ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌కు చర్యలు తీసుకోండి  | Talasani Srinivas Yadav Comments On Sheep And Dairy Buffalo Insurance Claims | Sakshi
Sakshi News home page

ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌కు చర్యలు తీసుకోండి 

Feb 27 2022 1:33 AM | Updated on Feb 27 2022 3:59 PM

Talasani Srinivas Yadav Comments On Sheep And Dairy Buffalo Insurance Claims - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గొర్రెలు, పాడి గేదెల ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌లను పరిష్కరించేందుకు 15 రోజుల్లో చర్యలు తీసుకోవాలని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధిశాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అధికారులను ఆదేశించారు. శనివారం మాసబ్‌ట్యాంక్‌లోని పశుసంవర్ధక, మత్స్య, డెయిరీ శాఖల అధికారులతో మంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

ఇప్పటివరకు 3,86,366 యూనిట్ల గొర్రెలు పంపిణీ చేసినట్లు తలసాని చెప్పారు. డీడీలు చెల్లించిన లబ్ధిదారులకు త్వరలో గొర్రెలను పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.  లబ్దిదారులు తమ వాటా డీడీలను సంబంధిత పశువైద్యాధికారులకు అందజేయాలని కోరారు. మత్య్సకారులని సొసైటీలలో సభ్యులుగా నమోదుచేసే విధంగా కార్యాచరణ రూపొందించాలని మత్స్య శాఖ అధికారులను ఆదేశించారు.

మత్స్యకార సొసైటీలలో ఉన్న సభ్యులందరికీ సహకారచట్టంలోని అంశా లు, ప్రభుత్వం అందజేస్తున్న పథకాలపై, వారి అభ్యున్నతికి చేపడుతున్న కార్యక్రమాలపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పించడానికి కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. మత్స్యశాఖకు  బదిలీ అయిన గ్రామపంచాయతీ చెరువులు, కుంట లకు సంబంధించిన లీజు మొత్తాన్ని నిర్ణయించేం దుకు సమగ్రమైన సమాచారం కోసం ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేసి తదుపరి జరిగే జేఏసీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు.

జేఏసీ ప్రతినిధుల తదుపరి సమావే శం మార్చి 2వ వారంలో నిర్వహించేందుకు ఏర్పా ట్లు చేయాలని తలసాని ఆదేశించారు. ఈ సమావేశంలో పశుసంవర్ధక శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రెటరీ అదర్‌ సిన్హా, గొర్రెల అభివృద్ధి సమాఖ్య ఫెడరేషన్‌ చైర్మన్‌ దూదిమెట్ల బాలరాజ్‌ యాదవ్, డైరెక్టర్‌ రాం చందర్, మత్స్యశాఖ కమిషనర్‌ లచ్చిరాం భూక్యా, టీఎస్‌ఎల్‌డీఏ సీఈవో మంజువాణి పాల్గొన్నారు.     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement