రెండ్రోజుల పాటు ప్రభుత్వ వెబ్‌సైట్‌లు, ఆన్‌లైన్‌ సేవల నిలిపివేత

Telangana Government Official Announcement Cant Open Any Government Website For Two Days - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆధునిక యూపీఎస్‌ (అన్‌ ఇంటరప్టబుల్‌ పవర్‌ సోర్స్‌) ఏర్పాటు కోసం ఈ నెల 9వ తేదీ రాత్రి 9 గంటల నుంచి 11వ తేదీ రాత్రి 9 గంటల వరకు రాష్ట్ర ప్రభుత్వ వెబ్‌సైట్లతో పాటు ఆన్‌లైన్‌ సేవలు నిలిపివేస్తున్నట్లు స్టేట్‌ డేటా సెంటర్‌ (ఎస్డీసీ) ప్రకటించింది. 2010లో హైదరాబాద్‌ గచ్చిబౌలి టీఎస్‌ఐఐసీ సెంటర్లో నిర్మించిన ఎస్డీసీ 2011 నుంచి సేవలందిస్తోంది. ఈ సెంటర్‌ నుంచి వివిధ ప్రభుత్వ విభాగాలు తమ యాప్‌లు, వెబ్‌సైట్లను ప్రారంభించాయి. ప్రభుత్వ, పౌర సేవల్లో ఈ ఎస్డీసీ కీలకపాత్ర పోషిస్తోంది. ఎలాంటి ఆటంకాలు లేకుండా నిరంతరాయంగా ప్రభుత్వ, పౌరసేవలు అందించేందుకు పాత యూపీఎస్‌ స్థానంలో ఆధునిక యూపీఎస్‌ వ్యవస్థ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగే సందర్భాల్లో కొత్త వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తుంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top