
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో స్వర్ణ పతకం సాధించిన నిజామాబాద్ జిల్లాకు చెందిన మహిళా బాక్సర్ నిఖత్ జరీన్‌కు టీపీసీసీ నగదు బహుమానం ప్రకటించింది. జరీన్‌కు రూ.5 లక్షల బహుమతి ఇస్తున్నట్టు టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి ఆదివారం ట్విట్టర్‌లో ప్రకటించారు.