సొంతవారిపైనే ‘నోకాన్ఫిడెన్స్‌’!

Telangana: Counselor No Confidence Motion Against Municipal Chairman Brs Party - Sakshi

ఉమ్మడి నల్లగొండ నందికొండ మున్సిపాలిటీలో ఎమ్మెల్యే భగత్, ఎమ్మెల్సీ కోటిరెడ్డి వర్గీ­య కౌన్సిలర్ల మధ్య విభేదా­లు అవిశ్వాసానికి దారితీశాయి. చైర్‌పర్సన్‌ కర్న అనూషారెడ్డిపై ఎనిమిది మంది బీ­ఆర్‌­ఎస్‌ కౌన్సిలర్లు అవిశ్వా­సం నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి మెదక్‌ జిల్లా సంగారెడ్డి మున్సిప­ల్‌ చైర్‌పర్సన్‌ బొంగుల విజయలక్ష్మి, వైస్‌ చైర్‌పర్సన్‌ లతలపై బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపల్‌ చైర్మన్‌ కుడుముల సత్యనారాయణపై అ­వి­శ్వాస తీర్మానం పెట్టే క్రమంలో ఏడుగు­రు కౌన్సిలర్లు గోవా క్యాంపునకు వెళ్లా­రు. ఒక­టీ రెండు రోజుల్లో నోటీసులు ఇ­వ్వా­లనే ఆలోచనలో వారున్నట్టు సమాచారం. 

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: బల్దియాల్లో అవిశ్వాసాల రచ్చకు చెక్‌ పెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నప్పటికీ.. రాష్ట్రవ్యాప్తంగా పలు మున్సిపాలిటీల్లో అ­సంతృ­­ప్త కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానాలకు సై అంటున్నారు. కొన్నిచోట్ల చైర్మన్లు ఏకపక్షంగా వ్యవహరిస్తూ కౌన్సిలర్లను పట్టించుకోక పోవడంతో వా­రంతా గుర్రుగా ఉన్నారు. కొన్ని మున్సిపాలిటీల్లో అక్రమ కట్టడాలు, రియల్‌ఎస్టేట్‌ వెంచర్లు, ఇంటి నిర్మాణాల అనుమతుల్లో పెద్ద మొత్తంలో ముడుపులు చేతులు మారుతున్నాయి. ఈ పంపకాల్లో తే­డా­లు కూడా పలుచోట్ల అసంతృప్తికి దారితీసి అ­వి­శ్వాసాలకు కారణమవుతున్నాయనే ఆరోపణలు­న్నా­­­యి.

మరికొన్ని చోట్ల.. ఎన్నికల్లో రూ.లక్షలు ఖ­ర్చు చేసి గెలుపొందిన కౌన్సిలర్లు పలువురు అక్రమా­­లకు పాల్పడుతున్నారు. దీనిని చైర్మన్లు వ్యతిరేకించడం కౌన్సిలర్లకు మింగుడు పడటం లేదు. ఈ నేç­³థ్యంలోనే మూడేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న చైర్మన్లు, వైస్‌ చైర్మన్లపై నిబంధనల ప్రకారం అవిశ్వాస తీర్మానాలకు తెర లేపుతున్నారు. అయితే ప్రభుత్వం ఇటీవల చైర్మన్, వైస్‌ చైర్మన్లుగా ఉన్నవా­రు 4 ఏళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న పక్షంలో­నే అ­విశ్వాస తీర్మానాలు పెట్టే సవరణ బిల్లుకు ఇటీవల కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ప్రస్తుతం గవర్నర్‌ వద్ద పెండింగ్‌­లో ఉంది. దీంతో పలుచోట్ల అవిశ్వాసాల రచ్చ కొనసాగుతోంది. 

తిరుగుబాటు పార్టీపై కాదు 
ఒకటీ రెండు మినహా బల్దియాలన్నీ అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ చేతుల్లోనే ఉన్నాయి. అయితే దాదాపు అన్నిచోట్లా అధికార పార్టీ కౌన్సిలర్లే అవిశ్వాస తీర్మానాలకు నాయకత్వం వహిస్తున్నారు. వీరికి ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం కౌన్సిలర్లు మద్దతు తెలుపుతుండటం గమనార్హం. అయితే తాము పారీ్టకి వ్యతిరేకం కాదని, కేవలం చైర్మన్‌ పదవుల్లో కొనసాగుతున్న వారి తీరుకు మాత్రమే వ్యతిరేకమని కౌన్సిలర్లు పేర్కొంటున్నారు. పార్టీ ఆదేశాలకు కట్టుబడి ఉంటామని వారు స్పష్టం చేస్తున్నారు.  

కలెక్టర్లకు ప్రత్యేక ఆదేశాలు 
బల్దియాల్లో అవిశ్వాసాల రచ్చ కొనసాగుతున్న నేపథ్యంలో కలెక్టర్లకు ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. మున్సిపల్‌ చట్ట సవరణ బిల్లు గవర్నర్‌ వద్ద పెండింగ్‌లో ఉన్నందున అవిశ్వాస తీర్మానాల నోటీసులపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని, ఆ నోటీసులను మున్సిపల్‌ పరిపాలన శాఖకు పంపాలని ఆదేశించింది. నిబంధనల ప్రకారం అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టాలంటే ఆయా మున్సిపాలిటీల్లో ఉన్న కౌన్సిలర్ల సంఖ్యలో 50 శాతం మంది స్వయంగా కలెక్టర్‌ ముందు హాజరు కావాలి. తమకు సంబంధించిన వ్యక్తిగత ధ్రువీకరణ (ఐడెంటిటీ ప్రూఫ్‌) చూపించి కలెక్టర్‌ ముందే నోటీసుపై సంతకాలు చేయాలి. అనంతరం కలెక్టర్‌ సర్వ సభ్య సమావేశం తేదీ ప్రకటించాల్సి ఉంటుంది.

అయితే పలుచోట్ల కలెక్టర్లు అందుబాటులో లేకపోవడంతో అసమ్మతి కౌన్సిలర్లు అదనపు కలెక్టర్లకు, ఏఓలకు నోటీసులు అందజేస్తున్నారు. వారు తీసుకునేందుకు నిరాకరించడంతో ఇన్‌వర్డ్‌ సెక్షన్‌లలో ఇచ్చి వెళ్తున్నారు. ఇలా అవిశ్వాస నోటీసులు ఇస్తున్న కౌన్సిలర్లు ప్రత్యేక శిబిరాలకు వెళుతున్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపల్‌ కౌన్సిలర్లు ఏడుగురు గోవా వెళ్లారు. సంగారెడ్డి అసమ్మతి కౌన్సిలర్లు హైదరాబాద్‌లో ఓ రిసార్టుకు వెళ్లివచ్చారు. ‘మీరు ఇచ్చే నోటీసులు ప్రభుత్వ పరిశీలనకు పంపుతాం.. ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాల మేరకు తదుపరి చర్యలుంటాయి..’అంటూ సంగారెడ్డి మున్సిపల్‌ చైర్‌పర్సన్, వైస్‌ చైర్‌పర్సన్‌లపై అవిశ్వాస తీర్మానాల నోటీసు ఇచి్చన కౌన్సిలర్లకు ఆ జిల్లా కలెక్టర్‌ శరత్‌ స్పష్టం చేయడం గమనార్హం. అవిశ్వాస తీర్మానాలు తలనొప్పిగా మారడంతో ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు అసంతృప్తి కౌన్సిలర్లను బుజ్జగించే పనిలో పడ్డారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top