కరోనా ఎఫెక్ట్‌: తెలంగాణలో విద్యాసంస్థలు బంద్‌

Telangana: Education Institutions Will Be Close Due To Corona Virus - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మహమ్మారి కరోనా వైరస్‌ తీవ్రత నేపథ్యంలో తెలంగాణలో అన్ని విద్యాసంస్థలు మూత పడనున్నాయి. రేపటి నుంచి అన్ని పాఠశాలలు, కళాశాలలు మూసివేస్తున్నట్లు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా మంగళవారం ఆమె మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు. దీనిపై అసెంబ్లీలో ప్రత్యేక ప్రకటన చేశారు.

విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి సబిత వివరించారు. అయితే ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించుకోవచ్చని స్పష్టం చేశారు. అన్ని విద్యా సంస్థలు మూసి వేస్తూ ప్రకటించగా ఒక్క వైద్య కళాశాలలకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్య రీత్యా కరోనా వ్యాప్తి అరికట్టడంతో భాగంగా తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు మంత్రి సబిత వెల్లడించారు. కరోనా కట్టడికి ప్రజలు సహకరించాలని కోరారు. రాష్ట్రంలో ఒక్కసారిగా పెరుగుతున్న కరోనా కేసులతో తెలంగాణ సర్కార్‌ అప్రమత్తమవుతోంది. పాక్షిక లాక్‌డౌన్‌, రాత్రి పూట కర్ఫ్యూ వంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top