కేసీఆర్‌కు కౌంటర్‌.. మునుగోడు ఎన్నికలపై తరుణ్‌చుగ్‌ కీలక వ్యాఖ్యలు

Tarun Chug Counter Attack On Cm KCR For Munugode Elections - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నికల వేడి కొనసాగుతోంది. ఎన్నికల నేపథ్యంలో అధికార టీఆర్‌ఎస్‌, బీజేపీ నేతల మధ్య మాటల వార్‌ నడుస్తోంది. కాగా, ఉప ఎన్నికల్లో 200 శాతం టీఆర్‌ఎస్‌ పార్టీదే విజయమని సీఎం కేసీఆర్‌ కామెంట్స్‌ చేసిన విషయం తెలిసిందే. 

సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలకు బీజేపీ కౌంటర్‌ ఇచ్చింది. తాజాగా తరుణ్‌చుగ్‌ మునుగోడు ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తరుణ్‌చుగ్‌ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. కారు స్టీరింగ్‌ ఒవైసీ చేతిలో ఉంది. మునుగోడులో బీజేపీ విజయం ఖాయం. రెండో స్థానం కోసం టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య పోటీ ఉంది. రిటైర్మెంట్‌ కోసమే కేసీఆర్‌ రాష్ట్రాల పర్యటనలు చేస్తున్నారు అని ఎద్దేవా చేశారు. 

ఇది కూడా చదవండి: అసెంబ్లీ సమావేశాలకు సిద్ధం కండి

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top