ఇద్దరు మంత్రులు.. మూడోసారి

Telangana Finance Minister Harish Rao Introduced The Annual Budget Three Times In Row - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర అసెంబ్లీలో వరుసగా మూడుసార్లు వార్షిక బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన ఘనతను ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, శాసనసభ వ్యవ హారాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సొంతం చేసుకున్నారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి హోదాలో హరీశ్‌రావు వరుసగా 2020–21, 2021–22, 2022–23 బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టారు. మంత్రి వేముల కూడా వరుసగా మూడు వార్షిక బడ్జెట్‌లను మండలిలో ప్రవేశపెట్టారు. సోమవారం ఉదయం హరీశ్‌ తన ఇంటి నుంచి అసెంబ్లీకి వెళ్తూ ఫిల్మ్‌నగర్‌ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కూడా ఈ పూజల్లో పాల్గొన్నారు. అసెంబ్లీకి చేరుకుని సీఎం కేసీఆర్‌ ఆశీర్వాదం తీసుకున్న హరీశ్‌.. స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డికి బడ్జెట్‌ ప్రతిని అంద జేశారు. మంత్రి వేములతో కలసి మండలికి వెళ్లి ప్రొటెమ్‌ చైర్మన్‌ అమీనుల్‌ జాఫ్రీతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. కాగా, ఉదయం 11.30కు ప్రారంభ మైన హరీశ్‌ బడ్జెట్‌ ప్రసంగం 1.57 నిమిషాల పాటు కొనసాగింది. 90 పేజీల ప్రసంగ పాఠంలో రాష్ట్రంపై కేంద్రం చూపుతున్న వివక్షతో పాటు ఏడేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం సాధించిన ఫలితాలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు నిధుల కేటాయింపు వంటి అంశాలను ప్రస్తావించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top