనాడు ఘటన కన్నా ఘోరమైన ఘటన. చట్టప్రకారం ఉరిశిక్ష వేయాలి. సాయికృష్ణను లాకప్‌డెత్ చేశారు. సీబీఐ ఎంక్వైరీ వేసి న్యాయం చేయండి. సాయికృష్ణను దహనం చేసి ఉంటే కనీసం బూడిదనైనా ఇవ్వమని అతని తల్లి కోరుతోంది. సీబీఐ విచారణ కోరుతున్నా. లేదంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండని అంబటి రాంబాబు కోరారు. అనంతరరం సాయికృష్ణ మేనమామ నవరంగ్ మీడియాతో మాట్లాడారు. నవరంగ్, సాయి కృష్ణ మేనమామ సాయి కృష్ణ మృతిని పార్టికి ముడిపెట్టడం కరెక్ట్ కాదు. ఆ తల్లి బాధ చూసి అందరూ చలించిపోతున్నారు. ఫ్రెండ్లీ పోలీస్ అంటే దాడి చేసి హత్య చేసి దహనం చేయడమా..సాధారణ వ్యక్తి చనిపోతే ఎవరూ స్పందించ కూడదా. ఆ తల్లి బాధ మరొకరికి రాకూడదు. .దారుణంగా చంపేశారు కాబట్టే న్యాయం చేయమని అడుగుతున్నాం.సాయి కృష్ణ మంచోడు కాదు. మరి మీరు హంతకులు కాదా’అని ప్రశ్నించారు.వంగవీటి నరేంద్రమానవతా దృక్పధంతో స్పందించాం.వంగవీటి కుటుంబంతో సంబంధ బాంధవ్యాలున్నాయి. రౌడీ షీట్ ఓపెన్ చేయడమే కాకుండా హత్య చేశారు.సాయికృష్ణపై ఒక్క కేసు ఉన్నా బయట పెట్టాలి. తల్లి అడిగినట్లు మృతదేహం అన్నా ఇవ్వాలి లేకపోతే బూడిదన్న ఇవ్వాలి.హోంమంత్రి... సాయికృష్ణ హత్య గురించి తప్ప అన్ని విషయాలు మాట్లాడారు. -
లాకప్‌డెత్ కేసులో 9 మంది పోలీసులకు ఉరిశిక్ష
సాక్షి, చెన్నై/అమరావతి: తమిళనాడులో కలకలం సృష్టించిన తండ్రీ కుమారుల లాకప్ డెత్ కేసులో మదురై కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. వారిద్దరి మృతికి కారణమైన 9 మంది పోలీసులకు ఉరిశిక్ష విధించింది. మృతుల కుటుంబాలకు రూ.1.40 కోట్లను పరిహారంగా చెల్లించాలని తొమ్మిది మంది పోలీసులను కోర్టు ఆదేశించింది. శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులే చట్టాన్ని ఉల్లంఘించి ఎటువంటి నేర చరిత్ర లేని తండ్రీ కుమారులను అత్యంత క్రూరంగా హింసించి చంపడం ‘అరుదైన కేసు‘గా న్యాయస్థానం అభివర్ణించింది. ఈ మేరకు మదురై అదనపు జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి జి.ముత్తుకుమార్ సోమవారం తీర్పు వెలువరించారు. దేశ న్యాయ చరిత్రలో లాకప్ డెత్ కేసులో ఇంత మంది పోలీసులకు ఓ కోర్టు మూకుమ్మడిగా మరణ శిక్ష విధించడం ఇదే తొలిసారి. మరణశిక్ష పడిన వారిలో ఎస్.శ్రీధర్ (అప్పటి ఇన్స్పెక్టర్). పి.రఘు గణేష్ (సబ్–ఇన్స్పెక్టర్), కె.బాలకృష్ణన్ (సబ్–ఇన్స్పెక్టర్), ఎస్.మురుగన్ (హెడ్ కానిస్టేబుల్), ఏ.సామిదురై (హెడ్ కానిస్టేబుల్), ఎం.ముత్తురాజ్ (కానిస్టేబుల్), ఎస్.చెల్లదురై (కానిస్టేబుల్), థామస్ ఫ్రాన్సిస్ (కానిస్టేబుల్), ఎస్.వెయిలుముత్తు (కానిస్టేబుల్) ఉన్నారు. మరో నిందితుడిగా ఉన్న స్పెషల్ సబ్ ఇన్స్పెక్టర్ పాల్‌దొరై కేసు విచారణలో ఉండగా కరోనాతో మరణించారు.షాపు ఎక్కువ సేపు తెరిచి ఉండటమే వారు చేసిన పాపం..తండ్రీ కుమారులైన జయరాజ్, బెన్నిక్స్‌లు మొబైల్ దుకాణం నిర్వహించేవారు. కోవిడ్ సమయంలో వీరు లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించి ఎక్కువ సేపు షాపు తెరిచారన్న ఆరోపణలతో (ఆ తరువాత దర్యాప్తులో ఇది అవాస్తమని తేలింది) 2020 జూన్ 19న తుత్తుకూడి జిల్లా సత్తాన్‌కులం పోలీసులు వారిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. లాకప్‌లో వారిని తీవ్రంగా కొట్టి హింసించడంతో పోలీసుల దెబ్బలకు తట్టుకోలేక జూన్ 22–23 తేదీల్లో బెన్నిక్స్, జయరాజ్ మరణించారు. పోలీసులు దారుణంగా హింసించడం వల్లే వీరిద్దరూ మరణించారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనిపై సర్వత్రా నిరసనలు వెల్లువెత్తడంతో మొత్తం 10 పోలీసులపై కేసు నమోదు చేసి క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు.హైకోర్టు జోక్యంతో సీబీఐకి...ఈ ఘటనపై మద్రాసు హైకోర్టు మదురై బెంచ్ సుమోటోగా విచారణ చేపట్టింది. పోలీసు అధికారులపై హత్యాయత్నం మోపడానికి తగిన ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని హైకోర్టు స్పష్టంగా వ్యాఖ్యానించింది. నిందితులైన పోలీసు అధికారులు ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని హైకోర్టు గుర్తించింది. దీంతో దర్యాప్తులో జాప్యం జరగకుండా, సాక్ష్యాలు తారుమారు కాకుండా ఉండేందుకు పారదర్శక విచారణ కోసం సీఐడీకి అప్పగించింది. అటు తరువాత రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించింది. హత్య, అక్రమ నిర్బంధం, తప్పుడు సాక్ష్యాలను సృష్టించడం, తప్పుడు అభియోగాలు మోపడం, ప్రభుత్వ రికార్డులను తారుమారు చేయడం, నేరాన్ని ప్రేరేపించడం వంటి అభియోగాల కింద సీబీఐ కేసు దర్యాప్తు జరిపింది.కీలకంగా మహిళా కానిస్టేబుల్ సాక్ష్యం..మృతులు జయరాజ్, బిన్నిక్స్లపై పోలీసులు మోపిన ఆరోపణలు అవాస్తవమని దర్యాప్తులో సీబీఐ తేల్చింది. ఈ కేసులో ఓ మహిళా కానిస్టేబుల్ ఇచ్చిన వాంగ్మూలం అత్యంత కీలకంగా మారింది. తండ్రీ కుమారులను పోలీసులు రాత్రంతా కొడుతూనే ఉన్నారని.. లాఠీలపై, బల్లలపై రక్తపు మరకలు ఉన్నాయని ఆమె సీబీఐకి వెల్లడించింది. అంతేకాకుండా ఈ ఘటన బయటకు రాకుండా ఉండేందుకు పోలీసులు సీసీ కెమెరా రికార్డింగ్‌లు ఆటోమేటిక్‌గా డిలీట్ అయ్యేలా సెట్ చేసినట్లు సీబీఐ దర్యాప్తులో తేలింది. ఆ ఆధారాలన్నింటితో కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. సుదీర్ఘ విచారణ జరిపిన మదురై కోర్టు ఆరేళ్ల తరువాత తీర్పు వెలువరించింది.ముమ్మాటికీ హత్యే...జయరాజ్, బెన్నిక్స్ శరీరాలపై ఉన్న గాయాలు ‘అసాధారణమైనవి..’ అని న్యాయమూర్తి తన తీర్పులో స్పష్టం చేశారు. ఈ గాయాలే వారి మరణానికి ప్రధాన కారణమయ్యాయని పేర్కొన్నారు. జయరాజ్, బెన్నిక్స్‌లు తమను తామే గాయపరుచుకున్నారన్న నిందితుల(పోలీసులు) వాదనను తోసిపుచ్చుతున్నట్లు తెలిపారు. పోస్ట్‌మార్టం నివేదికలను పరిశీలించిన అనంతరం పోలీసులు నిరంతరం, పదే పదే చేసిన దాడి వల్లే ఆ గాయాలు అయినట్లు స్పష్టం చేశారు. జయరాజ్‌కు గతంలో గుండె సంబంధిత వ్యాధులు ఉన్నాయని, అయితే ఆయన మరణం ఆ అనారోగ్యం వల్ల సంభవించలేదని, పోలీసుల చేతిలో అనుభవించిన తీవ్ర శారీరక హింస వల్లే ప్రాణాలు కోల్పోయారని తీర్పులో న్యాయమూర్తి పేర్కొన్నారు. జయరాజ్, బిన్నిక్స్ ఆంగ్లేయుల కాలంలో ఇలాంటి దాడులు జరిగినట్లు విన్నామని, రాత్రి 8 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు తండ్రీ కుమారులను పోలీసులు కరల్రు, ఇనుప రాడ్లతో చిత్రహింసలకు గురిచేశారని నిర్ధారణ అయినట్లు పేర్కొన్నారు. పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేయడమే కాకుండా ఫోర్జరీ పత్రాలను సృష్టించినట్లు స్పష్టమైందన్నారు. ఇ¯న్స్పెక్టర్ శ్రీధర్ ఆదేశాల మేరకు పోలీసులు ఈ దారుణానికి పాల్పడ్డారని, వారు పైఅధికారులకు ఫిర్యాదు చేసి ఈ మరణాలను ఆపి ఉండవచ్చని, అలా కాకుండా ఈ నేరంలో భాగస్వాములయ్యారని కోర్టు వ్యాఖ్యానించింది. ఆధారాలన్నింటినీ పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం.. ఇది ముమ్మాటికీ హత్యేనని నిర్ధారించింది. ఈ క్రూరమైన చర్యకు పాల్పడిన తొమ్మిది మంది పోలీసు అధికారులను దోషులుగా ప్రకటించి వారికి మరణశిక్షను విధించింది. -
మిస్టరీగా మారిన 'కాంగో జాతీయుడి లాకప్ డెత్!' ఆరోజు ఏం జరిగింది?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీఎస్–నాబ్), హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్, సైబరాబాద్, రాచకొండలకు చెందిన స్పెషల్ ఆపరేషన్ టీమ్స్‌లతో (ఎస్ఓటీ) పాటు స్థానిక పోలీసులకు చిక్కిన ప్రతి నాలుగు డ్రగ్ ముఠాల్లో మూడింటి లింకులు బెంగళూరులో ఉంటున్నాయి. ఆ నగరం డ్రగ్ పెడ్లర్స్, సప్లయర్లకు అడ్డాగా మారడానికి దాదాపు రెండున్నరేళ్ళ క్రితం చోటు చేసుకున్న ఓ లాకప్ డెత్ కారణమైంది. దీనిని గమనించిన రాష్ట్ర పోలీసు విభాగం ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తోంది. ఒకప్పుడు గోవా.. ఇప్పుడు బెంగళూరు.. నగరంలో ఎక్కువగా లభించే మాదకద్రవ్యాల్లో గంజాయి సంబంధితమైన వాటి తర్వాతి స్థానంలో సింథటిక్ డ్రగ్స్ ఉంటున్నాయి. గంజాయి, చెరస్, హష్ ఆయిల్ తదితరాలు ఏజెన్సీ ప్రాంతాల నుంచి సిటీకి వస్తున్నాయి. కోకై న్, బ్రౌన్‌షుగర్, హెరాయిన్ తదితర సింథటిక్ డ్రగ్స్ మూలాలు మాత్రం విదేశాల్లో ఉంటున్నప్పటికీ ఇక్కడకు సరఫరా మాత్రం ఉత్తరాదితో పాటు బెంగళూరు నుంచి జరుగుతోంది. ఒకప్పుడు ఈ డ్రగ్ డాన్స్ అంతా గోవా కేంద్రంగా కథ నడిపే వారు. హైదరాబాద్ పోలీసులు వరుస దాడులు చేసి ఎడ్విన్, స్టీవ్ సహా బడా డ్రగ్ డాన్స్‌కు చెక్ చెప్పారు. దీంతో ఇక్కడి వారికి గోవా నుంచి డ్రగ్స్ సరఫరా దాదాపు ఆగిపోయింది. దీంతో బెంగళూరు కేంద్రంగా సరఫరా మొదలైంది. ఆ నగరమూ విదేశీయుల అడ్డా.. బెంగళూరుతో పాటు ఉత్తరాదిలోని అనేక నగరాల్లో తిష్ట వేసి, డ్రగ్స్ దందాలో కీలకంగా వ్యవహరిస్తున్న వారిలో నల్లజాతీయులే ఎక్కువగా ఉంటున్నారు. స్టడీ, బిజినెస్, విజిట్ సహా వివిధ రకాలైన వీసాలపై వస్తున్న నైజీరియా, సూడాన్, సోమాలియా, కాంగో జాతీయులు డ్రగ్ పెడ్లర్స్, సప్లయర్స్‌గా మారుతున్నారు. ఇలాంటి వాళ్లు ఇతర నగరాలతో పాటు బెంగళూరులోనూ పెద్ద సంఖ్యలో నివసిస్తున్నారు. 2021 ప్రథమార్ధం వరకు ఆ నగరంలో నేరాలు చేస్తున్న, అక్రమంగా నివసిస్తున్న ఇలాంటి వారిపై ఉక్కుపాదం మొపేవారు. వీళ్ళు సాధారణంగా ఎంపిక చేసుకున్న ప్రాంతాల్లోనే పెద్ద సంఖ్యలో నివసిస్తుంటారు. బెంగళూరులోని అలాంటి ప్రాంతాల్లో తరచూ తనిఖీలు చేసే అక్కడి పోలీసులు అక్రమంగా నివసిస్తున్న, దందాలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకున్నారు. ఒక్క ఉదంతంలో అడ్డం తిరిగిన కథ.. ఆ నగరంలో 2021 ఆగస్టులో చోటు చేసుకున్న ఓ ఉదంతంతో కథ అడ్డం తిరిగింది. కాంగోకు చెందిన జోయల్ షిండానీ ములు (27) స్టడీ వీసాపై బెంగళూరుకు వచ్చాడు. డ్రగ్స్ పెడ్లింగ్ చేస్తూ పోలీసులకు చిక్కకుండా ముప్పతిప్పలు పెట్టిన ఇతడిని 2021 ఆగస్టులో జేసీ నగర్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ నేపథ్యంలో ఠాణాలోనే అతడు చనిపోయాడు. కార్డియాక్ అరెస్టు వల్ల మరణం సంభవించిందని పోలీసులు చెప్పగా, పోలీసులే కొట్టి చంపారని నల్లజాతీయులు ఆరోపించారు. దీంతో పెద్ద సంఖ్యలో ఆ ఠాణా వద్దకు చేరుకున్న నల్లజాతీయులు రాళ్లు రువ్వడంతో పాటు నిరసన చేపట్టారు. దాదాపు రెండు రోజుల పాటు ఈ ఘర్షణలు అక్కడి పోలీసులు ఉలిక్కిపడేలా చేశాయి. ఈ పరిణామం తర్వాత ఆ నగర అధికారులు నల్లజాతీయుల విషయంలో చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. పరిస్థితులు చేయి దాటుతుండటంతో.. దీనిని అలుసుగా చేసుకున్న అనేక మంది డ్రగ్ పెడ్లర్స్, సప్లయర్స్ బెంగళూరును అడ్డాగా మార్చుకున్నారు. ఇతర మెట్రోల్లో నివసించే నల్లజాతీయులు సైతం ఆ నగరానికి వచ్చివెళ్తూ డ్రగ్స్ దందా చేస్తున్నారు. కొన్ని రకాలైన డ్రగ్స్ విదేశాల నుంచి నేరుగా కర్ణాటకలోని వివిధ నగరాలకు వచ్చి బెంగళూరు చేరుతున్నాయి. అక్కడ నుంచే హైదరాబాద్ సహా వివిధ నగరాలకు సరఫరా అవుతున్నాయి. ఇటీవల వెలుగులోకి వచ్చిన కేసులను అధ్యయనం చేసిన అధికారులు ఈ విషయం గుర్తించారు. దీంతో అక్కడ ఉన్న డ్రగ్ పెడ్లర్స్‌కు చెక్ చెప్పడానికి, మాదకద్రవ్యాల దందాను కట్టడి చేయడానికి అవసరమైన మార్గాలను అన్వేషిస్తున్నారు. అవసరమైతే దీనిపై కేంద్ర ఏజెన్సీల సహకారం కూడా తీసుకోవాలని భావిస్తున్నారు. ఇక్కడ నుంచి సూత్రధారులను పట్టుకోవడానికి వెళ్లినా సరైన సహకారం లభించకపోవడాన్నీ ప్రస్తావించనున్నారు. ఇవి కూడా చదవండి: అగ్నిసాక్షిగా ఏడడుగులు.. అంతలోనే అంతర్వేది బీచ్‌లో విషాదం! -
కోలారు జిల్లాలో లాకప్‌డెత్?
కోలారు: బైక్ చోరీ కేసులో పోలీసులు విచారణకు తీసుకొచ్చిన యువకుడు అనుమానాస్పదరీతిలో మరణించాడు. ఈ సంఘటన కోలారు జిల్లాలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం మాలేపాడు పంచాయతీ నల్లరాజుగానిపల్లికి చెందిన ఎరికల మునిరాజు (28) అనే వ్యక్తిని ముళబాగిలు తాలూకా నంగలి పోలీసులు బైక్, మొబైల్ చోరీ కేసులో గత నెల 31న విచారణ కోసం తీసుకొచ్చారు. అతడు పలు దొంగతనాల కేసుల్లో నిందితుడని తెలిసింది. కోలారు జిల్లాలో చోరీపై కేసు నమోదు కావడంతో విచారణ కోసం అరెస్టు చేసి తీసుకొచ్చారు. అతనికి కిడ్నీ సమస్య ఉందని తెలిసి కోలారులోని ఆర్ఎల్ జాలప్ప ఆస్పత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ సోమవారం అర్ధరాత్రి మునిరాజు మరణించాడని పోలీసులు చెబుతున్నారు. పోలీసులే చంపారని ఆరోపణ అయితే మునిరాజును గత నెల 21నే తమ గ్రామం నుంచి పోలీసులు తీసుకు వెళ్లారని, స్టేషన్లోనే ఉంచి తీవ్రంగా కొట్టడంతో వల్లనే చనిపోయాడని మునిరాజు తల్లి మునిరత్నమ్మ ఆరోపిస్తోంది. అది కప్పిపుచ్చుకోవడానికి పోలీసులు ఆస్పత్రి డ్రామా ఆడుతున్నారని బంధువులు మండిపడ్డారు. మృతదేహం మీద గాయాలు ఉన్నాయని, బట్టలు లేవని,ఎడమ కాలికి పెద్ద కట్టు కట్టి ఉందని చెప్పారు. ఆస్పత్రిలో చికిత్స పొందిన దాఖలాలే లేవని వారు ఆరోపించారు. దీనిపై విచారణ జరపాలని కోలారులోని గల్పేటె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్నట్లు చెప్పారు. -
TS: లాకప్ డెత్‌పై డీజీపీ సీరియస్.. సీఐ, ఎస్ఐపై చర్యలు!
సాక్షి, హైదరాబాద్: మెదక్ లాకప్‌డెత్ ఘటనపై తెలంగాణ డీజీపీ అంజనీకుమార్ సీరియస్ అయ్యారు. ఈ ఘటనపై దర్యాప్తునకు డీజీపీ ఆదేశించారు. ఈ క్రమంలోనే ఐజీ చంద్రశేఖర్ రెడ్డి నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేశారు. ఇదే సమయంలో సీఐ, ఎస్ఐపై శాఖపరమైన చర్యలు తీసుకున్నారు. కాగా, పోలీసుల చిత్రహింసలతో ఖాదర్ చనిపోయారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులే కారణం.. మెదక్‌కు చెందిన ఖదీర్‌ఖాన్.. గాంధీ ఆసుపత్రిలో చిక్సిత పొందతూ ఫిబ్రవరి 12వ తేదీన మృతిచెందాడు. అయితే, దొంగతనం కేసులో ఖదీర్‌ను పోలీసులు తీవ్రంగా కొట్టడం వల్లే ఆయన చనిపోయాడని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జరిగింది ఇది.. అయితే, జనవరి 27వ తేదీన మెదక్‌లోని అరబ్ గల్లీలో బంగారం గొలుసు దొంగతనం జరిగిందని ఓ మహిళ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కాగా, ఘటనాస్థలంలో ఉన్న సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా ఖదీర్‌ఖాన్‌ను జనవరి 29వ తేదీన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో ఖదీర్‌ను ఫిబ్రవరి 2వ తేదీ వరకు స్టేషన్లోనే ఉంచి.. తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇదిలా ఉండగా.. ఖదీర్ ఇంటికి వెళ్లిన మరుసటి రోజే.. అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో, అతడికి ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స అందించి అక్కడి నుంచి గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ ఖదీర్ మృతిచెందాడు. అయితే, పోలీసులే కారణంగా ఖదీర్ చనిపోయాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. -
ఏడు లక్షలిస్తాం... ఏం మాట్లాడొద్దు
తిరువణ్నామలై: తమిళనాడులో మరో లాకప్ డెత్ చోటుచేసుకుంది. దాన్ని కప్పిపుచ్చడానికి పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారని, తమకు రూ.7 లక్షలు ఆఫర్ చేశారని బాధిత కుటుంబం ఆరోపించింది. ఒప్పుకోవాలంటూ దాదాపు రోజంతా వెంట పడ్డారని చెప్పింది. తిరువణ్నామలై జిల్లాకు చెందిన తంగమణి (47)ని కల్తీ మద్యం అమ్ముతున్నాడంటూ ఏప్రిల్ 26న పోలీసులు అరెస్టు చేశారు. మర్నాడు అతను ఆస్పత్రిలో మరణించాడు. లాకప్‌లో పోలీసులు విచక్షణారహితంగా కొట్టడం వల్లే చనిపోయాడని కుమారుడు దినకరన్ ఆరోపించాడు. ‘‘దీనిపై అల్లరి చేయొద్దని పోలీసులు బెదిరించారు. తక్షణం అంత్యక్రియలు పూర్తి చేయాలంటూ ఒత్తిడి తెచ్చారు. గురువారం ఉదయం నుంచి శుక్రవారం తెల్లవారుజాము దాకా మాతో బేరమాడారు. చివరికి రూ.7 లక్షలు ఇవ్వజూపారు’’ అని ఆరోపించాడు. తమకు డబ్బులొద్దని, తండ్రి మరణానికి కారకులైన పోలీసులపై కేసు పెట్టి శిక్షించాలని డిమాండ్ చేశాడు. దీనిపై విచారణ జరిపిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇటీవలే చెన్నైలో లాకప్ డెత్ జరగ్గా బాధిత కుటుంబానికి ప్రభుత్వం రూ.10 లక్షలు పరిహారమిచ్చింది. -
మరియమ్మ లాకప్ డెత్‌పై తీర్పు వెలువరించిన తెలంగాణ హైకోర్టు
Mariyamma Lockup Death Case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మరియమ్మ లాక్ అప్ డెత్ అంశంపై తెలంగాణ హైకోర్టు సోమవారం తీర్పు వెల్లడించింది. మరియమ్మ కేసును సీబీఐకి అప్పగించేందుకు హైకోర్టు నిరాకరించింది. ప్రత్యేకంగా దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చెయ్యాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కోర్టు ఇప్పటికే ఇచ్చిన రిపోర్టు ఆధారంగా దర్యాప్తు కొనసాగించాలని ఆదేశించింది. కాగా, యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగుడూరు పోలీసు స్టేషన్ పరిధిలో జూన్ నెలలో మృతి చెందిన మరియమ్మ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దొంగతనం కేసులో ఇంటరాగేషన్ పేరుతో మరియమ్మపై స్టేషన్లో థర్ఢ్ డిగ్రీ ప్రయోగించారు. మరియమ్మ దెబ్బలకు తాళలేక స్పృహ కోల్పోయింది. దీంతో పోలీసులు స్థానిక ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లారు. నాడి పరిశీలించిన వైద్యుడు పరిస్థితి విషమంగా ఉందని, పల్స్ దొరకడం లేదని చెప్పడంతో హుటాహుటిన భువనగిరి జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. అక్కడ పరిశీలించిన వైద్యులు చనిపోయినట్లు చెప్పారు. చదవండి: మరియమ్మ లాకప్‌డెత్‌పై సీబీఐ దర్యాప్తు వద్దు.. ‘ఆదేశిస్తే మేము సిద్ధం' దీనిపై వివిధ ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తం అవ్వడంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. దీంతో బాధితురాలుకు న్యాయం చేకురుస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇప్పటికే మరియమ్మ లాకప్ డెత్ కేసులో ముగ్గురు పోలీసు అధికారులను తెలంగాణ ప్రభుత్వం విధుల నుంచి తొలగించింది. ఎస్సై మహేశ్వర్, కానిస్టేబుల్స్ రషీద్, జానయ్యలను శాశ్వతంగా వీధుల నుండి బహిష్కరించింది. తొలగించిన పోలీసుల పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసినట్లు గతంలో ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. అయితే ఈ కేసును సీబీఐ విచారణకు అప్పగిస్తే ప్రజలకు పోలీసులపై నమ్మకం సన్నగిల్లే అవకాశం ఉందని డ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న దర్యాప్తు సంస్టల చేత విచారణ జరిపించేలా చూడాలని కోరారు. తాజాగా ఈ కేసును సీబీఐకి అప్పగించే విషయంపై తీర్పు వెలువరించింది. -
మరియమ్మ కేసు: బాధ్యులపై క్రిమినల్ చర్యలు ఎందుకు తీసుకోలేదు?
సాక్షి, హైదరాబాద్: మరియమ్మ లాకప్‌డెత్‌పై తెలంగాణ హైకోర్టు మరోసారి సీరియస్‌గా స్పందించింది. బాధితులకు పరిహారం ఇస్తే పోయిన ప్రాణం తిరిగొస్తుందా? అని.. ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. లాకప్ డెత్ బాధ్యులపై క్రిమినల్ కేసులు ఎందుకు పెట్టలేదని అధికారులను ప్రశ్నించింది. బాధ్యులైన పోలీసులను.. విధులు నుంచి తొలగిస్తే న్యాయం చేసినట్టేనా? అని.. తీవ్రంగా స్పందించింది. ఈ ఏడాది జూన్‌లో చర్చిపాస్టర్ బాలశౌరి ఇంట్లో దొంగతనం ఆరోపణలతో మరియమ్మను, ఆమె కుమారుడు ఉదయ్ కిరణ్‌ను అడ్డగూడూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాము.. దొంగతనం చేయలేదని చెప్పిన అధికారులు పట్టించుకోలేదు. ఆ తర్వాత వారిని తీవ్రంగా కొట్టారు. కాగా, ఎస్సై మహేష్, కానిస్టేబుల్ దెబ్బలకు తాళలేక మరియమ్మ జైలులోనే మృతి చెందింది. దీంతో పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి. ఈ క్రమంలో.. సీఎం కేసీఆర్ ప్రత్యేక విచారణ చేపట్టాలని డీజీపీని ఆదేశించారు. ఇప్పటికే ఎస్సై మహేష్‌తోపాటు, ఇద్దరు కానిస్టేబుళ్లను అధికారులు విధుల నుంచి తొలగించారు. తాజాగా పౌరహక్కులు ఈ ఘటనపై హైకోర్టుకు వెళ్లాయి. ఈ వ్యాజ్యాన్ని విచారించిన హైకోర్టు తాజాగా, సీబీఐ విచారణకు ఆదేశించింది. -
లాకప్ డెత్ మరియమ్మ కేసు సిబిఐకి
-
మరియమ్మ లాకప్‌డెత్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ
సాక్షి, హైదరాబాద్ : మరియమ్మ లాకప్‌డెత్ కేసుపై తెలంగాణ హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. మరియమ్మ మృతదేహానికి గత నెలలో రీపోస్ట్‌మార్టమ్ పూర్తైందని ఏజీ తెలిపారు. కుటుంబానికి రూ.15 లక్షల పరిహారం, ఉద్యోగం ఇచ్చినట్లు తెలియజేశారు. ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసినట్లు వివరించారు. ఈ నేపథ్యంలో దేశంలో ఇంకా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయా అని హైకోర్టు వ్యాఖ్యానించింది. పోయిన ప్రాణాలు పరిహారంతో తిరిగి వస్తాయా అని ప్రశ్నించింది. ఆలేరు మేజిస్ట్రేట్ నివేదిక అందిన తర్వాత విచారణ జరుపుతామని తెలిపింది. నివేదిక అందిన 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశించింది. మరియమ్మ లాకప్ డెత్‌పై విచారణ సెప్టెంబర్ 15కి వాయిదా వేసింది. -
మరియమ్మ లాకప్ డెత్ కేసులో కీలక మలుపు
-
పోలీసులు కొట్టడం వల్లే అమ్మ చనిపోయింది.. నా కళ్లారా చూశా
అడ్డగూడూరు/చింతకాని: ‘పోలీసులు కొట్టడంవల్లే మా అమ్మ చనిపోయింది. నేను కళ్లారా చూశా. గతనెల 27న డీజీపీ వచ్చి నన్ను, తమ్ముడిని విచారించినప్పుడు కూడా ఇదే విషయం చెప్పాను’అని అడ్డగూడూరు పోలీస్‌స్టేషన్‌లో లాకప్‌డెత్‌కు గురైన మరియమ్మ చిన్నకూతురు స్వప్న పేర్కొంది. సోమవారం తమ కుటుంబ సభ్యులతో కలిసి యాదాద్రి భువనగిరి డీసీపీ నారాయణరెడ్డి, అడ్డగూడూరు పోలీస్‌స్టేషన్ ఇన్చార్జ్ ఎస్ఐ ఉదయ్‌కిరణ్‌కు స్వప్న ఫిర్యాదు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, అమ్మచావుకు కారణమైన ఎస్ఐ మహేష్, కానిస్టేబుళ్లను హత్యానేరం కింద అరెస్ట్ చేస్తారని ఆశించాను కానీ ఇంతవరకు ఎలాంటి కేసు పెట్టలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఎస్ఐ మహేష్, కానిస్టేబుళ్లు, ఫాదర్ బాలశౌరిల పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి, వారికి శిక్షపడేలా చేసి మాకు న్యాయం చేయాలని కోరింది. వారిని ఉద్యోగం నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది. తమ కుటుంబానికి ప్రభుత్వం అందించిన ఆర్థిక సహాయానికి కృతజ్ఞతలు తెలిపింది. ఏపీ విద్యాశాఖ ముఖ్యసలహాదారు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి మాట్లాడుతూ, మరియమ్మ లాకప్ డెత్‌కు కారణం అయిన ఎస్ఐ, కానిస్టేబుళ్లను అరెస్ట్ చేయకుండా కేవలం సస్పెండ్ చేసి పోలీస్‌శాఖ చేతులు దులుపుకోవడం సరికాదన్నారు. ఎఫ్ఐఆర్లో మరియమ్మ డబ్బులు దొం గతనం చేసినట్లు నమోదు చేశారని, కానీ లాకప్ డెత్‌కు సంబంధించిన సమాచారం లేదన్నారు. ఒక ఎస్సీ మహిళను లాకప్‌డెత్ చేసిన పోలీసులను అరెస్ట్ చేయకుండా వదిలేయడం, వారు బయట తిరగడం సరికాదన్నారు. స్వప్నతోపాటు దళిత్ స్త్రీ శక్తి తెలంగాణ రాష్ట్ర కనీ్వనర్, హైకోర్టు అడ్వొకేట్ జాన్సీ గడ్డం, దళిత్ శక్తి కోఆర్డినేటర్ భాగ్యలక్షమ్మ, మరియమ్మ కుటుంబ సభ్యులు ఉన్నారు. -
మరియమ్మ మృతదేహానికి రీ పోస్టుమార్టం
చింతకాని: హైకోర్టు ఆదేశాల మేరకు అడ్డగూడూరు పోలీస్‌స్టేషన్‌లో మృతిచెందిన మరియమ్మ మృతదేహానికి రీపోస్టుమార్టం చేశారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం కోమట్లగూడెం గ్రామంలో, యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు జ్యుడీషియల్ మొదటి తరగతి మెజిస్ట్రేట్ సమక్షంలో వరంగల్ రీజినల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ బృందం, కాకతీయ మెడికల్ కళాశాల వైద్య బృందం శుక్రవారం రీ పోస్టుమార్టం నిర్వహించింది. దొంగతనం కేసులో జూన్ 17వ తేదీన యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీసులు మరియమ్మతోపాటు ఆమె కుమారుడు ఉదయ్‌కిరణ్, అతని స్నేహితుడు వేముల శంకర్లను విచారణ పేరుతో గ్రామం నుంచి తీసుకెళ్లి కొట్టడంతో అడ్డగూడూరు పోలీస్‌స్టేషన్‌లో మరియమ్మ మృతిచెందిన విషయం విదితమే. దీంతో మరియమ్మ మృతిపై న్యాయ విచారణ చేపట్టాలని పౌరహక్కుల సంఘం హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. మరియమ్మ లాకప్ డెత్ ఘటనపై న్యాయ విచారణ జరిపి నివేదిక అందజేయాలని ఆలేరు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్‌ను రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. జూన్ 18న మృతి చెందిన మరియమ్మ మృతదేహానికి అడ్డగూడూరు పోలీసులు పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించడంతో మృతురాలి స్వగ్రామమైన కోమట్లగూ డెంలో అంత్యక్రియలు నిర్వహించారు. అయితే న్యాయ విచారణలో భాగంగా గ్రామంలో పూడ్చిపెట్టిన మరియ మ్మ మృతదేహాన్ని 14 రోజుల తర్వాత వెలికితీసి ఆలేరు మేజిస్ట్రేట్ సమక్షంలో రీ పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మెజిస్ట్రేట్ మరియమ్మ ఇద్దరు కుమార్తెలు, అల్లుళ్లను విచారించి స్టేట్మెంట్ను రికార్డు చేశారు. -
మరియమ్మ లాకప్ డెత్ కేసు: మరో పోలీస్ అధికారిపై వేటు
సాక్షి, ఖమ్మం: దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్ ఘటనలో మరో పోలీస్ అధికారిపై వేటు పడింది. చింతకాని ఎస్ఐ రెడ్డబోయిన ఉమను ఖమ్మం పోలీస్ కమిషనరేట్‌కు ఎటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. రెండు రోజుల క్రితం ఖమ్మం లో పర్యటించి మరియమ్మ కుమారుడు ఉదయ్‌కిరణ్‌ను పరామర్శించిన డీజీపీ మహేందర్ రెడ్డి.. చింతకాని పీఏస్‌లో ఏమి జరిగిందన్న దానిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. డీజీపీ పర్యటన అనంతరం చింతకాని ఎస్ఐపై చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనలో మరి కొంతమంది పోలీస్ అధికారులపై వేటు పడే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే అడ్డగూడురు పోలీస్‌స్టేషన్‌కు చెందిన పోలీస్ అధికారులపై చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. మరియమ్మ లాకప్ డెత్ ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. మరియమ్మ ఘటనపై ఇంకా విచారణ కొనసాగుతోంది. చదవండి: నేరేడ్మెట్: చదువు కోసం వచ్చి.. వ్యభిచారం ఖమ్మం: భర్త చేత బలవంతంగా భార్య పన్ను పీకించి దారుణం -
‘మా కళ్లముందే అమ్మను చిత్రహింసలు పెట్టారు.. క్రూరంగా ప్రవర్తించారు’
సాక్షి, హైదరాబాద్/ఖమ్మం: ‘‘మా కళ్లముందే అమ్మను విచక్షణారహితంగా చితకబాదారు. పోలీసుల దెబ్బలు తట్టుకోలేకే అమ్మ చనిపోయింది. ఇలాంటి అన్యాయం ఏ కుటుంబానికి జరగొద్దు’’ అంటూ మరియమ్మ కూతుళ్లు ఆవేదన వ్యక్తం చేశారు. మహిళ అని కూడా చూడకుండా తమ తల్లిని ఇష్టారీతిన చిత్రహింసలకు గురిచేసి చంపేశారని కన్నీళ్లుపెట్టుకున్నారు. ఖమ్మం జిల్లా ముకుందాపురం గ్రామానికి చెందిన మరియమ్మ (40) యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీస్‌స్టేషన్‌లో దెబ్బలు తాళలేక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన విషయం విదితమే. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఈ లాకప్‌డెత్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ అన్ని వర్గాల నుంచి డిమాండ్లు వినిపించాయి. ఈ క్రమంలో శుక్రవారం ఈ ఘటనపై స్పందించిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు.. మరియమ్మ కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం, నివాస గృహం, 15 లక్షల ఎక్స్‌గ్రేషియాతో పాటు ఇద్దరు కూతుళ్లకు పది లక్షల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో సాక్షితో టీవీతో మాట్లాడిన మరియమ్మ కూతుళ్లు తమ తల్లి పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. ‘‘వంట మనిషిగా పనిచేసేందుకు అమ్మ వెళ్లింది. రెండు నెలల పాటు అంతా బాగానే ఉంది. తమ్ముడు నా దగ్గరే ఉండేవాడు. ఒకసారి.. అమ్మను చూడబుద్ధి అవుతోందని.. అమ్మకాడికి పోయి చూసి వచ్చిండు. రెండోసారి.. వెంబడి తన ఫ్రెండును పట్టుకుని పోయిండు. అప్పుడు.. యజమాని.. ఇంట్లో బీరువా గెలికినట్లు ఉందని అడిగారట. ఆ తర్వాత ఫాదర్ మాకు ఫోన్ చేసి.. రెండు లక్షలు పోయాయి. మీ అమ్మవాళ్లు ఇట్లా చేశారని చెప్పారు. అమ్మా వాళ్లు అట్లా చేయరని ఫాదర్ అని చెప్పాను. సర్లే అన్నారు. ఆయన కూడా బాగానే ఉన్నారు. అమ్మ మీద బాగా నమ్మకం. వారం టైం కూడా ఇచ్చారు. ఆ తర్వాత కేసు బెట్టంగనే పోలీసులు.. తమ్ముడిని, తన ఫ్రెండ్‌ను తీసుకునిపోయి ఘోరంగా కొట్టారంట. తమ్ముడి దగ్గర అసలేమీ లేవు. రెండోరోజు దెబ్బలు తట్టుకోలేక.. ఒకవేళ ఆడామె పేరు చెప్పినా వదిలిపెడతారేమో అనే ఆలోచనతోని, నా తల్లి మీద నెట్టారండి. ఏ పాపమైనా ఆమెకే తెలుసని అమ్మ మీదకు నెట్టేశారు. వాళ్లను అలా కొడుతుంటే అమ్మ ఏం మాట్లాడలేకపోయింది. ఆ తర్వాత నన్ను అడిగారు. ఏదైనా తెలిస్తే చెప్పమన్నారు. నాకేమీ తెలియదన్నాను. నేనే తప్పు చేయనపుడు ఎవరికీ భయపడను అని చెప్పాను. మీరెక్కడికి తీసుకెళ్లినా వస్తాను. నా దగ్గరైతే డబ్బు లేదని అమ్మ కూడా చెప్పింది. దీంతో.. వీళ్లంతా డ్రామాలు చేస్తున్నారని చెప్పి నన్ను కూడా వ్యాన్ ఎక్కించి చింతకాని తీసుకువెళ్లారు. బాగా కొట్టారు సార్. ఎంత క్రూరంగా అంటే అంత క్రూరంగా హింస పెట్టారు సార్ అమ్మను. అమ్మ ఒళ్లైతే ఇంత ఎత్తున వాచిపోయింది. నా కళ్లముందే నా తల్లిని చిత్రహింసలు పెడుతుంటే తట్టుకోలేకపోయానండి. నా పసిపిల్లను ఎత్తుకుని పోయిన. వాళ్లకు కొంచెం కూడా జాలిలేదు. మా ముందే అమ్మను ఘోరంగా కొట్టారు’’ అంటూ మరియమ్మ చిన్నకూతురు తమకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. ఇక పెద్దకూతురు మాట్లాడుతూ.. ‘‘మా అమ్మను మీకు అప్పజెప్పాం. అట్లనే తెచ్చియండి అని బాగా ఏడ్చినం. మీ వాళ్లను రప్పించుకోమని చెప్పారు. హార్ట్ ఎటాక్‌లాగా వచ్చింది ఆస్పత్రికి తీసుకెళ్లాం అన్నారు. భువనగిరి వెళ్లేసరికి డెడ్‌బాడీ చూపించారు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. చదవండి: Addagudur Lockup Death: సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు -
అడ్డగూడూరు లాకప్‌డెత్ కేసు: సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మరియమ్మ లాకప్‌డెత్‌పై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. అవసరమైతే ఈ ఘటనకు బాధ్యులైన వారిని ఉద్యోగం నుంచి తొలగించాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా... మరియమ్మ కుమారుడు ఉదయ్‌కిరణ్‌కు ప్రభుత్వ ఉద్యోగం, నివాస గృహంతో పాటు.. 15 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. అదేవిధంగా మరియమ్మ ఇద్దరు కుమార్తెలకు చెరో 10 లక్షల రూపాయల ఆర్థికసాయం అందించాలని ఆదేశించారు. కాగా యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీస్‌స్టేషన్‌లో దెబ్బలు తాళలేక మరియమ్మ అనే మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన విషయం విదితమే. ఖమ్మం జిల్లా ముకుందాపురం గ్రామానికి చెందిన మరియ (40) తన కుమారుడు ఉదయ్‌తో కలసి రెండు నెలల నుంచి వంట మనిషిగా పని చేసేవారు. ఈ క్రమంలో ఈ నెల 15న ఆమె పనిచేస్తున్న యజమాని ఇంట్లో సుమారు రూ.2 లక్షలు చోరీకి గురికాగా.. ఆయన అడ్డగూడూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విచారణలో భాగంగా తల్లి, కుమారుడిని పోలీసులు విచక్షణారహితంగా కొట్టగా, దెబ్బలకు తాళలేక మరియమ్మ స్పృహ తప్పి పడిపోయారు. చికిత్స నిమిత్తం మండలంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినా లాభం లేకపోవడంతో, అక్కడి నుంచి వెంటనే భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి ఆమె మృతి చెందారు. ఈ ఘటనపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ప్రభుత్వ తీరును నిరసిస్తూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. చదవండి: ‘మరియమ్మ కుటుంబానికి రూ.5కోట్ల పరిహారం ఇవ్వాలి’ -
పోలీస్‌స్టేషన్‌లో సీసీ కెమెరాలు ఎందుకు పెట్టలేదు?
సాక్షి, హైదరాబాద్: రాచకొండ పోలీస్ కమిషనరేట్ అడ్డగూడూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన దళిత మహిళ మరియమ్మ లాకప్‌డెత్ ఘటనపై న్యాయమూర్తితో విచారణ చేయించకపోవడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. పోలీసు కస్టడీలో మహిళ చనిపోతే నేర విచారణచట్టం (సీఆర్పీసీ)సెక్షన్ 176(1)(ఎ) ప్రకారం స్థానిక న్యాయమూర్తితో విచారణ జరిపించాలని స్పష్టంగా ఉన్నా.. ఆ దిశగా ఎందుకు చర్యలు చేపట్టలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ నిబంధన గురించి సంబంధిత అధికారులకు తెలియదా అంటూ నిలదీసింది. ఈ ఘటనపై ఆలేరు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్‌ను విచారణ జరపాలని ఆదేశించింది. ఈ నివేదికను నెల రోజుల్లోపు సీల్డ్ కవర్లో సమర్పించాలని పేర్కొంది. అవసరమైతే మృతదేహానికి రీ పోస్టుమార్టం చేయాలని కూడా మేజిస్ట్రేట్ ఆదేశించవచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఎంఎస్ రామచందర్‌రావు, జస్టిస్ టి.వినోద్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. లాకప్‌డెత్ ఘటనపై జ్యుడీషియల్ విచారణకు ఆదేశించాలంటూ పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ రాష్ట్ర కార్యదర్శి జయ వింధ్యాల దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ధర్మాసనం విచారించింది. మరియమ్మ, ఆమె కుమారున్ని ఈ నెల 15న పోలీసులు అదుపులోకి తీసుకొని తీవ్ర చిత్రహింసలకు గురిచేశారని పిటిషనర్ తరఫున న్యాయవాది పి.శశికిరణ్ వాదనలు వినిపించారు. పోలీసుల చిత్రహింసలు భరించలేక ఈనెల 18న మరియమ్మ చనిపోయిందని తెలిపారు. ఈ వ్యవహారంపై స్థానిక న్యాయమూర్తితో విచారణ జరిపించాలని, బాధిత కుటుంబానికి రూ.5 కోట్లు పరిహారం ఇప్పించాలని, ఈ మొత్తాన్ని మరియమ్మ మృతికి కారణమైన పోలీసు అధికారుల జీతాల నుంచి వసూలు చేసేలా ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. లాకప్‌డెత్ ఘటనపై ఇప్పటికే విచారణకు ఆదేశిం చామని, ఘటన జరిగిన సమయంలో ఉన్న కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశామని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ నివేదించారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) నిబంధనల మేరకు ఈ వ్యవహారంపై ఆర్డీవో విచారణ చేస్తున్నారని, పోస్టుమార్టంను వీడియో తీశామని తెలిపారు. మరియమ్మ మృతదేహాన్ని కుమార్తెకు అప్పగించామని, వారు ఖననం కూడా చేశారని వివరించారు. సీఆర్పీసీలో జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ తో మాత్రమే విచారణ చేయించాలని స్పష్టంగా ఉన్నా... ఎన్హెచ్ఆర్ నిబంధనల మేరకు ఆర్డీవో ఎలా విచారణ చేయిస్తారని ధర్మాసనం ప్రశ్నిం చింది. లాకప్‌డెత్ ఘటనపై ఆలేరు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్‌ను విచారణ జరిపి సీల్డ్కవర్లో నివేదిక సమర్పించాలని ధర్మాసనం ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది. మృతురాలి బంధువులకు నోటీసులు జారీ చేసి వాంగ్మూలాన్ని నమోదు చేయాలని ఆదేశించింది. పోలీస్‌స్టేషన్‌లో సీసీ కెమెరాలు ఎందుకు పెట్టలేదు? లాకప్‌డెత్ జరిగిన రోజుకు సంబంధించి పోలీస్ స్టేషన్‌లోని సీసీ కెమెరా రికార్డులను పెన్‌డ్రైవ్‌లో వేసి సీల్డ్కవర్లో హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌కు సమర్పించాలని ధర్మాసనం ఏజీకి సూచించగా... పోలీస్‌స్టేషన్ ఓ ప్రైవేట్ భవనంలో ఉందని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేదని నివేదించారు. దీనిపై ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ప్రతి పోలీస్‌స్టేషన్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని రెండేళ్ల క్రితం సుప్రీంకోర్టు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించినా ఇప్పటికీ ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించింది. సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించడం కోర్టుధిక్కరణ కిందకు వస్తుందని స్పష్టం చేసింది. సీసీ కెమెరాలు ఉంటే సదరు మహిళది సహజ మరణమా.. చిత్రసింహల వల్లే చనిపోయిందా.. అన్నది నిర్ధారణ అయ్యేదని ధర్మాసనం పేర్కొంది. పోలీస్ స్టేషన్లో సాధారణంగా ఎవరైనా చనిపోయినా ఎవరూ విశ్వసించరని, అలాంటప్పుడు సీసీ కెమెరా రికార్డు ఆధారంగా ఉంటుందని పేర్కొంది. నిజాయితీపరులైన పోలీస్ అధికారులు ఇబ్బందులు పడకూడదనే, వారి రక్షణ కోసమే పోలీస్స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని ధర్మాసనం గుర్తు చేసింది. -
లాకప్ డెత్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ
సాక్షి, హైదరాబాద్: మంథిని శీలం రంగయ్య లాకప్ డెత్ అంటూ దాఖలైన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు గురువారం విచారించింది. గతంలో ఈ కేసులో స్పెషల్ అధికారిగా హైదరాబాద్ సీపీ అంజనీకుమార్‌ను నియమించిన సంగతి తెలిసిందే. శీలం రంగయ్య డెత్‌కు సంబంధించిన రిపోర్ట్‌ను సీపీ అంజనీకుమార్ కోర్టుకు సమర్పించారు. రామగుండం సీపీ కాల్ డేటా హైకోర్టుకు అందజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆరు వారాల్లో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని పిటిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది. సీపీ సమర్పించిన అఫిడవిట్‌పై కౌంటర్ దాఖలు చేస్తామని పిటిషనర్ నాగమణి పేర్కొన్నారు. తదుపరి విచారణ ఆరు వారాల పాటు హైకోర్టు వాయిదా వేసింది. -
కస్టడీ డెత్: పోలీసులు చెప్పినవి అబద్ధాలే
చెన్నై: తమిళనాడులో తండ్రీకొడుకులు జయరాజ్, బెనిక్స్ కస్టడీ డెత్ కేసులో కీలక వీడియో వెలుగు చూసింది. దీని ప్రకారం పోలీసులు చెప్పిన ఎన్నో విషయాలు అబద్ధమని రుజువవుతోంది. ట్యుటికోరన్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో జూన్ 19న వారు నిర్వహించే మొబైల్ దుకాణం ముందు రద్దీ ఉందని, దీంతో వారిపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేయగా తండ్రీకొడుకులు ఎదురు తిరిగినట్లు పేర్కొన్నారు. కానీ తాజాగా బయటపడ్డ సీసీటీవీ ఫుటేజీలో దుకాణం ముందు ఎలాంటి రద్దీ లేదు. సాధారణంగా ఫోన్లో మాట్లాడుతున్న జయరాజ్ పోలీసులు పిలవడంతో వారి దగ్గరకు వెళ్లాడు. అతని వెనకాలే కొడుకు కూడా వెళ్లాడు. పైగా పోలీసులు అహంకారంతో దురుసుగా మాట్లాడినట్లు స్థానికులు తెలిపారు. అయినప్పటికీ వాళ్లు పోలీసులకు సహకరించారే తప్ప ఎలాంటి బెదిరింపులకు పాల్పడలేదని సీసీటీవీలో స్పష్టమవుతోంది. అక్కడ ఘర్షణ జరిగిన ఆనవాళ్లు కూడా లేవు. (వివాదాస్పదమైన తండ్రీ కొడుకుల మృతి) పోలీసులు బెనిక్స్ తండ్రిని వాహనంలో తీసుకు వెళుతుంటే అతడి కుమారుడు ఆ వాహనాన్ని అనుసరించాడు. సీసీటీవీలో వారు స్వంతంగా గాయపర్చుకున్నట్లు ఎక్కడా కనిపించకపోవడంతో వారికి వారే స్వతాహాగా గాయాలు చేసుకున్నారన్న వాదనలోనూ నిజం లేదని తేలింది. ఇక పోలీస్ స్టేషన్‌కు చేరుకునేసరికి పోలీసులు తన తండ్రిని దారుణంగా కొట్టడాన్ని బెనిక్స్ గమనించాడు. దీంతో అడ్డుకోబోయిన బెనిక్స్ను సైతం అదుపులోకి తీసుకుని దారుణంగా హింసించారు. దీంతో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న సమయంలోనే తండ్రీకొడుకులిద్దరూ ఒకరి తర్వాత మరొకరు మరణించారు. ఈ ఘటనపై ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్లు, ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేయగా మరో 15 మందిని బదిలీ చేశారు. ప్రస్తుతం సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపడుతున్నారు. (ఇండియా ‘జార్జి ఫ్లాయిడ్’లు) -
లాకప్ డెత్ కేసును సుమోటోగా స్వీకరించిన హెచ్ఆర్సీ
హైదరాబాద్: ఆసిఫ్ నగర్ లో చోటు చేసుకున్న నక్కల పద్మ లాకప్ డెత్ కేసును మానవహక్కుల కమిషన్(హెచ్ఆర్సీ) సుమోటోగా స్వీకరించింది. లాకప్ డెత్ ఘటనపై సెప్టెంబర్ 11లోగా నివేదిక ఇవ్వాలని హైదరాబాద్ సీపీని ఆదేశించింది. దీంతో పాటు ఉస్మానియా సూపరింటెండెంట్, కలెక్టర్లకు హెచ్ఆర్సీ ఆదేశాలు జారీ చేసింది. ఓ కేసుకు సంబంధించి నక్కల పద్మను ఆసిఫ్ నగర్ పోలీసు స్టేషన్‌కు తీసుకొచ్చి విచారించారు. ఎక్కువ సమయం పోలీసు స్టేషన్లో పెట్టడం వల్ల అస్వస్థతకు గురవడంతో శనివారం రాత్రి 11.30 గంటలకు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె తెల్లవారుజామున 4 గంటలకే మృతి చెందిందని తెలుస్తోంది. అయితే 6.30 గంటలకు చనిపోయిందని పోలీసులు చెబుతున్నారు. షుగర్ లెవల్స్, పల్స్ రేట్ పడిపోవడంతో కోమాలోకి వెళ్లి మరణించిందని అంటున్నారు. కాగా మృతురాలి శరీరంపై గాయాలు ఉన్నట్టు పోస్టుమార్టం నివేదికలో తేలింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే సీఐ, ఎస్సై, ఏఎస్సై తో సహా ఏడుగుర్ని నగర సీపీ మహేందర్ రెడ్డి సస్పెండ్ చేశారు. -
సీఐతో సహా ఆరుగురి సస్పెన్షన్
హైదరాబాద్: నగరంలో కలకలం రేపిన పద్మ అనే మహిళ లాకప్ డెత్ కేసుకు సంబంధించి సీఐతో సహా ఆరుగురు పోలీసులను సీపీ మహేందర్ రెడ్డి సస్పెండ్ చేశారు. ఈ ఘటనకు ప్రధాన కారణమైన సీఐ శ్రీకాంత్ , ఎస్సై రుషికేశ్, ఏఎస్సై చాంద్ పాషాలతో పాటు మరో ముగ్గురు కానిస్టేబుళ్లు ఖాజా, ప్రతాప్ , మంజూర్ ఆలీలను సీపీ సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై ఆదివారం పూర్తి విచారణ జరిపిన తరువాత వారిపై చర్యలు తీసుకున్నారు. ఆసిఫ్ నగర్ కు చెందిన పద్మ అనే మహిళను విచారణ పేరుతో పోలీసులు చిత్రహింసలకు గురిచేయడంతో ఆమె అపస్మారక స్థితికి చేరుకుంది. అయితే పోలీసులు గుట్టుచప్పుడు కాకుండా బాధిత మహిళను హుటాహుటిన ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందింది. పోలీసుల విచారణలోనే పోలీస్ స్టేషన్లో పద్మ మృతి చెందిందని.. అనంతరం ఉస్మానియాకు తరలించారని తెలుస్తోంది. అయితే.. పద్మది లాకప్ డెత్ కాదని, సహజ మరణమేనని పోలీసులు వాదించారు. కాగా, ఈ ఘటనపై మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా విచారణ చేపట్టిన సీపీ.. దీనికి కారణమైన ఆసిఫ్ నగర్ పోలీసులను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.


