హైదరాబాద్‌లో ప్రధాని మోదీ రోడ్‌ షో | Telangana Assembly Elections 2023: PM Modi Road Show Today In Hyderabad Two Metro Rail Stations Will Closed - Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో ప్రధాని మోదీ రోడ్‌ షో

Published Mon, Nov 27 2023 2:34 PM

Telangana Assembly Elections PM Modi road show Two Metro Rail Stations will closed - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రధాన మంత్రి  నరేంద్రమోదీ హైదరాబాద్‌ రోడ్డు షోలో పాల్గొన్నారు ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌ నుంచి కాచిగూడ వరకు ప్రధాని రోడ్‌ షోలో పాల్గొన్నారు. ప్రధాని వెంట వాహనంపై కిషన్‌రెడ్డి, కె. లక్ష్మణ్‌లు ఉన్నారు. వారితో ర్యాలీలో 24మంది ఎమ్మెల్యే అభ్యర్థులు పాల్గొన్నారు.చిక్కడపల్లి నారాయణగూడ మీదుగా  ప్రధాని మోదీ రోడ్‌ షో సాగింది.  రోడ్‌ షోలో ప్రజాలకు అభివాదం చేస్తూ మోదీ ముందుకు సాగారు. ప్రధాని మోదీపై పూల వర్షం కురిపిస్తూ అభిమానులు, కార్యకర్తలు తమ అభిమానాన్ని చాటుకున్నారు. రోడ్‌ షో అనంతరం అమీర్‌పేట్‌ గురుద్వార్‌ను మోదీ సందర్శించారు. ఆపై కోటి దీపోత్సవం కార్యక్రమానికి మోదీ విశిష్ట అతిథిగా హాజరయ్యారు.

  • ప్రధాని మోదీ రోడ్‌ షో నేపథ్యంలో భద్రతాపరమైన చర్యల్లో భాగంగా రెండు మెట్రో స్టేషన్‌లను ఈ రోజు( సోమవారం ) సాయంత్రం మూసివేశారు.  రోడ్డు షో జరగనున్న చిక్కడపల్లి, నారాయణగూడ మెట్రో స్టేషన్లను సాయంత్రం 4.30 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు మూసివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు మెట్రో అధికారులు తెలిపారు.

  • ఈ సందర్బంగా  నగరంలో భారీగా బలగాలను మోహరించారు.  5వేల మందితో  బందోబస్తు ఏర్పాటు చేశారు. 

హైదరాబాద్ లో ట్రాఫిక్‌ ఆంక్షలు

  • మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు..
  • సాయంత్రం 5గంటలకు ఆర్టీసీ క్రాస్ రోడ్డు నుండి రోడ్ షో..
  • 2 కి.మీ మేర రోడ్‌ షో.. కాచిగూడలో ప్రధాని ప్రసంగం..
  • ర్యాలీలో పాల్గొననున్న గ్రేటర్ లోని 24మంది ఎమ్మెల్యే అభ్యర్థులు
  • బేగంపేట్‌ ఎయిర్‌పోర్టు నుంచి బేగంపేట్‌, గ్రీన్‌లాండ్స్‌, పంజగుట్ట, మొనప్ప ఐలాండ్‌, రాజ్‌భవన్‌, వీవీ విగ్రహం, నిరంకారీ భవన్‌..
  • ఖైరతాబాద్‌ ఫ్లైఓవర్‌, నెక్లెస్‌ రోటరీ, తెలుగు తల్లి జంక్షన్‌, కట్టమైసమ్మ ఆలయం, ఇందిరా పార్కు, అశోక్‌నగర్‌ ఆర్టీసి క్రాస్‌రోడ్స్‌కు చేరుకుంటారు. 
  • అక్కడి నుంచి నుంచి చిక్కడపల్లి, నారాయణగూడ, కాచిగూడ క్రాస్‌ రోడ్స్‌ వరకు రోడ్‌ షో ఉంటుంది.

Advertisement
Advertisement