‘యాదాద్రి ఒక అద్భుతమైన కట్టడం’

Swaroopanandendra Saraswati Praises Yadadri Temple - Sakshi

యాదాద్రి: తిరుమల‌ తిరుపతి దేవాలయం స్థాయిలో యాదాద్రి కూడా  అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నానని విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతీ ఆకాంక్షించారు. మంగళవారం యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న తర్వాత ఆయన ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు. ఆ తండ్రి పాదాల‌చెంత ఏకాదశి నాడు యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దర్శననం చేసుకోవాలని పది రోజుల క్రితం  ఆకాంక్ష కలిగింది‌.కరోనా భయకర పరిస్థితుల్లో ఎవరూ ఎటూ వెళ్లలేని పరిస్థితి.తమ శాఖలకు చెందిన భక్తులు అద్భుతంగా నిర్మిస్తున్నారని చెప్పారు. 

యాదాద్రి ఒక అద్భుతమైన కట్టడం. అలనాడు కృష్ణదేవరాయలు అహోబిలం, తిరుమల తిరుపతి దేవాలయాన్ని నిర్మిస్తే ఈరోజుకు కూడా చిరస్థాయిగా మిగిలాయి. హిందువులకు ఆజన్మాంతం పేరు ఉండేలా యాదాద్రి లాంటి ఆలయాన్ని కేసీఆర్  నిర్మించారు. ఈకాలంలో ఇలాంటి‌ నిర్మాణం మహాద్భుతం. దేవాలయం ఇప్పుడే ప్రారంభం అయింది కాబట్టి‌ చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నాయి‌. అవి కూడా పూర్తిగా తొలగిపోతాయి* అని స్వరూపానందేంద్ర సరస్వతీ పేర్కొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top