25 రైళ్లు.. 50 వేల మంది..

Telangana BJP Arrangements For PM Narendra Modi Hyderabad Visit - Sakshi

మోదీ సభ కోసం నియోజకవర్గాల నుంచి జనాన్ని తరలించేందుకు బీజేపీ ఏర్పాట్లు

హైదరాబాద్‌లో కార్యకర్తలు, అభిమానుల కోసం మెట్రో రైళ్లు పెంచాలని విజ్ఞప్తి

సాక్షి, హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో నిర్వహించే ప్రధాని మోదీ బహిరంగ సభకు బీజేపీ ఏర్పాట్లు ముమ్మరం చేసింది. పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, అభిమానులను సభకు తరలించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. రాష్ట్రంలో రైలు నెట్‌వర్క్‌ అందుబాటులో ఉన్న నియోజకవర్గాల నుంచి.. సుమారు 25 రైళ్లలో 50 వేల మందిని సభకు తర లించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

బీజేపీ రాష్ట్ర ప్రధా న కార్యదర్శి ప్రదీప్‌కుమార్‌ ఈ వివరాలు వెల్లడిం చారు. వివిధ జిల్లాల నుంచి  వచ్చేవారు శివార్లలో వాహనాలు పార్క్‌ చేసి, మెట్రో రైళ్లలో సభాస్థలికి చేరుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఇక మోదీ సభకు తరలిరావాలని కోరుతూ సుమారు 10 లక్షల ఆహ్వాన పత్రికలను రాష్ట్రవ్యాప్తంగా బూత్‌ స్థాయిలో పంపిణీ చేస్తున్నట్టు వెల్లడించాయి.

వర్షం వచ్చినా ఆటంకం లేకుండా..
ప్రధాని బహిరంగసభలో వర్షం కురిసినా జనానికి ఇబ్బంది లేకుండా అధునాతన టెక్నాలజీతో కూడిన జర్మన్‌ హ్యాంగర్‌ టెంట్లను ఏర్పాటు చేస్తున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top