
బూర్గంపాడు: మాజీ ఎమ్మెల్యే కుంజా భిక్షం(65) అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. గత 50 రోజులుగా హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా శనివారం బ్రెయిన్ స్ట్రోక్ రావటంతో మృతి చెందారు. బూర్గంపాడు నియోజకవర్గ శాసనసభ్యుడిగా 1989, 1994 ఎన్నికల్లో సీపీఐ తరఫున పోటీచేసి విజయం సాధించారు. పదేళ్లపాటు ఎమ్మెల్యేగా బూర్గంపాడు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశారు. ఆ తర్వాత కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆదివాసీ సమస్యలపై కుంజా భిక్షం నిరంతర పోరాటాలను కొనసాగించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ సమయంలో రెండేళ్లు పార్టీలో పని చేశారు. అనంతరం బీజేపీలో చేరారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే కుంజా భిక్షం మరణం పట్ల సీఎం కె.చంద్రశేఖర్‌రావు సంతాపం వ్యక్తంచేశారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
చదవండి: అందరికీ ఉచితంగా టీకా: సీఎం కేసీఆర్
చదవండి: దొరక్క దొరికిన ఆస్పత్రి బెడ్.. అంతలోనే