ఈ నెల 21న తెలంగాణ కేబినెట్ భేటీ.. రుణ‌మాఫీపై చ‌ర్చ‌! | Telangana Cabinet Meeting On June 21st Discuss On Runa Mafi | Sakshi
Sakshi News home page

ఈ నెల 21న తెలంగాణ కేబినెట్ భేటీ.. రుణ‌మాఫీపై చ‌ర్చ‌!

Published Wed, Jun 19 2024 8:16 PM | Last Updated on Wed, Jun 19 2024 8:26 PM

Telangana Cabinet Meeting On June 21st Discuss On Runa Mafi

సాక్షి,  హైద‌రాబాద్: ఈ నెల 21న ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న మంత్రివ‌ర్గ స‌మావేశం జ‌ర‌గ‌నుంది. స‌చివాల‌యంలో జ‌రిగే ఈ స‌మావేశానికి మంత్రులు, ఆయా శాఖ‌ల ఉన్న‌తాధికారులు హాజ‌రు కానున్నారు. ఆగస్టు 15లోగా రైతు పంట రుణాల మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో.. ప్రధానంగా ఇదే అంశంపై క్యాబినెట్‌లో చర్చించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

రుణమాఫీకి సుమారు రూ.30వేల కోట్లు,  రైతుభరోసాకు మరో రూ.7వేల కోట్లు అవసరమవడంతో.. నిధుల సేకరణ ఎలా అనే అంశంపైనా మంత్రివర్గంలో చర్చించి కీలక నిర్ణయం తీసుకోనున్నారు. రుణ‌మాఫీతోపాటు, అసెంబ్లీ స‌మావేశాలు, బ‌డ్జెట్ రూప‌క‌ల్ప‌న‌, పంట‌ల బీమాతో పాటు ప‌లు అంశాల‌పై కేబినెట్‌లో చ‌ర్చించే అవ‌కాశం ఉంది.

 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement