నరకాసురులతో అప్రమత్తంగా ఉండాలి

Telangana CM Chandrasekhar Rao extends Diwali greetings to people - Sakshi

రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ సీఎం కేసీఆర్‌ సూచన 

సాక్షి, హైదరాబాద్‌: ‘మనం పయనించే ప్రగతిపథంలో అడుగడుగునా అడ్డుపడే నరకాసురులపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రాష్ట్ర ప్రజలకు సూచించారు. దీపావళి పండుగను పురస్కరించుకొని ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా, చీకటిని పారద్రోలే వెలుగుల పండుగగా దీపావళికి హిందూసంస్కృతిలో విశేషమైన ప్రాశస్త్యముందన్నారు.

జీవానికి సంకేతమైన అగ్ని కొలువైన దీపాల వెలుగులు మనలో అజ్ఞానాంధకారాన్ని తొలగించి, చైతన్యాన్ని రగిలించి నూతనోత్తేజంతో ముందడుగు వేసేలా ప్రేరణనిస్తాయని తెలిపారు. ప్రజల సంక్షేమాన్ని కోరి ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా పటాకులు కాలుస్తూ దీపావళి పండుగ జరుపుకోవాలని పిలుపునిచ్చారు. లక్ష్మీదేవి కృపాకటాక్షాలు తెలంగాణ ప్రజలపై ఉండాలనీ, ప్రతి ఇల్లు సకల శుభాలు, సిరి సంపదలతో విరాజిల్లాలని ఆకాంక్షించారు.  

రేవంత్‌ దీపావళి శుభాకాంక్షలు 
దీపావళి పండుగను రాష్ట్ర ప్రజలు సుఖశాంతు లతో ఘనంగా జరుపుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి ఆకాంక్షించారు. ఈ మేర కు ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయంగా దీపావ ళి పండుగను జరుపుకుంటామని, రాబోయే ఎన్నికలలో తెలంగాణకు పట్టిన చీకటి పోయి వెలుగులు రావడం ఖాయమని పేర్కొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top